Printed on 10-12-2018 01:12:12 AM

వైయ‌స్ఆర్‌ సీపీలో చేరిక

చిత్తూరు :తంబళ్లపల్లె, కుప్పం నియోజకవర్గాలకు చెందిన పలువురు టీడీపీ నాయకులు వైయ‌స్ఆర్‌ సీపీలో చేరారు. సదుం మండలం మిట్టపల్లెక్రాస్‌ వద్ద పీటీఎం మండలం బూర్లపల్లెకు చెందిన టీడీపీ ఎంపీటీసీ రమణప్ప ఆ పార్టీని వీడి వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. ఆయనకు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే కుప్పం నియోజకవర్గంలోని పెద్ద బంగారునత్తానికి చెందిన 20 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 
టీడీపీ నేత‌లు వైయ‌స్ఆర్‌ సీపీలో చేరిక

Printed on 10-12-2018 01:12:12 AM

టీడీపీ నేత‌లు వైయ‌స్ఆర్‌ సీపీలో చేరిక
 
చిత్తూరు:  ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరులో అధికార పార్టీ నుంచి వ‌ల‌స‌లు ప్రారంభ‌మ‌య్యాయి. నాలుగేళ్ల చంద్ర‌బాబు పాల‌న‌పై విసుకు చెందిన టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జ‌ల ప‌క్షాన చేస్తున్న పోరాటాల‌కు ఆక‌ర్శితుల‌వుతున్నారు. చిత్తూరు జిల్లా చంద్ర‌గిరినియోజ‌క‌వ‌ర్గం రామచంద్రాపురం మండలం నెత్తకుప్పానికి చెందిన పలువురు టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు  చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో జననేతను కలిసి  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నెత్తకుప్పం సర్పంచ్‌ బి.సుబ్రమణ్యయాదవ్, మాజీసర్పంచ్‌ సీ.సుబ్బరాయులు, వార్డు మెంబర్లు మునిశంకర్‌ నాయుడు, శ్రీనివాసులు, నీలమ్మ, ప్రభాకర్‌ నాయుడుతోపాటు వందమంది కార్యకర్తలకు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
వైయ‌స్ఆర్ సీపీలోకి తెలుగు త‌మ్ముళ్లు

Printed on 10-12-2018 01:12:12 AM

వైయ‌స్ఆర్ సీపీలోకి తెలుగు త‌మ్ముళ్లు
* వైయ‌స్ జ‌గ‌న్ స‌మక్షంలో పార్టీలో చేరిన 120 మంది
* జ‌గ‌న్ వ‌స్తేనే రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు న్యాయం జ‌రుగుతుంద‌న్న గొట్టిగుండాల వాసులు
నెల్లూరు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వ‌స్తేనే రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గం, కొండాపురం మండ‌లం, గొట్టిగుండాల వాసులు అన్నారు. బాబు పాల‌న‌పై విసుగు చెందామ‌ని,  జ‌గ‌న్‌పై న‌మ్మ‌కంతోపాటు న‌వ‌ర‌త్నాల‌తో అంద‌రికీ న్యాయం జ‌రుగుతుంద‌ని విశ్వ‌సించే జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరామ‌న్నారు. చంద్ర‌బాబు నాయుడు ఎన్నిక‌ల ముందు అలివికానీ హామీలు ఇచ్చార‌ని, అధికారంలోకి వ‌చ్చి నాలుగేళ్లు అవుతున్నా ఏ ఒక్క‌టీ నెర‌వేర్చ‌లేద‌ని గొట్టిగుండాల వాసులు విమ‌ర్శించారు. బాబును ప్ర‌జ‌లు న‌మ్మే ప‌రిస్థితి లేద‌న్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుకు ప్ర‌జ‌లు గుణ‌పాఠం చెప్ప‌డం ఖాయ‌మ‌న్నారు. కాగా ఒక యువ‌కుడు మాట్లాడుతూ చంద్ర‌బాబు ఇంటికొక ఉద్యోగం ఇస్తామంటే చంద్ర‌బాబుకు ఓట్లు వేశామ‌ని, ఉద్యోగాలు ఇవ్వ‌క‌పోగా ఉన్న ఉద్యోగాల‌ను పీకేస్తున్నార‌న్నారు. తాను బీఏ బీఈడీ చ‌దివాన‌ని, త‌న భార్య బీఎస్సీ బీఈడీ చ‌దివి నిరుద్యోగులుగా ఉన్నామ‌న్నారు. బాబు ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క నోటిఫికేష‌న్ వ‌దిలిన పాపాన పోలేద‌న్నారు. బాబు పాల‌న‌లో ఎవ‌రికీ న్యాయం జ‌ర‌గ‌లేద‌ని మండిప‌డ్డారు. రాజ‌న్న రాజ్యం రావ‌డం ఖాయ‌మ‌ని త్వ‌ర‌లో అంద‌రికీ మంచి జ‌రుగుతుంద‌ని వారు ఆశాభావం వ్య‌క్తం చేశారు. 
Attachments 
టీడీపీ నేతలు వైయస్‌ఆర్‌ సీపీలో చేరిక

