Printed on 21-11-2018 01:38:49 AM

ఆత్మీయ యాత్ర


- ప‌ల్లెల్లో పండుగ వాతావ‌ర‌ణం
- వెల్లువెత్తుతున్న స‌మ‌స్య‌లు

చిత్తూరు: ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు  వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చేప‌ట్టిన ప్రజాసంకల్ప యాత్ర దిగ్విజ‌యంగా సాగుతోంది. న‌వంబ‌ర్ 6న ప్రారంభ‌మైన జ‌న‌నేత పాద‌యాత్ర‌కు అడుగ‌డుగునా ఘ‌న స్వాగ‌తం ల‌భిస్తోంది. దారిపొడువునా ప్ర‌జ‌లు త‌మ బాధ‌లు ప్ర‌తిప‌క్ష నేత‌కు వివ‌రిస్తున్నారు. వైయ‌స్ఆర్ జిల్లా, క‌ర్నూలు, అనంత‌పురం జిల్లాల్లో పాద‌యాత్ర పూర్తి చేసుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌ ఈ నెల 28న చిత్తూరు జిల్లాలోకి ప్ర‌వేశించారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా 47వ రోజు  చిత్తూరు జిల్లా వసంతపురం నుంచి వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌ ప్రారంభ‌మైంది. అక్క‌డి నుంచి ఉప్పులురువాండ్లపల్లికు చేరుకున్నారు. గ్రామంలో వైయ‌స్ జగన్‌కు ఘన స్వాగతం ల‌భించింది. అనంత‌రం గ్రామంలో పార్టీ జెండాను ఎగుర వేశారు. అక్క‌డి నుంచి పాద‌యాత్ర జి.కొత్తపల్లి క్రాస్‌, గోపిదెన్నె, బోరెడ్డివారి కోట మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. స్థానికులు వైయ‌స్ జ‌గ‌న్‌ను ఆప్యాయంగా పలకరించారు.  రాజన్న బిడ్డ తొలిసారి తమ ఊర్లోకి రావడం ఎంతో సంతోషంగా ఉందని ఉప్పులూరువాండ్ల‌ప‌ల్లి గ్రామ‌స్తులు ఉప్పొంగిపోయారు. జ‌న‌నేత రాక‌తో ప‌ల్లెల్లో పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంది. వీధుల‌న్నీ కూడా పార్టీ జెండాల‌తో క‌ల‌క‌ల‌లాడుతున్నాయి. జ‌నం ప‌నులు మానుకొని వైయ‌స్ జ‌గ‌న్ కోసం వేచి చూస్తున్నారు.

అన్నా..మీరే ఆదుకోవాలి
అన్నా.. స‌కాలంలో వర్షాలు కుర‌వ‌క‌, సాగునీరు అంద‌క వ్య‌వ‌సాయం భార‌మ‌వుతుంద‌ని, ఊర్ల‌లో ఉపాధి లేద‌ని రైతులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అందరికీ పొలాలున్నాయి. కానీ సేద్యం చేసుకునే పరిస్థితి లేదు. పొలంలో బోరుబావులున్నా.. అధికారులు త్రీపేజ్‌ కరెంట్‌ ఇవ్వడం లేదు. గ్రామంలో అందరూ చదువుకున్నోళ్లున్నా చేతినిండా పనిదొరకడంలేదు. మీరే ఆదుకోవాలన్నా..’ అంటూ ఉప్పులూరువాండ్ల‌ప‌ల్లె గ్రామస్తులు తమ సమస్యలను వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తెచ్చారు.  వారి స‌మ‌స్య‌లు సావ‌ధానంగా విన్న వైయ‌స్ జ‌గ‌న్ మ‌రో ఏడాదిలో మ‌నంద‌రి ప్ర‌భుత్వం వ‌స్తుంద‌ని ధైర్యం చెప్పారు. యుద్ధ‌ప్రాతిపాదిక‌న ప్రాజెక్టులు పూర్తి చేస్తాన‌ని, పెట్టుబ‌డుల కోసం ప్ర‌తి ఏటా మే నెల‌లో రూ.12,500 ప్ర‌తి రైతుకు ఇస్తాన‌ని, పెట్టుబ‌డి నిధి ఏర్పాటు చేసి గిట్టుబాటు ధ‌ర‌లు క‌ల్పిస్తాన‌ని హామీ ఇచ్చారు. వైయ‌స్ జ‌గ‌న్ హామీతో అన్న‌దాత‌లు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.
ఉద్యోగ భద్రత కల్పించాలి

