Printed on 21-11-2017 11:44:08 AM

చేనేత రంగంపై జీఎస్టీ ర‌ద్దుకు కృషి చేస్తాం
నంద్యాల: కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని రద్దు చేయించాలని వైయ‌స్సార్‌ కడప జిల్లా వస్త్ర వ్యాపార సంఘాల ప్రతినిధులు ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డిలకు వినతి పత్రాన్నిఅందజేశారు.  జీఎస్టీ రద్దు చేయించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వస్త్రాలపై భవిష్యత్తులో ఎటువంటి పన్ను ఉండదని హామీ ఇచ్చి ఇప్పుడు మేం ధ‌ర్నా చేస్తున్నా క‌నీసం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఎంపీ, ఎమ్మెల్యేకు విన్న‌వించారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ అవినాష్‌రెడ్డి స్పందిస్తూ వస్త్రాలపై ప్రభుత్వం విధించిన జీఎస్‌టీ పన్ను విషయం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి పన్ను రద్దు చేసేందుకు కృషి చేస్తామని వారికి హామీనిచ్చారు.