Printed on 10-12-2018 01:12:12 AM

టీడీపీ నేతలు వైయస్‌ఆర్‌ సీపీలో చేరిక
ప్రకాశం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంక్షేమం కోసం చేస్తున్న పోరాటాలకు ఆకర్షితులై పలువురు టీడీపీ నేతలు వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. పర్చూరు నియోజకవర్గం హనుమోజీపాలెం వద్ద టీడీపీ నేతలకు వైయస్‌ జగన్‌ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ.. 25 సంవత్సరాలుగా టీడీపీకి సేవలు చేశామని, కానీ నేడు చంద్రబాబు వైఖరితో విసుగొస్తుందన్నారు. ప్రత్యేక హోదా అంశంపై ముఖ్యమంత్రి పూటకో మాట మాట్లాడుతున్నారన్నారు. వైయస్‌ జగన్‌ ప్రజల కోసం అనేక పోరాటాలు చేస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా వైయస్‌ జగన్‌ వల్లే సాధ్యమన్నారు.  
టీడీపీ నేత‌లు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

Printed on 10-12-2018 01:12:12 AM

టీడీపీ నేత‌లు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌


క‌ర్నూలు:  క‌ర్నూలు జిల్లాలో  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వ‌ల‌స‌లు ప్రారంభ‌మ‌య్యాయి.  మ‌ంత్రి భూమా అఖిల ప్రియ‌కు ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో పెద్ద దెబ్బ త‌గిలింది. టీడీపీకి చెందిన కీల‌క నేత‌లు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. నియోజ‌క‌వ‌ర్గంలోని శిరివెళ్ల మండ‌లానికి చెందిన టీడీపీ నాయ‌కులు ఎమ్మెల్సీ గంగుల ప్ర‌భాక‌ర్‌రెడ్డి నేతృత్వంలో వైయ‌స్ఆర్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి గంగుల ప్ర‌భాక‌ర్‌రెడ్డి పార్టీ కండువాలు క‌ప్పి సాద‌రంగా ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా పార్టీలో చేరిన నాయ‌కులు మాట్లాడుతూ..వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జ‌ల కోసం చేస్తున్న పోరాటాల‌కు ఆక‌ర్శితుల‌మై వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన‌ట్లు చెప్పారు. టీడీపీ నేత‌లు రోజుకో మాట మాట్లాడుతూ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతున్నార‌న్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమ‌లు చేయ‌లేద‌న్నారు. వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్య‌మ‌వుతుంద‌న్నారు. 
టీడీపీ నాయకులు వైయస్‌ఆర్‌సీపీలో చేరిక

Printed on 10-12-2018 01:12:12 AM

టీడీపీ నాయకులు వైయస్‌ఆర్‌సీపీలో చేరిక

గుంటూరు: గుంటూరు జిల్లాలో అధికార తెలుగు దేశం పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ నిమ్మకాయల ఆదినారాయణ, సత్తెనపల్లి మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆతుకూరి నాగేశ్వరరావులు వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మంగళవారం సత్తెనపల్లెకు చేరుకున్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో వీరు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి వైయస్‌ జగన్‌ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.  కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ నాయకులు  అంబటి రాంబాబు, బాలశౌరి, ఎమ్మెల్యేలు ఉన్నారు.
 
