Printed on 22-10-2018 10:15:41 AM

ప్రజాభిమానం మధ్య ప్రజా సంకల్ప యాత్ర
 

నెల్లూరు: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజాభిమానం మధ్య ఉత్సాహంగా సాగుతోంది. ఇవాళ 86వ రోజు ప్రజా సంకల్ప యాత్ర ఉదయగిరి నియోజకవర్గంలో కొనసాగుతోంది. ప్రతి ఒక్కరూ వైయస్‌ జగన్‌తో కలిసి అడుగులో అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. దారిపొడవునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముందుకు సాగుతున్నారు. ప్రజాభిమానం మధ్య ప్రజా సంకల్ప యాత్ర దిగ్విజయంగా సాగుతోంది. ఉద్యోగాలు రాలేదని నిరుద్యోగులు, రుణాలు మాఫీ కాలేదని మహిళలు, గిట్టుబాటు ధర లేదని రైతులు వైయస్‌ జగన్‌కు విన్నవిస్తున్నారు. ప్రత్యేక హోదా పోరాటానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. అన్నా..మీ వెంటే మేం అంటూ మద్దతు తెలుపుతున్నారు. సాయంత్రం కనిగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగిస్తారు.