Printed on 21-11-2018 01:38:49 AM

ఉద్యోగ భద్రత కల్పించాలి
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలల్లో (ఏపీఆర్‌ఎస్‌) కాంట్రాక్టు రిసోర్స్‌ టీచర్స్‌ (సీఆర్‌టీ)గా పనిచేస్తున్న ఉపాధ్యాయుల్ని క్రమబద్ధీకరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వాల్మీకిపురానికి చెందిన అరుణకుమారి, సోఫియాబేగం తదితరులు ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా వాల్మీకిపురం వద్ద వారు ఆయనను కలిసి సమస్యలు ఏకరువు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఆర్‌టీలకు బేసిక్‌ వేతనాలు ఫిక్స్‌ చేసిన ఘనత అప్పటి ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖర రెడ్డిదేనన్నారు. రాష్ట్రంలో ఉన్న 76 గురుకుల పాఠశాలల్లో 236 మంది సిబ్బంది 2001 నుంచి సీఆర్‌టీలుగా పనిచేస్తున్నారని, తమను రెగ్యులరైజ్‌ చేయడానికి ప్రభుత్వం చొరవ చూపడం లేదని వాపోయారు. 
మ‌హానేత ఫొటోలు పెట్టుకున్నాన‌ని..

Printed on 21-11-2018 01:38:49 AM

మ‌హానేత ఫొటోలు పెట్టుకున్నాన‌ని..
చిత్తూరు: ‘మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి అన్నా, ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి అన్నా ఎంతో అభిమానం. వారి ఫొటోలు ఇంట్లో పెట్టుకున్నానని మా ఊరి టీడీపీ సర్పంచ్‌ కక్షగట్టి పింఛన్‌ రాకుండా చేస్తున్నారన్నా’ అని చిన్నగొట్టిగల్లుకు చెందిన దివ్యాంగుడు ఖాదర్‌వల్లీ ఆవేదన వ్యక్తంచేశాడు. ప్రజాసంకల్ప యాత్రలో జననేతకు తన కష్టాలు చెప్పుకున్నాడు. జన్మభూమి కార్యక్రమాల్లో వందలాది అర్జీలిచ్చినా, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నాలు చేసినా పట్టిం చుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశాడు. తనకు తండ్రి కూడా లేడని కన్నీరు పెట్టుకున్నాడు. మనందరి ప్రభుత్వం వచ్చిన వెంటనే న్యాయం చేస్తానని జననేత అతనికి భరోసా ఇచ్చారు.

భూమి మా పేరిట లేదంటున్నారు

Printed on 21-11-2018 01:38:49 AM

భూమి మా పేరిట లేదంటున్నారు
చిత్తూరు:‘అయ్యా.. మాది ప్రశాకం జిల్లా తాళ్లూరు. 2005, 2009లో నాలుగెకరాల భూమిని అదే గ్రామంలోని ఓ ఆసామి వద్ద కొన్నాం. పట్టాదారు పాసు పుస్తకాలు కూడా ఇచ్చారు. భూమి సాగు చేసుకోవడానికి రుణం కోసం బ్యాంక్‌కు వెళితే అవి మా పేరిట లేవంటున్నారు.’ అంటూ నారాయణమ్మ తన కుమారుడితో కలిసి బత్తలవారిపల్లె వద్ద వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విన్నవించారు. తాళ్లూరు మండల కార్యాలయ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని జననేత తన సిబ్బందిని ఆదేశించారు.
మీకోసమే ఎదురుచూస్తున్నారు

Printed on 21-11-2018 01:38:49 AM

మీకోసమే ఎదురుచూస్తున్నారు
చిత్తూరు : అన్నా..! ఎస్సీ, ఎస్టీలు సమస్యల్లో ఉన్నారు. వారికి ఏ దిక్కూలేదు. ఈ ప్రభుత్వ విధానాలతో చిన్నాభిన్నమైపోయారు. వారి సమస్యలు మీరే పరిష్కరించాలన్నా. అందరూ మీకోసమే ఎదురుచూస్తున్నారు’ అంటూ ఆల్‌ ఇండియా దళిత్‌ రైట్స్‌ ఫెడరేషన్‌ నేతలు జీడీ నెల్లూరు నియోజకవర్గంలోని బ్రాహ్మణపల్లె వద్ద జననేతను కలిసి విన్నవించారు. మనందరి ప్రభుత్వం వచ్చాక తప్పకుండా న్యాయం చేస్తామని వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారికి హామీ ఇచ్చారు.
ఇద్దరు బిడ్డలూ వికలాంగులే