వైయ‌స్ఆర్‌సీపీలోకి ఊపందుకున్న వ‌ల‌స‌లు

Printed on 10-12-2018 01:12:12 AM

వైయ‌స్ఆర్‌సీపీలోకి ఊపందుకున్న వ‌ల‌స‌లు
అనంత‌పురం:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వ‌ల‌స‌లు ఊపందుకున్నాయి. ప్ర‌తి రోజూ ఎక్క‌డో ఓ చోట అధికార పార్టీ నాయ‌కులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రజల సమస్యల కోసం నిరంతర పోరాటం చేస్తున్న వైయ‌స్ జ‌గ‌న్‌కు రోజు రోజుకు మ‌ద్ద‌తుగా పెరుగుతోంది. అనంతపురం అర్భన్ నియోజవర్గ టీడీపీ నేత లింగాల రమేష్ సహా 200 మంది కార్యకర్తలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. నియోజకవర్గ వైయ‌స్ఆర్‌ సీపీ సమన్వయకర్త నదీం అహ్మద్  టీడీపీ నేతలను పార్టీలోకి ఆహ్వానించారు. వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రత్యేక హోదా కోసం చేస్తున్న ఉద్యమాలకు ఆకర్షితులమయ్యామని, ఏపీ ప్రయోజనాలను చంద్రబాబు కాపాడలేకపోయినందుకే పార్టీని వీడుతున్నట్టు లింగాల రమేష్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కాగా ఇటీవలే గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ నిమ్మకాయల ఆదినారాయణ, సత్తెనపల్లి మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆతుకూరి నాగేశ్వరరావులు వైయ‌స్‌ జగన్‌ సమక్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. అదే విధంగా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన టీడీపీ సీనియర్ నేత జ్యోతుల చంటిబాబు, క‌ర్నూలు, అనంత‌పురం జిల్లాల‌కు చెందిన ప్ర‌ముఖ వైద్యులు వైయ‌స్ఆర్‌ సీపీలో చేరిన విషయం తెలిసిందే. 

కుప్పంలో బాబుకు షాక్‌

Printed on 10-12-2018 01:12:12 AM

కుప్పంలో బాబుకు షాక్‌
- వంద మంది వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌
చిత్తూరు:  ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై తిరుగుబాటు ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం నుంచే మొద‌లైంది. టీడీపీకి చెందిన వంద మంది ప్ర‌భుత్వ పాల‌న‌పై విసుకుచెంది వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. నియోజ‌క‌వ‌ర్గంలోని వీర్నమల పంచాయతీ వేమనపల్లెకి చెందిన దాదాపు 100 మంది యువకులు తెలుగుదేశం నుంచి చంద్రమౌళి సమక్షంలో వైయ‌స్ఆర్‌సీపీ  చేరారు. ఈ సందర్భంగా వీర్నమల గ్రామంలో పార్టీ జెండాను చంద్రమౌళి ఆవిష్కరించారు. వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే వీర్నమల పంచాయతీని 4 చిన్న పంచాయతీలు గా విభజించి అభివృద్ధి జరిగేటట్లు చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.  కార్య‌క్ర‌మంలో పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గాయత్రీదేవీ , కృష్ణారెడ్డి, చంద్రారెడ్డి, బాబురెడ్డి, రవి నాయక్, చిన్నరాజు నాయక్, మోహన్‌ నాయక్, భాస్కర్‌ నాయక్, కుమార్, గోవిందప్ప, నారాయణస్వామి, బరకత్, రామేగౌడు, మునెమ్మ, ఇంద్రప్ప, మునెప్ప, గంగయ్య, సిద్ధప్ప, మురళి, అప్పి తదితరులు పాల్గొన్నారు. 

టీడీపీ నాయ‌కులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

Printed on 10-12-2018 01:12:12 AM

టీడీపీ నాయ‌కులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌
విశాఖ‌: విజయనగరం టీడీపీ కార్యకర్తలు వైయ‌స్ఆర్‌సీపీ  జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఎమ్మెల్సీ వీరభద్రస్వామి, చినశ్రీను సమక్షంలో వైయ‌స్ఆర్‌ సీపీలో చేరారు. గుత్తిరాల వెంకటేశ్వరరావు, కొండపల్లి సునీల్, కోకర్ల మస్తాన్‌ చౌదిరి,మయనేన మోషన్‌సాయి,పెలిశేటి రమేష్,పర్వతనేని సత్యనారాయణ,కడియాల రామకృష్ణ(ఆర్‌.కె) పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.  ఈ సందర్భంగా విజ‌య‌సాయిరెడ్డి మాట్లాడుతూ..పార్టీ బ‌లోపేతానికి ప్ర‌తి ఒక్క‌రూ సైనికుళ్లా పని చేయాల‌ని పిలుపునిచ్చారు. 

టీడీపీ నాయ‌కులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

Printed on 10-12-2018 01:12:12 AM

టీడీపీ నాయ‌కులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

శ్రీ‌కాకుళం:   జిల్లాలో వ‌ల‌స‌లు మొద‌ల‌య్యాయి. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ఆక‌ర్శితులై అధికార పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ప్ర‌తిప‌క్షంలో చేరుతున్నారు. నరసన్నపెట మండలంలోని టీడీపీ నాయ‌కులు శుక్ర‌వారం వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు ధ‌ర్మాన కృష్ణ‌దాస్ ఆధ్వ‌ర్యంలో  టీడీపీ నాయ‌కుడు, ఎంపీటీసీ స‌భ్యుడు క‌లాం,  మాజీ సర్పంచ్ జల్లు,  పార్వతీశం, రాజిబాబు త‌దిత‌రులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి కృష్ణ‌దాస్ కండువాలు క‌ప్పి పార్టీలో సాద‌రంగా ఆహ్వానించారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ముఖ్య‌మంత్రిని చేసుకుందామ‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.
టీడీపీ నేతలు వైయస్‌ఆర్‌సీపీలో చేరిక

Printed on 10-12-2018 01:12:12 AM

టీడీపీ నేతలు వైయస్‌ఆర్‌సీపీలో చేరిక
పశ్చిమ గోదావరి: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు పలువురు నేతలు ఆకర్శితులవుతున్నారు. బుధవారం లిఖితపూడికి చెందిన టీడీపీ నాయకుడు చిట్టిబాబుతో పాటు 50 కుటుంబాలు వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరాయి. వీరికి వైయస్‌ జగన్‌ కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. చిట్టిబాబు మాట్లాడుతూ టీడీపీ పాలనలో ఏ ఒక్కరికి మేలు జరగలేదని విమర్శించారు. మా గ్రామంలో తాగేందుకు మంచినీరు లేదని, తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైందన్నారు. 
 
టీడీపీ ఎంపీ తోట నర్సింహకు ఎదురుదెబ్బ

Printed on 10-12-2018 01:12:12 AM

టీడీపీ ఎంపీ తోట నర్సింహకు ఎదురుదెబ్బ
సుమారు 500ల మంది కార్యకర్తలతో వైయస్‌ఆర్‌ సీపీలో చేరిన ఎంపీ అనుచరులు
తూర్పుగోదావరి: తెలుగుదేశం పార్టీ ఎంపీ తోట నర్సింహకు జగ్గంపేట నియోజకవర్గంలో ఎదురుదెబ్బ తగిలింది. జగ్గంపేట నియోజకవర్గంలోని ఎంపీ ముఖ్య అనుచరులు బండారు రాజా, ఎంపీటీసీ సత్యనారాయణలు సుమారు 500ల మంది కార్యకర్తలతో కలిసి వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. ఈ మేరకు వైయస్‌ఆర్‌ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ జ్యోతుల చంటిబాబు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ మేరకు బండారు రాజా, సత్యనారాయణలు మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో టీడీపీ విఫలమైందన్నారు. ప్రభుత్వంపై విసుగుచెంది వైయస్‌ఆర్‌ సీపీలో చేరుతున్నట్లు చెప్పారు. అనంతరం జ్యోతుల చంటిబాబు మాట్లాడుతు రాజన్న రాజ్యం వైయస్‌ జగన్‌తోనే సాధ్యమని, వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకునేందుకు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. 
తూర్పున వైయ‌స్ఆర్‌సీపీలో వ‌ల‌స‌ల వెల్లువ‌

