Printed on 24-03-2018 21:29:58 PM

పార్టీ జెండా ఆవిష్కర‌ణ‌
అనంత‌పురం: ప‌్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చిత్తూరు జిల్లా ఉప్పులూరువాండ్ల‌ప‌ల్లి గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్క‌రించారు. అంత‌కుముందు గ్రామంలో జ‌న‌నేత‌కు పూల‌వ‌ర్షం కురిపించి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. చంద్ర‌బాబు పాల‌న‌లో తీవ్ర అన్యాయానికి గుర‌య్యామ‌ని, అన్నా..మీరు ముఖ్యమంత్రి కావాల‌ని స్థానికులు నినాదాలు చేశారు.
పింఛ‌న్ కోసం ముప్పుతిప్ప‌లు

Printed on 24-03-2018 21:29:58 PM

పింఛ‌న్ కోసం ముప్పుతిప్ప‌లు
చిత్తూరు: తంబళ్లపల్లెలోని సిద్ధారెడ్డి కాలనీకి చెందిన డి రాజేశ్వరికి మాటలు రావు. పుట్టకతోనే మూగ. వికలాంగ పింఛన్‌ మంజూరు కోసం ముప్పుతిప్పలు పడాల్సి వస్తోంది. మాటలు రావని చెప్పడానికి సాక్ష్యం కావాలని అధికారులు చెప్పడంతో వైద్యుల వద్దకు వెళ్లింది. వారిచ్చిన ధ్రువీకరణ పత్రంలో 42 శాతం మాత్రమే వైకల్యం ఉండడంతో రాజేశ్వరి పింఛన్‌పై ఆశలు వదులుకుంది. పర్సెంటేజీతో పనిలేకుండా వైకల్యం ఉన్నవారందరికీ పింఛన్‌ ఇవ్వాలని రాజేశ్వరి తన సహాయకురాలి ద్వారా జగన్‌ వద్ద మొరపెట్టుకున్నారు. 
మ‌రుగుదొడ్డి బిల్లు ఇవ్వ‌డం లేదు

Printed on 24-03-2018 21:29:58 PM

మ‌రుగుదొడ్డి బిల్లు ఇవ్వ‌డం లేదు
 
చిత్తూరు  :‘ అన్నా... పోయిన ఏడాది ఉపాధి హామీ కింద చెట్లు నాటుకున్నా. ఇంటికి లెట్రిన్‌ లేకపోవడంతో స్వచ్ఛ భారత్‌ కింద మరుగుదొడ్డి కట్టుకున్నా. బిల్లు కోసం మండలాఫీసుకు పోతే నువ్వు ఏ పార్టీ అని అడగతా ఉండారు’ అంటూ నల్లవెంగనపల్లెకు చెందిన రైతు బి పార్థసారథినాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. చినబొట్లవారిపల్లె వద్ద వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ పథకాల కోసం బిల్లులు అడుగుతుంటే అధికార పార్టీ నాయకులు చెప్పిన వారికే అధికారులు నగదు చెల్లింపులు చేస్తున్నారన్నారు. రూ.21,810 తనకు బిల్లుల రూపంలో రావాల్సి ఉందన్నారు.
ఇదెక్కడి న్యాయం అన్నా

Printed on 24-03-2018 21:29:58 PM

ఇదెక్కడి న్యాయం అన్నా
చిత్తూరు:  అన్నా.. అసలే కష్టాల్లో ఉన్నాం. ఇప్పుడు కరెంట్‌ చార్జీలు మరింత ఇబ్బందిగా మారాయి. కోళ్లు మేపుతున్న మేము ప్రభుత్వం దృష్టిలో రైతులు కాదా?. మా కోళ్ల ఫారాలకు కమర్షియల్‌ కనెక్షన్ల పేరిట యూనిట్‌కు రూ.9.5 బాదేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం అన్నా’ అంటూ జిల్లాలోని కోళ్ల పెంపకందార్లు తమ ఆవేదన వెళ్లగక్కారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా జననేతకు వినతిపత్రం సమర్పించారు. జిల్లాలో 1.6 లక్షల మంది కోళ్ల పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారని, ఒక్కో కోడి పిల్లకు రూపాయి సబ్సిడీ ఇస్తే ఆదుకున్నట్టు అవుతుందని వివరించారు.
పిల్ల‌ల‌కు రాజ‌శేఖ‌ర్‌..జ‌గ‌న్ అనే పేర్లు పెట్టుకున్నాం

Printed on 24-03-2018 21:29:58 PM

పిల్ల‌ల‌కు రాజ‌శేఖ‌ర్‌..జ‌గ‌న్ అనే పేర్లు పెట్టుకున్నాం
ఒంగోలు:  ‘నా తమ్ముడు లింగాబత్తిన మల్లికార్జునకు ఇద్దరు కవలపిల్లలు పుట్టారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిపై ఉన్న అభిమానంతో ఇద్దరి పిల్లలకు రాజశేఖర్, జగన్‌ అని పేర్లు పెట్టాడు. అయితే రెండు సంవత్సరాల క్రితం తన తమ్ముడు చనిపోయాడు. అప్పటి నుండి నా మరదలు అనితకు వితంతు పింఛన్‌ ఇవ్వడం లేదు’ అంటూ పి.మాలతి.. వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వివరించింది. పింఛన్‌ కోసం దరఖాస్తు పెట్టుకున్నా అధికార పార్టీ నాయకులు అడ్డుపడుతున్నారని వాపోయింది.
కౌలు రైతులను గాలికొదిలేసింది

Printed on 24-03-2018 21:29:58 PM

కౌలు రైతులను గాలికొదిలేసింది
ప్ర‌కాశం: కౌలు రైతులు నష్టాల్లో ఉన్నా ప్రభుత్వం గాలికొదిలేసిందని పొదిలి మండలం రాజుపాలేనికి చెందిన శీతారాజుపల్లి ఈశ్వరమ్మ వైఎస్‌ జగన్‌ను కలిసి సమస్యను విన్నవించింది. ఎకరాకు 5 వేల రూపాయలకు కౌలుకు తీసుకుని 15 ఎకరాల్లో కంది, బొబ్బర్లు సాగు చేశాం. రూ.6 లక్షలు పెట్టుబడి పెట్టాం. వర్షాలు సకాలంలో పడకపోవడంతో పూర్తిగా నష్టపోయాం. పేరుకు మాత్రం కౌలు రైతు గుర్తింపు కార్డులు ఇచ్చారు కానీ వాటి వల్ల ఉపయోగం లేద’ని వివరించింది. అధికారంలోకి రాగానే కౌలు రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది.
కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు

Printed on 24-03-2018 21:29:58 PM

కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు
గుంటూరు:  ‘జిల్లా స్థాయిలో రేషన్‌ దుకాణాలకు నిర్వహించే పరీక్ష రాశాను. ఉత్తీర్ణత సాధించాను. ఇంటర్వ్యూకు కూడా హాజరయ్యా. కానీ దివ్యాంగురాలైన నాకు రేషన్‌ దుకాణాన్ని కేటాయించకుండా.. టీడీపీ వారికే కట్టబెట్టారు’ అంటూ జయశ్రీ  వైయ‌స్ జగన్‌ వద్ద వాపోయింది. పాదయాత్రలో భాగంగా సోమవారం భావపురి చేరుకున్న వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డిని మార్గమధ్యంలో స్టూవర్టుపురం వద్ద సమస్యను విన్నవించింది. రెండు పర్యాయాలు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది.