Printed on 21-06-2018 15:53:43 PM

ఆయుష్ ఉద్యోగుల‌కు న్యాయం చేస్తాం: వైయ‌స్ జ‌గ‌న్‌

నెల్లూరు: `ఎన్నిక‌ల ముందు ఇంటికొక ఉద్యోగం అని అధికారంలోకి రాగానే ఒక్క‌రికి కూడా ఉద్యోగం ఇవ్వ‌క‌పోగా.. ఉన్న ఉద్యోగాల‌నే పీకేస్తున్నారు` అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విమ‌ర్శించారు. `త‌మ‌కు జీతాలు రావ‌డం లేద‌ని, త‌మ‌ను ఉద్యోగాల్లో నుంచి తొల‌గించాల‌ని బాబు స‌ర్కార్ ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని, న్యాయం చేయాల‌ని` కోరుతూ ఆయుష్ ఉద్యోగులు కలిసిన నేప‌థ్యంలో వైయ‌స్ జ‌గ‌న్ పై విధంగా స్పందించారు. దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఉన్న‌ప్పుడు ఆయుష్ ఉద్యోగుల‌కు ఎలాంటి ఇబ్బందులు రాలేద‌ని, బాబు వ‌చ్చాక వాళ్ల బ‌తుకులు రోడ్డుపాల‌య్యే ప‌రిస్థితి నెల‌కొంద‌న్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం ఆయుష్ ఉద్యోగుల‌కు నెల‌కు రూ.12వేలు ఇస్తుంటే ఏపీ స‌ర్కార్ మాత్రం రూ.6700లు మాత్ర‌మే ఇస్తోంద‌ని వైయ‌స్ జ‌గ‌న్ దుయ్య‌బ‌ట్టారు. కాగా అధికారంలోకి రాగానే త‌మ‌ను ప‌ర్మినెంట్ చేస్తామ‌ని చెప్పిన చంద్ర‌బాబు చేయ‌కుండా మోసం చేసిన నేప‌థ్యంలో ఈ నెల 26వ తేదీ నుంచి నారావారిప‌ల్లెలోని చంద్ర‌బాబు ఇంటిముందు నిరాహార దీక్ష చేప‌డుతున్న‌ట్లు ఆయుష్ ఉద్యోగులు ఈ సంద‌ర్భంగా చెప్పారు.