Printed on 10-12-2018 01:12:12 AM

తూర్పున వైయ‌స్ఆర్‌సీపీలో వ‌ల‌స‌ల వెల్లువ‌

 
తూర్పుగోదావరి :  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వ‌ల‌స‌లు ఊపందుకున్నాయి. అధికార పార్టీకి చెందిన ప‌లువురు వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు ఆక‌ర్శితుల‌వుతున్నారు.  ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో పాద‌యాత్ర‌గా బ‌య‌లుదేరిన వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో రాజమహేంద్రవరం నగరానికి చెందిన పలువురు ప్రముఖులు పార్టీలో చేరారు. సిటీ కో ఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు ఆధ్వర్యాన ప్రముఖ వ్యాపారవేత్త పిల్లి సిరిబాల, గౌతమీ జీవకారుణ్య సంఘం మాజీ చైర్మన్‌ పోలసనపల్లి హనుమంతురావు, మాజీ కార్పొరేటర్‌ సూరవరపు రాజ్యలక్ష్మి, రామారావు, పెద్ద వెంకటేశ్వర్లు, చెల్లిబోయిన సూర్యనారాయణమూర్తి పార్టీలో చేరారు. వారికి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రౌతు మాట్లాడుతూ, కొత్తగా పార్టీలో చేరినవారు పార్టీ అభివృద్ధికి తమవంతు సహాయ సహకారాలు అందించాలని, వైయ‌స్ జగన్‌ను ముఖ్యమంత్రి చేసేంతవరకూ అహర్నిశలూ శ్రమించాలని సూచించారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీ నగర మాజీ అధ్యక్షుడు నక్కా శ్రీనగేష్‌ రాజమహేంద్రవరంలో వైయ‌స్‌ జగన్‌ సమక్షంలో వైయ‌స్ఆర్‌ సీపీలో చేరారు.జననేత సమక్షంలో పార్టీలోకి టీడీపీ నేతలు

Printed on 10-12-2018 01:12:12 AM

జననేత సమక్షంలో పార్టీలోకి టీడీపీ నేతలుతూర్పుగోదావరి: చంద్రబాబు మోసాలకు తాళలేక టీడీపీ నేతలు వైయస్‌ఆర్‌ సీపీలోకి వలసలు కడుతున్నారు. ప్రజా సమస్యల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు సిద్ధమవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో టీడీపీ నేత సూర్యప్రకాష్, బీసీ మహిళా సంఘం నాయకురాలు జుత్తుక వరలక్ష్మి వారి అనుచరులతో వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. ఈ మేరకు జననేత వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 
వైయ‌స్ఆర్‌ సీపీలో భారీ చేరికలు

Printed on 10-12-2018 01:12:12 AM

వైయ‌స్ఆర్‌ సీపీలో భారీ చేరికలు

విశాఖ‌:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు వివిధ ప్రాంతాల నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఆక‌ర్శితుల‌వుతున్నారు. విశాఖ జిల్లాలో భారీ ఎత్తున టీడీపీ నాయ‌కులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు.  పరవాడ మండలం సాలాపువానిపాలెంలో టీడీపీకి చెందిన 50 కుటుంబాల వారు వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. వైయ‌స్ఆర్‌సీపీ గ్రామ అధ్యక్షుడు సాలాపు నానాజీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ సీనియర్‌ నాయకుడు, జన్మభూమికమిటీ సభ్యుడు సాలాపు అప్పారావు, మాజీ ఉప సర్పంచ్‌ సాలాపు కనకరాజు, వార్డు సభ్యుడు సాలాపు నూకరాజు, లారీ ఓనర్లు సాలాపు శ్రీనివాసరావు, నానాజీ, రామకృష్ణ, అప్పలనాయుడు, బాబూరావుతో పాటు 50 కుటుంబాలకు చెందిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బక్కన్నపాలెం మాజీ ఉపసర్పంచ్‌ ఆర్‌. స్వామినాయుడు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు తైనాల విజయకుమార్‌  పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయా కార్య‌క్ర‌మాల‌లో  అనకాపల్లి పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌, అనకాపల్లి పార్లమెంట్‌ నియోకవర్గ ఇన్‌చార్జ్‌ వరుదు కల్యాణి, పెందుర్తి నియోజకవర్గ కోఆర్డినేటర్‌ అన్నంరెడ్డి అదీప్‌రాజు, పార్టీ జిల్లా కార్యదర్శి ఇల్లపు ప్రసాద్, పెందుర్తి నియోజకవర్గం నాయకులు పైలా శ్రీనివాసరావు, 56వ వార్డు పార్టీ అధ్యక్షుడు జి.పూర్ణానందశర్మ (పూర్ణ), పరవాడ మండల అధ్యక్షుడు  సిరపురపు అప్పలనాయుడు, పరవాడ సర్పంచ్‌ చుర్కా రామునాయుడు, నాయకులు  సుందరపు అప్పారావు, పచ్చికోరు రమణమూర్తి, సేనాపతి గంగరాజు   త‌దిత‌రులు పాల్గొన్నారు.