Printed on 21-11-2018 01:38:49 AM

ఇద్దరు బిడ్డలూ వికలాంగులే
చిత్తూరు: ‘అయ్యా..! నాకు 72 ఏళ్లు. ఏ పనీ చేయలేను. ఇద్దరు బిడ్డలున్నారు. వారిద్దరూ వికలాంగులే. నాకు వృద్ధాప్య పింఛన్, బిడ్డలకు ట్రైసైకిళ్లు ఇప్పిస్తామని టీడీపీ నాయకులు మోసం చేస్తున్నారయ్యా’ అంటూ వడమాలపేట మండలం ఎనుమలపాళ్యంకు చెందిన కే గురవమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తిరుమండ్యంకు చెందిన ఏ కాంతమ్మ జననేతను కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు. తనకు 102 ఏళ్లని, రేషన్‌ కార్డు కూడా లేదని.. పింఛన్‌ కూడా ఇవ్వడం లేదని వాపోయారు.      

రోజంతా కష్టపడుతున్నాం..

Printed on 21-11-2018 01:38:49 AM

రోజంతా కష్టపడుతున్నాం..
నెల్లూరు: గర్భిణులకు సేవలు, చిన్నారులకు టీకాలు, వైద్యాధికారులు చెప్పే పనులు చేస్తూ రోజంతా కష్టపడుతున్నా పనికి తగిన వేతనం అందడంలేదని పలువురు ఆశ వర్కర్లు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని పీసీటీ కండ్రిగ, పునబాక, పీటీ కండ్రిగ, చెంబేడు, వడ్డిపాళెం, చెన్నప్పనాయుడుపేట గ్రామాల్లో ప్రజా సంకల్పయాత్ర చేపట్టిన జగన్‌మోహన్‌రెడ్డికి పలువురు ఆశ వర్కర్లు తమ కష్టాలను విన్నవించారు. చెంబేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 15 ఏళ్లుగా సరైన వేతనాల్లేకుండా పని చేస్తున్నామని, గర్భిణులకు తొమ్మిది నెలలు సేవలు చేయడంతో పాటు కాన్పు సమయంలో రోజంతా కష్టపడుతూ, తల్లీబిడ్డ ప్రాణాలను కాపాడేందుకు నిత్యం శ్రమిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వంలో కనీస వేతనాలను కూడా చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో నెలకు రూ.ఆరు వేలను చెల్లిస్తున్నారని తెలిపారు. స్పందించిన వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆశ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించి రూ.ఏడు వేల గౌరవ వేతనం చెల్లిస్తామని భరోసా ఇచ్చారు. ఆశ వర్కర్లు రమణమ్మ, కృష్ణమ్మ, సుకన్య, సుజాత, రామమ్మ, విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

మా కుటుంబం వీధిన పడింది

Printed on 21-11-2018 01:38:49 AM

మా కుటుంబం వీధిన పడింది
నెల్లూరు:  ‘అయ్యా.. నా భర్త ఐదు మాసాల కిందట పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటుండగా పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న భర్త మృతితో మా కుటుంబం వీధిన పడింది. కొందరు అధికార పార్టీ నాయకులు వచ్చి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి వెళ్లారు. ఇది జరిగి ఐదు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ సాయం అందలేదు. మీరే ఆదుకోవాలయ్యా’ అని శిరసనంబేడుకు చెందిన పెన్నా శ్యామలమ్మ వాపోయింది. కూలి పనులు చేసి ఇద్దరు బిడ్డలను పోషించడం చాలా కష్టంగా మారిందని జననేత ఎదుట కన్నీళ్లు పెట్టుకుంది. 
చేతిలో చిల్లి గవ్వలేదు

