Printed on 19-10-2018 21:08:33 PM

వైయస్‌ జగన్‌ను కలిసిన టీటీడీ ఉద్యోగులు
చిత్తూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు కలిశారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని వారు కలిసి సీపీఎస్‌ను రద్దు చేస్తామన్న వైయస్‌ జగన్‌ కు కృతజ్ఞతలు చెప్పారు. ఇళ్ల స్థలాలతో పాటు ఖాళీగా ఉన్న 7 వేల పోస్టులను భర్తీ చేయాలని కోరారు. కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలని వినతిపత్రం అందజేశారు.