 

టీడీపీ నాయ‌కులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

Printed on 10-12-2018 01:12:12 AM

టీడీపీ నాయ‌కులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌
తూర్పు గోదావ‌రి:  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. ఇటీవ‌ల అనపర్తి మాజీ ఎమ్మెల్యే తేతలి రామారెడ్డి సహా పలువురు నేతలు వైయ‌స్‌ జగన్‌ సమక్షంలో వైయ‌స్ఆర్‌ సీపీలో చేరారు. తాజాగా టీడీపీకి చెందిన ప‌లువురు వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. మంగ‌ళ‌వారం టీడీపీ నాయ‌కులు కే. విష్ణుచ‌క్రం, జీ. స‌త్య‌నారాయ‌ణ‌,జి. సుబ్ర‌మ‌ణ్యం, కే.గంగ‌రాజు, కే.సుబ్బారావు, దాస‌రి బంగార‌య్య త‌దిత‌రులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. వారికి వైయ‌స్‌ జగన్‌ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయ‌కులు మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో అవినీతి రాజ్యమేలుతుందని విమర్శించారు. మహానేత వైయ‌స్ఆర్‌  తనయుడు వైయ‌స్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే మళ్లీ రాజన్న రాజ్యం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. వైయ‌స్‌ జగన్‌ను సీఎంను చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు.  
టీడీపీ నేతలు వైయస్‌ఆర్‌సీపీలో చేరిక

Printed on 10-12-2018 01:12:12 AM

టీడీపీ నేతలు వైయస్‌ఆర్‌సీపీలో చేరిక

విజయనగరం: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు అధికార పార్టీ నేతలు ఆకర్శితులవుతున్నారు. నిత్యం ఏదో ఒక జిల్లాలో టీడీపీ నేతలు ఆ పార్టీని వీడి వైయస్‌ఆర్‌సీపీలో చేరుతున్నారు. తాజాగా విజయనగరం పట్టణానికి చెందిన ఆయా కాలనీల టీడీపీ నాయకులు 150 మంది వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు, ఎమ్మెల్సీ కొలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. వారికి కండువాలు కప్పి కొలగట్ల వీరభద్రస్వామి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొలగట్ల మాట్లాడుతూ..నాలుగేళ్లలో రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు పెరిగాయని మండిపడ్డారు. టీడీపీ పాలనకు విసుగు చెంది వైయస్‌ఆర్‌సీపీలోకి రావడం అభినందనీయమన్నారు. అన్ని రంగాలలో ఉత్తరాంధ్ర వెనుకబడిపోయిందన్నారు. జిల్లా నుంచి ప్రజలు వలస వెళ్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే రాజన్న రాజ్యం సాధ్యమవుతుందన్నారు. వైయస్‌ జగన్‌ను సీఎం చేసేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
 
వైయస్‌ఆర్‌సీపీలో పెరుగుతున్న చేరికలు

Printed on 10-12-2018 01:12:12 AM

వైయస్‌ఆర్‌సీపీలో పెరుగుతున్న చేరికలు
 తూర్పు గోదావరి:  వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలతో పలువురు పార్టీల నాయకులు వైయస్‌ఆర్‌సీపీ వైపు ఆకర్శితులవుతున్నారు. రోజు రోజుకు వైయస్‌ఆర్‌సీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. ఇవాళ  పలువురు నేతలు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. వైయస్‌ జగన్‌ ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలతో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు.  వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితే రైతులకు మంచి జరుగుతుందన్నారు. చంద్రబాబు కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేశారని మండిపడ్డారు. వైయస్‌ జగన్‌కు తోడుగా ఉంటామని పేర్కొన్నారు. 
 
టీడీపీ నాయ‌కులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

Printed on 10-12-2018 01:12:12 AM

టీడీపీ నాయ‌కులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌


తూర్పు గోదావ‌రి: ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ప‌లువురు ఆక‌ర్శితుల‌వుతున్నారు. నిత్యం ఏదో ఒక ప్రాంతం నుంచి వివిధ పార్టీల‌కు చెందిన నాయ‌కులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరుతున్నారు. ఇవాళ పిఠాపురంలో వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో ఏఎంసీ మాజీ చైర్మన్‌ బాబ్జీ, శ్రీ సంస్థానం మాజీ చైర్మన్‌ రామకృష్ణతో పాటు మరో ఆరుగురు టీడీపీ నాయకులు  వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. వారికి పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ కండువాలు క‌ప్పి సాద‌రంగా ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా పార్టీలో చేరిన బాబ్జి మాట్లాడుతూ..2014 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు హామీలు న‌మ్మి మోస‌పోయామ‌న్నారు. ఏ ఒక్క వాగ్ధానం కూడా చంద్ర‌బాబు నెర‌వేర్చ‌లేద‌ని మండిప‌డ్డారు. రాష్ట్రంలో మ‌ళ్లీ రాజ‌న్న రాజ్యం రావాల‌ని, అది ఒక్క వైయ‌స్ జ‌గ‌న్‌తోనే సాధ్య‌మ‌న్నారు. జ‌గ‌న‌న్న‌ను ముఖ్య‌మంత్రిని చేసేందుకు సైనికుళ్లా ప‌ని చేస్తామ‌ని పేర్కొన్నారు.
కొనసాగుతున్న చేరికల పరంపర