Printed on 21-11-2018 01:38:49 AM

చేతిలో చిల్లి గవ్వలేదు
నెల్లూరు: నాయనా.. నా మనవరాలు లావణ్య (9)కు మాటలు రావు. చూపు కనిపించదు. ఆస్పత్రిలో చికిత్స చేయిద్దామంటే డబ్బు లేదు. ఈ విషయాలను స్థానిక పాలకులు, అధికారులకు చెప్పి సాయం చేయాలని కోరితే పదేపదే తిప్పించుకుంటున్నారు తప్ప పట్టించుకోవడం లేదు. నా మనవరాలి భవిష్యత్‌పై భయం వేస్తోందయ్యా. పెద్దాస్పత్రికి తీసుకెళ్లి చూపిద్దామంటే చేతిలో చిల్లి గవ్వలేదు. కూలీనాలీ చేసుకుని బతికేవాళ్లం. ఎలా డబ్బులు పెట్టి చూపించుకోవాలి’ అంటూ శిరసనంబేడుకు చెందిన దగ్గవోలు జ్ఞానమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వమే పట్టించుకోకపోతే మా లాంటి వాళ్ల పరిస్థితి ఏంటయ్యా అంటూ జననేత ఎదుట వాపోయింది.   

ఊర్లో ఉపాధి కరువై

Printed on 21-11-2018 01:38:49 AM

ఊర్లో ఉపాధి కరువై
నెల్లూరు  :‘అన్నా.. మాది అల్లూరు మండలం మట్రకోగోలు. ఆ మహా నేత వైఎస్సార్‌ ఉన్నపుడు రోజూ మా ఊర్లో ఉపాధి పనులు కల్పించేవారు. మాకు ఉపాధి లభించేది. ఇప్పుడు ఉపాధి పనులు అసలు చేయించడం లేదు. ఒకవేళ ఎప్పుడో ఓ సారి చేయించినా డబ్బులివ్వక వేధిస్తున్నారు. దాంతో ఊర్లో ఉపాధి కరువై ఇలా వలసొచ్చాం. పిల్లలనూ వెంట తీసుకొచ్చాం’ అంటూ పొట్లూరు లక్ష్మి జననేత ఎదుట వాపోయింది. మన ప్రభుత్వమొచ్చినాక మా ఊరెళతాం. బిడ్డలను చదివించుకుంటాం అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. 
వైద్యం అందించకుండా ఇంటికి పంపేశారు

Printed on 21-11-2018 01:38:49 AM

వైద్యం అందించకుండా ఇంటికి పంపేశారు
నెల్లూరు: రోడ్డు ప్రమాదంలో రెండుకాళ్లు విరిగిపోవడంతో సరైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నట్లు తుమ్మూరుకు చెందిన బాధితుడు పి.రత్నయ్య  వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు. 2016లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు విరిగాయని, ఎన్టీఆర్‌ వైద్యశ్రీ కింద ఆస్పత్రిలో చేర్చుకుని పూర్తిస్థాయి వైద్యం అందించకుండా ఇంటికి పంపేశారని తెలిపాడు. దీంతో కూలికి వెళ్లలేక, ఇద్దరు బిడ్డలను పోషించలేకపోతున్నానని వాపోయాడు. స్పందించిన జననేత జగన్‌ వెంటనే బాధితునికి ఉచితంగా వైద్యం అందించే ఏర్పాట్లు చేయించారు.
కన్నబిడ్డల ఆదరణ కరువై..

Printed on 21-11-2018 01:38:49 AM

కన్నబిడ్డల ఆదరణ కరువై..
నెల్లూరు: ‘అయ్యా.. నా భర్త రెండేళ్ల క్రితం మరణించాడు. కన్నబిడ్డల ఆదరణ కరువై గ్రామంలోనే వేరే ఇంట్లో నివాసముంటున్నా. కూలి పనులకెళ్లేందుకు శరీరం సహకరించక జీవనాధారం కష్టమై పెన్షన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నా. అదిగో ఇదిగో అంటున్నారే కానీ ఇప్పటికీ మంజూరు చేయలేదు’ అంటూ ఊటుకూరుకు చెందిన రమణమ్మ వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదంది. జననేత స్పందిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక నేతలను ఆదేశించారు. మనందరి ప్రభుత్వం రాగానే రూ.2 వేలు పింఛన్‌ అందజేస్తామని రమణమ్మకు ధైర్యం చెప్పారు. 

మద్యానికి బానిసై..

Printed on 21-11-2018 01:38:49 AM

మద్యానికి బానిసై..

