Printed on 25-05-2018 18:34:11 PM

తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు


చిత్తూరు: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సొంత గ్రామాలతో ప్రజలకు ఉన్న చెక్కుచెదరని ఆత్మీయతలు, అనుబంధాలకు ప్రతీక సంక్రాంతి అని అన్నారు. సంక్రాంతి అంటేనే రైతులు, పల్లెలు ప్రతి ఒక్కరికీ గుర్తుకు రావడం సహజమని, పంటలు బాగా పండి రైతులు సంతోషంగా, ప్రతి ఒక్కరి ఇల్లు ఆనందంగా ఉండాలని వైయస్‌ జగన్‌ ఆకాంక్షించారు. భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటల, గాలి పటాల సందళ్లు, పైరు పచ్చల కళకళలు సంక్రాంతి పేరు చెబితేనే అందరికీ గుర్తుకు వస్తాయని జననేత అన్నారు. అన్నపూర్ణగా పేరుగాంచిన తెలుగు నేల మీద రైతన్నలు, గ్రామీణ వృత్తులవారు సుఖ, సంతోషాలతో తులతూగాలని వైయస్‌ జగన్‌ తన శుభాకాంక్షల సందేశంలో పేర్కొన్నారు.