Printed on 10-12-2018 01:12:12 AM

కొనసాగుతున్న చేరికల పరంపర
వైయస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిన కాంగ్రెస్‌ నాయకులు
తూర్పుగోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేరిక పరంపర కొనసాగుతోంది. వైయస్‌ఆర్‌ సీపీ సిద్ధాంతాలు మెచ్చి.. పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ పోరాటాలు మెచ్చి టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన నాయకులు వైయస్‌ఆర్‌ సీపీలో చేరుతున్నారు. రాజమండ్రి 47వ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్‌ నాయకులు తిరగటి దుర్గారావుతో పాటు 150 మంది జననేత సమక్షంలో వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. ఈ మేరకు వైయస్‌ జగన్‌ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 
 
వైయస్‌ఆర్‌సీపీలోకి భారీ చేరికలు

Printed on 10-12-2018 01:12:12 AM

వైయస్‌ఆర్‌సీపీలోకి భారీ చేరికలు
విశాఖ జిల్లాః  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ఆక‌ర్శితులై వైయస్‌ఆర్‌సీపీలోకి ఇతర పార్టీలకు చెందిన నేతలు భారీసంఖ్యలో వలసబాట పడుతున్నారు. విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గానికి చెందిన టీడీపీ,కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన నేతలు  మాడుగల ఎమ్మెల్యే ముత్యాల నాయుడు ఆధ్వర్యంలో వైయ‌స్ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు.టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధి అనే మాటే లేదని, వైయస్‌ జగన్‌ను గెలిపిస్తే మళ్లీ వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి పాలన రాబోతుందన్నారు. జగన్‌ వారికి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
వైయస్‌ఆర్‌సీపీలోకి టీడీపీ నేతలు చేరికలు..

Printed on 10-12-2018 01:12:12 AM

వైయస్‌ఆర్‌సీపీలోకి టీడీపీ నేతలు చేరికలు..
విశాఖ జిల్లాః జననేత వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సమర్థత, నాయకత్వ పటిమ పట్ల నమ్మకంతో రోజురోజుకు వైయస్‌ఆర్‌సీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. భారీసంఖ్యల్లో ఇతర పార్టీల నేతలు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరుతున్నారు. దాలివలస టీడీపీ సర్పంచ్‌ ఆదిరెడ్డి రామానాయుడు పాటుగా పలువురు టీడీపీ నేతలు వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు. వారికి వైయస్‌ జగన్‌ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
 
వైయస్‌ఆర్‌సీపీలోకి టీడీపీ కార్యకర్తలు చేరిక..

Printed on 10-12-2018 01:12:12 AM

వైయస్‌ఆర్‌సీపీలోకి టీడీపీ కార్యకర్తలు చేరిక..తూర్పుగోదావరిః జిల్లాలో వైయస్‌ఆర్‌సీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ముమ్మిడివరం మండలానికి చెందిన వందలాది మంది టీడీపీ కార్యకర్తలు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు. నియోజకవర్గ కోఆర్డినేటర్‌ పొన్నాడ సతీష్‌కుమార్‌ సమక్షంలో పార్టీలోకి చేరారు. వారికి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రబాబు మోసపూరిత వైఖరి పట్ల నచ్చక వైయస్‌ఆర్‌సీపీలోకి చేరుతున్నట్లు కార్యకర్తలు తెలిపారు.వచ్చే ఎన్నికల్లో పొన్నాడ సతీష్‌కుమార్‌ గెలుపునకు కృషి చేస్తామన్నారు. మహిళలంతా వైయస్‌ఆర్‌సీపీ వెంటే ఉన్నారన్నారు.
 