నెల్లూరు: ‘అన్నా.. బెల్టుషాపులను పూర్తిగా నిర్మూలించాం అని సీఎం చెబుతున్నా గ్రామాల్లో ఇప్పటికీ నడుస్తున్నాయి. మద్యానికి బానిసైన కొందరు రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బును ఆ షాపుల్లో ఖర్చు చేస్తున్నారు. తమ కుటుంబాలను అగాథంలోకి నెట్టేస్తున్నారు’ అని కలిచేడుకు చెందిన కమలకుమారి అనే మహిళ జననేతకు తెలిపింది. మీరైనా అధికారంలోకి వచ్చాక బెల్టుషాపులను పూర్తిగా నిర్మూలించాలని కోరింది. వైయ‌స్‌ జగన్‌ స్పందిస్తూ షాపులను పూర్తిగా నిర్మూలిస్తామని ఇప్పటికే ప్రకటించామని, అధికారంలోకి వచ్చాక తప్పకుండా అమలు చేస్తామని ఆమెకు హామీ ఇచ్చారు.

ప‌నికి త‌గ్గ వేత‌నం ఇవ్వ‌డం లేదు

Printed on 21-11-2018 01:38:49 AM

ప‌నికి త‌గ్గ వేత‌నం ఇవ్వ‌డం లేదు
నెల్లూరు: ‘సార్‌.. నిత్యం గ్రామాల్లో తిరుగుతూ ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నాం. ఆరోగ్య శాఖ ద్వారా గ్రామస్థాయిలో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ మాతో పనులు చేయించుకుంటున్నారు. అందుకు తగ్గ వేతనం మాత్రం ఇవ్వడం లేదు. జీతం సరిపోక కుటుంబ జీవనం రోజురోజుకూ దుర్భరంగా మారుతోంది’ అంటూ ఏపీ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట వాపోయారు. కనీస వేతనం రూ. 6 వేలు చేయాలని ఎన్నో సంవత్సరాల నుంచి కోరుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మీ కుటుంబం చల్లగా ఉండాలన్నా..

Printed on 21-11-2018 01:38:49 AM

మీ కుటుంబం చల్లగా ఉండాలన్నా..

నెల్లూరు: అన్నా.. మాది ములుముడి గ్రామం, నా పేరు వెంకయ్య, భార్య పేరు పద్మావతి.. మా కుమారుడు ప్రణయకుమార్‌కు గతంలో గుండె వ్యాధి వచ్చింది.. నగదు పెట్టి ఆపరేషన్‌ చేయించే స్థోమత మాకు లేదు.. దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ వల్ల మా బిడ్డకు ఆపరేషన్‌ చేయించాం’ అని వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి విన్నవించారు. వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి చేసిన మేలుతో మాలాంటి ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపాయని జననేత వైయ‌స్‌ జగన్‌కు తెలిపారు. మీ కుటుంబం చల్లగా ఉండాలంటూ దీవించారు. స్పందించిన వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ‘మీ అందరి ఆశీస్సులు ఉంటే మన ప్రభుత్వం వస్తుం దని, ఇంకా పేదల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు.

భూములు కోల్పోయాం

Printed on 21-11-2018 01:38:49 AM

భూములు కోల్పోయాం
నెల్లూరు:  నెల్లూరు–ముంబయి జాతీయ రహదారి ఎన్‌హెచ్‌సీ 67 నిర్మాణంలో టోల్‌గేటు నిర్మించేందుకు బుచ్చిరెడ్డిపాళెం సమీపంలో తాము భూములు కోల్పోయామని, సరైన పరిహారం అందజేయటం లేదంటూ వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి  బాధితులు మొర పెట్టుకున్నారు. అధికారుల చుట్టూ పలుమార్లు తిరిగినా పట్టించుకోవటం లేదని బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన ఎన్‌.గోపీతో పాటు పలువురు జననేత వైయ‌స్‌ జగన్‌కు విన్నవించుకున్నారు.


