Printed on 23-07-2018 11:35:20 AM

టీడీపీకి ‘సదావర్తి’ షాక్‌
– వెయ్యి కోట్లు విలువ చేసే భూముల కైంకర్యానికి కుట్ర 
– 84 ఎకరాల భూమిని కాజేసేందుకు పథకం 
– ప్రజా ప్రయోజన వ్యాజ్యంతో కోర్టుకెళ్లిన ఆర్కే
– మరో రూ. 5 కోట్లు ఎక్కువిస్తే ఆర్కేకు అప్పగించాలని హైకోర్టు తీర్పు 

సదావర్తి భూముల వ్యవహారంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు నుంచి తీర్పు రావడంతో చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వానికి నిద్రపడుతున్నట్టు లేదు.  చంద్రబాబు మాత్రం ప్రభుత్వానికి మరో రూ. 5 కోట్లు ఎక్కువొస్తే మంచిదేగా అని పేర్కొంటున్నా..  లోకేష్‌ మాత్రం తన అక్కసు వెళ్లగక్కాడు. ఎంత దారుణంగా అంటే భూములు కొన్న వారిమీద ఐటీ దాడులు చేయిస్తామని తన ఆవేదనను బహిరంగంగానే వెళ్లగక్కాడు. సదావర్తి భూములకు అదనంగా ఐదు కోట్లు చెల్లించి భూములు సొంతం చేసుకునేందుకు వచ్చే వారిపై ఐటీ దాడులు చేయిస్తామని మీడియా ముందే చెప్పారు. అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలంటూ ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తారని హెచ్చరించారు. ఒకవేళ ఐటీ దాడులకు భయపడి భూములు కొనేందుకు ముందుకు రాకపోతే వైసీపీ ఓడినట్టేనని వ్యాఖ్యానించారు. సదావర్తి భూముల వ్యవహారంలో ప్రభుత్వం అవినీతికి పాల్పడతుందంటూ ఎమ్మెల్యే ఆర్కే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే.. 

కోర్టు ఏం చెప్పిందంటే..
సదావర్తి ఆశ్రమ భూములను కారుచౌకగా కొట్టేసేందుకు టీడీపీ నేతలు వేసిన ఎత్తు చిత్తు అయింది. చెన్నై సమీపంలోని 1000 కోట్లకుపైగా విలువైన భూములను కేవలం రూ. 22 కోట్లకే టీడీపీ నేతలకు ప్రభుత్వం అప్పగించగా దీనిపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే కోర్టును ఆశ్రయించారు. వేలం వేసి అధిక ధరకు అమ్మాలని కోరారు. కానీ ప్రభుత్వం తరపున అడ్వకేట్‌ జనరల్‌ మాత్రం సదరు భూమి 22 కోట్లకు మించి ఎవరూ కొనడం లేదనిం ఎవరైనా సరే ఐదు కోట్లు అధికంగా చెల్లిస్తే వారికే భూములు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కోర్టుకు చెప్పారు. ఈ నేపథ్యంలో మీరు ఐదు కోట్లు అధికంగా ఇవ్వగలరా అని ప్రశ్నించగాం విలువైన భూములను తక్కువ ధరకు అమ్మడం సరికాదని ఎమ్మెల్యే ఆర్కే విన్నవించుకున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం వేలం వేసేందుకు అంగీకరించకపోవడంతో... కోర్టు ఐదు కోట్లు ఇచ్చి మీరే తీసుకోవచ్చు అని ఆర్కేకు సూచించింది. దీంతో అందుకు ఆయన అంగీకరించారు. నాలుగు వారాల్లో మొత్తం డబ్బు చెల్లిస్తామని కోర్టుకు తెలిపారు. దీంతో టీడీపీ పెద్దలు ఉలిక్కిపడ్డారు. వెయ్యి కోట్ల విలువైన భూములను కేవలం రూ. 22 కోట్లకు కాజేసేందుకు తాము వేసిన ఎత్తు వికటించడంతో పాటుం ఆ భూములు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే చేతికి వెళ్తున్నాయని గ్రహించి ఇరుకునపడ్డారు. భూములకు అదనంగా డబ్బు వస్తుంటే ప్రభుత్వం ఆహ్వానించాలి గానీ కొనేవారిపై ఐటీ దాడులు చేయిస్తామని ముఖ్యమంత్రి కుమారుడు బెదిరించడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారు. సదావర్తి భూముల్లో నారా లోకేష్‌కు కూడా వాటా ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి. 

రిజిస్ట్రేషన్‌ విలువే ఎకరా రూ. 6 కోట్లు
సదావర్తి భూముల సమీపంలో సత్యభామ యూనివర్సిటీ, టీసీఎస్‌ కంపెనీలు, పక్కనే స్టార్‌ హోటళ్లు, అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలు ఉన్నాయి. ఈ భూములకు చాలా దూరంగా ఉన్న భూముల రిజిస్ట్రేషన్‌ రూ. 6 కోట్లు ఉందని, మొత్తం 84 ఎకరాల భూమి మార్కెట్‌ విలువ వెయ్యి కోట్లకు పైగానే ఉందని తెలుస్తుంది. 