చంద్ర‌బాబు సొంత జిల్లాలో టీడీపీకి షాక్‌

Printed on 10-12-2018 01:12:12 AM

చంద్ర‌బాబు సొంత జిల్లాలో టీడీపీకి షాక్‌
- కొండా కుటుంబం వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌
విజ‌య‌న‌గ‌రం:  చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరులో టీడీపీకి షాక్ త‌గిలింది. న‌లభై ఏళ్లు టీడీపీలో ఉన్న కొండా కుటుంబం ఇవాళ వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరింది.  పెద్దతిప్పసముద్రం మండలానికి చెందిన టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలు సోమవారం వైయ‌స్‌.జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైయ‌స్ఆర్‌సీపీ చేరారు. పీటీఎం ఎంపీపీ కొండా గీతమ్మ, ప్రత్యేక ఆహ్వానితులు కొండా సిద్ధార్థలు గతవారం టీడీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.  సింగిల్‌విండో చైర్మన్‌ ఎం.భాస్కర్‌రెడ్డి, పీహెచ్‌సీ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ చంద్రశేఖర్‌ కూడా టీడీపీకి రాజీనామా చేశారు. వీరు రాజంపేట మాజీ ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి, తంబళ్లపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఆధ్వర్యంలో ప్రజా సంకల్పయాత్రలో వైయ‌స్‌.జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.   సంపతికోట పంచాయతీ ముంతపోగులవారిపల్లికి చెందిన రేణుక గతంలో కాంగ్రెస్‌ ఎంపీటీసీగా గెలుపొంది ఎంపీపీగా కొనసాగారు. రాష్ట్రం విడిపోయాక కాంగ్రెస్‌ను వీడారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీలో చేరి పార్టీ నాయకుల గెలుపు కోసం శ్రమించారు. టీడీపీలో సరైన గుర్తింపు లేకపోవడంతో గత కొంతకాలంగా వీరు అధికార పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. 

ఈ నేపథ్యంలో వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన ‘నవరత్నాలు’ పథకాలకు ఆకర్షితులై వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు.  ద్వారకనాథరెడ్డి నాయకత్వాన్ని తామంతా బలపరచి, వైయ‌స్‌.జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా కృషి చేస్తామని వారు తెలిపారు.  
వైయస్‌ఆర్‌సీపీలోకి టీడీపీ మాజీ సర్పంచ్‌లు చేరిక..

Printed on 10-12-2018 01:12:12 AM

వైయస్‌ఆర్‌సీపీలోకి టీడీపీ మాజీ సర్పంచ్‌లు చేరిక..


టీడీపీ పాలనలో విసిగిపోయాం..
వైయస్‌ జగన్‌తోనే రాష్ట్రానికి మంచిరోజులు..
విజయనగరంః వైయస్‌ఆర్‌సీపీలోకి రాష్ట్రవాప్తంగా వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం జియ్యమ్మవలస మండలం చిన కుదుమ,పెద కుదమలకు చెందిన టీడీపీ మాజీ సర్పంచ్‌లు, కార్యకర్తలు వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు.వైయస్‌ జగన్‌ వారిని పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. నాలుగున్నరేళ్లుగా టీడీపీ పాలన చూసి విసిగిపోయామని, గ్రామంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు కావడంలేదని వారు మండిపడ్డారు. టీడీపీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలేదన్నారు. రాజన్న బిడ్డగా ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తారనే నమ్మకంతో వైయస్‌ జగన్‌తో కలిసి నడించేందుకు ముందుకు వచ్చామన్నారు.మాట తప్పని మడమ తిప్పని నాయకుడిగా వైయస్‌ జగన్‌ రాష్ట్రానికి న్యాయం చేస్తారన్నారు.టీడీపీ ఎన్ని కుట్రలు పన్నుతున్న ధైర్యంగా ఎదుర్కొని ప్రజల కోసం  వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముందుకు సాగుతున్నారన్నారు.నవరత్నాలు పథకాలు ద్వారా జననేత తమకు మేలు చేస్తారనే సంపూర్ణ నమ్మకంతో ప్రజలు ఉన్నారన్నారు.ఇళ్లు,పెన్షన్లు,నిరుద్యోగ భృతి వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు పరచడంలో చంద్రబాబు విఫలయాయ్యరన్నారు.టీడీపీ పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు.ప్రజల పక్షాన పోరాడుతున్న వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో కలిసి నవరత్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.