సర్టిఫికెట్లు సక్రమంగా మంజూరు చేయడం లేదు

Printed on 21-11-2018 01:38:49 AM

సర్టిఫికెట్లు సక్రమంగా మంజూరు చేయడం లేదు
 
నెల్లూరు:  టీడీపీ ప్రభుత్వంలో దివ్యాంగులకు న్యాయం జరగడం లేదని, మీరైనా న్యాయం చేయాలని కొండాపురం మండలంలోని కోవివారిపల్లెకు చెందిన వి.బ్రహ్మయ్య వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. ప్రజాసంకల్పయాత్రలో శెట్టిపాళెం వద్దకు వచ్చిన వైయ‌స్‌ జగన్‌కు దివ్యాంగుల సమస్యలను వివరించాడు. దివ్యాంగుల సర్టిఫికెట్లు అధికారులు సక్రమంగా మంజూరు చేయడం లేదని పేర్కొన్నాడు. పింఛన్ల మంజూరు విషయంలో కూడా వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆర్టీసీ వారు రాయితీపై ఇచ్చే బస్సు పాసులను దివ్యాంగులందరికీ ఇప్పించాలని కోరాడు. స్పందించిన జననేత వైయ‌స్‌ జగన్‌ మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
వర్షాలు లేక భూములు బీడుగా మారాయి

Printed on 21-11-2018 01:38:49 AM

వర్షాలు లేక భూములు బీడుగా మారాయి

 
ఒంగోలు: ‘కందుకూరు నియోజకవర్గంలోని ఉలవపాడు మండలం వీరేపల్లి గ్రామంలో 600 ఎకరాలు మాగాణి భూమికి సాగునీటి సౌకర్యం లేక.. గత ఆరు సంవత్సరాలుగా వర్షాలు లేక భూములు బీడుగా మారాయి. సోమశీల ప్రాజెక్ట్‌ నుంచి వచ్చే సాగు నీళ్లు కావలి వరకు మాత్రమే వస్తాయి. ఈ కాలువను పొడిగించి అదనంగా కాలువ నిర్మాణం చేయడం ద్వారా మాగ్రామానికి సాగునీరు అందుతుంది. ఈ విషయమై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి’ అంటూ రైతులు  వైయ‌స్ జ‌గ‌న్‌ను కోరారు.
ఆదుకుంటామని చెప్పి..

Printed on 21-11-2018 01:38:49 AM

ఆదుకుంటామని చెప్పి..

ఒంగోలు:  విద్యాశాఖ నిర్లక్ష్యానికి పెద్ద కుమారుడిని పోగొట్టుకున్నానని పైరెడ్డిపాలెం గ్రామానికి చెందిన వేల్పుల జయమ్మ వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద విలపించింది. 10 నెలల క్రితం కరేడు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న తన కుమారుడు శ్రీకాంత్‌ను తమ ప్రేమేయం లేకుండా విహారయాత్రకు తీసుకువెళ్లారని చెప్పింది. తిరుగు ప్రయాణంలో బస్సు బోల్తాపడి విద్యార్థులకు గాయాలయ్యాయని.. తన బిడ్డ 80 రోజులు కోమాలో ఉండి మరణించాడని చెప్పింది. అన్ని విధాల ఆదుకుంటామని చెప్పిన విద్యాశాఖ జిల్లా అధికారి బదిలీపై వెళ్లారని.. ఆ తర్వాత వచ్చిన అధికారి పట్టించుకోవడంలేదని కన్నీటి పర్యంతమైంది. కార్యాలయాల చుట్టూ తిప్పించుకుని ఇబ్బందులు పెడుతున్నారని, ప్రభుత్వం నుండి ఎటువంటి ఆర్థిక సహాయం అందలేదని విలపించింది. 
ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి సాయం లేదు

Printed on 21-11-2018 01:38:49 AM

ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి సాయం లేదు


ఒంగోలు: తనకు రెండు కళ్లు లేవని.. నిరుపేదను అయినా ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందడంలేదని ముండ్లమూరు మండలం చెర్లోపల్లి పంచాయతీలోని పలుగురాళ్ల తండాకు చెందిన కమలానాయక్ వైయ‌స్ జగన్‌కు విన్నవించాడు. తాము గ్రామాలు తిరుగుతూ పరదాలు కుడుతుంటామని పింఛన్‌ కూడా లేదని తనకు సాయం చేయాలని కోరాడు. మన ప్ర‌భుత్వం వచ్చాక కులం, మ‌తం, పార్టీలు చూడ‌కుండా అర్హులంద‌రికీ ప్ర‌భుత్వ‌సంక్షేమ ప‌థ‌కాలు అందిస్తామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ మాట ఇచ్చారు.
అంతులేని అభిమానం