సదావర్తి సత్రంకు 150 ఏళ్ల చరిత్ర
రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు వారసులు వాసిరెడ్డి మహాలక్ష్మమ్మ 1849లో అమరావతి దేవస్థానానికి చెన్నైలోని భూములను విరాళంగా ఇచ్చారు. చెన్నై సమీపంలోని తాళంబూరు ప్రాంతంలో 473 ఎకరాలను ఇలా అమరేశ్వరస్వామి దేవస్థానానికి అప్పగించారు. భూములకు సంబంధించిన రికార్డులను కూడా గుడికి అందజేశారు. ఆ తరువాత జమీదారిఈ పాలన ముగిసిగింది. 1969లో ఈ భూములను శ్రీ సదావర్తి సత్రానికి కేటాయించారు. భూములు పక్క రాష్ట్రంలో ఉండటంతో వాటిపై పర్యవేక్షణ పూర్తిగా సత్రానికి కేటాయించారు. 473 ఎకరాల్లో చాలావరకు ఆక్రమణలకు గురైంది. ఈ నేపథ్యంలో భూముల స్వాధీనం కోసం రాజా వెంకటాద్రి నాయుడు వారసులు వాసిరెడ్డి హరిప్రసాద్‌ న్యాయపోరాటం ప్రారంభించారు. కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. అనంతరం అమరావతి దేవస్థానం కూడా న్యాయపోరాటం కొనసాగించింది. 2010లో రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక ప్రత్యేక కమిటీ తమిళనాడుకు వెళ్లి భూములను పరిశీలించింది. 

రోశయ్య హయాంలో కమిటీ..
భూముల స్వాధీనంపై అప్పటి చెన్నై మేయర్‌ స్టాలిన్‌తో చర్చించింది. స్టాలిన్‌ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో న్యాయపోరాటం చేయగా, 2014లో దేవస్థానానికి అనుకూలంగా కోర్టు తీర్పు వెలువరించింది. 473 ఎకరాల్లో 84 ఎకరాలు మాత్రమే ప్రస్తుతం మిగిలి (పోరంబోకు) ఉన్నట్లు గుర్తించారు. అంటే ఆక్రమణలు పోగా మిగిలిన భూమి అన్నమాట. దీనికి తమిళనాడు ప్రభుత్వం 50 ఏళ్ల క్రితమే పూర్తిస్థాయిలో పట్టాలు ఇచ్చేసింది. ఇక కోర్టులో కేసు గెలిచాక తమిళనాడు సర్కారుతో చర్చలు జరిపి అనాధీనంగా ఉన్న 84 ఎకరాలను స్వాధీనం చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం సన్నద్ధమైంది. సరిగ్గా ఈ దశలోనే టీడీపీ నాయకుల కన్నుపడింది. భూమిని కొల్లగొట్టేందుకు భారీ కుట్ర జరిగింది. రూ. వెయ్యి కోట్ల విలువైన భూమిని వేలంలో కేవలం రూ. 22.44 కోట్లకే దక్కించుకున్నారు. 

టీడీపీ నాయకుల కన్నుపడిందిలా..
తన నియోజకరవ్గంలోని సదావర్తి సత్రానికి చెన్నై సమీపంలో భూములు ఉన్నాయని, అవి ఆక్రమణకు గురవుతున్నాయని, వాటి విక్రయానికి అనుమతించాలని కోరుతూ పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ 2014 ఆగస్టు 18న ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖ రాశారు. సీఎం కార్యాలయం వెంటనే స్పందించింది. 2014 సెప్టెంబర్‌12న ఆ లేఖను దేవాదాయ శాఖకు పంపింది. అన్ని ప్రక్రియలు పూర్తయి 2015 ఏప్రిల్‌లో భూముల అమ్మకానికి దేవాదాయ శాఖ అనుమతించింది. 471.76 ఎకరాల్లో ఆక్రమణలు పోను మిగిలి ఉన్న 83.11 ఎకరాలను విక్రయించేందుకు ఈ ఏడాది మార్చి 28న వేలం పాట నిర్వహించారు. వేలంలో కృష్ణా జిల్లా కైకలూరు ప్రాంతానికి చెందిన తెలుగుదేశం నాయకుడు, కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ చలమలశెట్టి రామానుజయ భార్య చలమలశెట్టి లక్ష్మీపార్వతి, కుమారుడు చలమలశెట్టి నిరంజన్‌బాబు, గుంటూరు జిల్లాకు చెందిన మందాల సంజీవరెడ్డితోపాటు ఎం. సునీతారెడ్డి, చావలి కృష్ణారెడ్డి, ఎం. సూర్యకిరణ్‌మౌలి,డి. పవన్‌ కుమార్, ఆర్‌. శివరామకృష్ణరావులు కలిసి ఆ భూమిని దక్కించుకున్నారు. ఇదీ అసలు చరిత్ర. 
టీడీపీకి సదావర్తి షాక్

Printed on 23-07-2018 11:35:20 AM

టీడీపీకి సదావర్తి షాక్
న్యూ ఢిల్లీః  టీడీపీకి సదావర్తి షాక్ తగిలింది. సదావర్తి భూముల వేలంను మళ్లీ నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మోసం జరుగుతుంటే కళ్లు మూసుకోలేమని పేర్కొంది. వేలంలో ప్రతివాదులు కూడ తప్పనిసరిగా పాల్గొనాలని సూచించింది.  వేలం ఆపాలన్న పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. హైకోర్టు ఆదేశాల మేరకు వేలం నిర్వహించాలని ఆదేశించింది. చంద్రబాబు ప్రభుత్వం వేలకోట్ల విలువ చేసే భూములను తన అనుయాయులకు అప్పనంగా కట్టబెట్టిన సంగతి తెలిసిందే. సదావర్తి ఆక్రమాలపై వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పోరాటం కొనసాగిస్తున్నారు.