Printed on 21-11-2018 01:38:49 AM

అంతులేని అభిమానంప్ర‌కాశం: ఇతని పేరు కుమ్మరి శివప్రసాదు, జమ్మలమడుగు తాలూక పెద్దముడియం గ్రామం. శివప్రసాదు వైయ‌స్ జగన్‌ అభిమాని. స్థానికంగా చిరువ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. అయితే తన అభిమాన నేత పాదయాత్ర చేపడుతున్నాడని తెలిసి తన వ్యాపారాన్ని (బొరుగుల మసాలా) పాదయాత్ర బస చేసేచోట నిర్వహించాలనుకున్నాడు. అంతే వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర మొదలు పెట్టిన ఇడుపులపాయ నుంచి శివప్రసాదు బయలుదేరాడు. ఆయన బస చేసిన ఆవరణలో బొరగుల మసాలా అమ్మకుంటూ నాలుగు రూపాయలు సంపాదించుకుంటున్నాడు. టూ వీలర్‌లోనే అన్నీ సమకూర్చుకున్నాడు. తన నేతను చూసుకుంటూ నిత్యం చిరు వ్యాపారం చేసుకోవటం చాలా సంతోషంగా ఉందని, ఇలానే ఇచ్ఛాపురం వరకు తాను వెళతానని అంటున్నాడు శివప్రసాదు.

బిడ్డను బతికించుకునే శక్తి లేద‌న్నా..

Printed on 21-11-2018 01:38:49 AM

బిడ్డను బతికించుకునే శక్తి లేద‌న్నా..

ఒంగోలు : కనిగిరి మండలం వేములపాడుకు చెందిన మాలపాటి లక్ష్మిరెడ్డి తనకుమారుడు మోహిత్‌ రెడ్డి గత 10 ఏళ్లుగా కీళ్లవాతంతో ఇబ్బంది పడుతున్నాడని వాపోయాడు. చిరుద్యోగి అయిన తాను ఇప్పటికే పది లక్షలు ఖర్చుపెట్టానని తన బిడ్డను బతికించుకునే శక్తి లేదని ప్రభుత్వ వైద్యం అందడం లేదని చెప్పాడు. బిడ్డను బతికించేందుకు సహకరించాలని వైయ‌స్ జగన్‌తో తన గోడు వెళ్లబోసుకున్నాడు.
ఇళ్ల స్థలాల కోసం విన‌తి

Printed on 21-11-2018 01:38:49 AM

ఇళ్ల స్థలాల కోసం విన‌తి

 చీరాల : పేదలైన ముస్లింలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని చీమకుర్తి ఎల్లయ్య నగర్‌కు చెందిన ముస్లిం మహిళ షేక్‌ షకీనాబేగం ప్రజాసంకల్ప యాత్రలో జగన్‌ను కలిసి గోడు వెళ్లబోసుకుంది. ఇళ్ల స్థ‌లాలు ఇవ్వాల‌ని కోరుతూ..మ‌హిళ‌లు వైయ‌స్ జ‌గ‌న్‌కు విన‌తిప‌త్రం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతూ..మ‌నంద‌రి ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే పేదలందరికీ నివేశన స్థలాలు ఇవ్వడంతో పాటు ఇళ్లు నిర్మించి ఇస్తామ‌ని హామీ ఇ చ్చారు.
వ‌డ్డీ మాత్ర‌మే మాఫీ అయ్యింది

Printed on 21-11-2018 01:38:49 AM

వ‌డ్డీ మాత్ర‌మే మాఫీ అయ్యింది
 
ప్ర‌కాశం: ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ పథకంలో మొదటి విడతగా రూ. 16,452 మాత్రమే వచ్చాయని మిగిలిన రుణం మాఫీ కాకపోవడంతో బ్యాంకర్లు తన ఆస్తులు వేలం వేస్తామని బెదిరిస్తున్నారని బండ్లమూడి గ్రామానికి చెందిన పెమ్మ శ్రీనివాసరావు వాపోయాడు. గతంలో రూ. 80 వేలు సొసైటీ బ్యాంకులో క్రాప్‌ లోన్‌ కింద తీసుకోగా  ప్రస్తుతం రూ. 1,10,000 అయిందని.. గతంలో వడ్డీ కింద రూ. 20 వేలే బ్యాంకులో జమ చేశారని చెప్పాడు. బ్యాంకర్లు నోటీసులు పంపుతూ ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. రుణమాఫీ పత్రాలిచ్చినా బ్యాంకులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నానని విలపించాడు.
అంత ఖర్చు పెట్టి వైద్యం చేయించలేం ..

Printed on 21-11-2018 01:38:49 AM

అంత ఖర్చు పెట్టి వైద్యం చేయించలేం ..

ప్ర‌కాశం ‘నా కుమారుడు పి.కృపాసన్‌కు ఆరు సంవత్సరాలు. సంవత్సరం క్రితం జ్వరం తగలడంతో మూడు నెలలు వైద్యశాలల చుట్టూ తిరిగాం. ఆరు నెలల క్రితం పరీక్షలు నిర్వహించి బ్లడ్‌ క్యాన్సర్‌ అని చెప్పారు. ఆరు నెలలు కీమోథెరపీ చేయించాలని చెప్పడంతో రూ.5 వడ్డీకి రూ.3లక్షలు తెచ్చాం. మరో రూ.10లక్షలు అవుతుందని డాక్టర్లు చెప్పారు. కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకునే తమకు అంత ఖర్చు పెట్టి వైద్యం చేయించలేం సార్‌’ అని బాలుడి తల్లి జయ వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తన సమస్యను చెప్పుకుంది.

నాన్న‌పేరు నామకరణం

Printed on 21-11-2018 01:38:49 AM

నాన్న‌పేరు నామకరణం
 గుంటూరు: పొన్నూరు మండలం చుండూరు పల్లెకు చెందిన సీహెచ్‌ అనూష కుమారుడికి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి త‌న తండ్రి పేరు నామకరణం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పొన్నూరు నియోజకవర్గానికి చేరుకున్న వైయ‌స్‌ జగన్‌ వద్దకు అనూష తన బిడ్డను తీసుకుని వచ్చి ‘జగనన్నా... నా బిడ్డకు నువ్వే నామకరణం చేయాలన్నా.. నీ రాక కోసమే ఎదురు చూస్తున్నాను’ అంటూ చెప్పారు. వైయ‌స్ జ‌గన్‌ చిన్నారిని ఆప్యాయంగా ఎత్తుకుని రాజశేఖర్‌ అని పేరుపెట్టారు.  తన బిడ్డకు మహానేత వైయ‌స్‌ఆర్‌ పేరు పెట్టడంతో ఆ తల్లి సంబరపడింది.
ఓబీసీ జాబితాలో చేర్చాలి

Printed on 21-11-2018 01:38:49 AM

ఓబీసీ జాబితాలో చేర్చాలి
గుంటూరు: రాష్ట్ర వ్యాప్తంగా 36 లక్షల మంది జనాభా ఉన్న తూర్పు కాపులను ఓబీసీల్లోకి చేర్చి ఆదుకోవాలని గుంటూరు జిల్లా తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం సభ్యులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి విన్నవించారు.  దేశ వ్యాప్తంగా తూర్పు కాపు సీరియల్‌ నంబరు 90గా ఉంచినట్లు చెప్పారు. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఓబీసీలుగా పరిగణిస్తున్నారని, దీనిని మిగతా పది జిల్లాల్లో కూడా వర్తింపజేయాలని చెప్పారు. తూర్పు కాపుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని కోరారు.
మట్టి తవ్వి కోట్ల రూపాయలు దండుకున్నారు

Printed on 21-11-2018 01:38:49 AM

మట్టి తవ్వి కోట్ల రూపాయలు దండుకున్నారు
గుంటూరు: చిలకలూరిపేట నియోజకవర్గంలో టీడీపీ నాయకులు నీరుచెట్టు పేరుతో దళితుల భూములను ఆక్రమించుకుని అందులో మట్టి తవ్వి కోట్ల రూపాయలు దండుకున్నారని ఏపీ గిరిజన సంఘాల ఐఖ్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనునాయక్‌ ప్రజాసంకల్పయాత్రలో  వైయ‌స్‌ జగన్‌ను కలిసి వినతిపత్రం అందించారు. నియోజకవర్గంలో ఏలూరు, గొరిజవోలు, తూబాడు, యడ్లపాడు, బోయపాలెం, కొండవీడు, కొత్తపాలెం గ్రామాల్లో దళితుల భూములను టార్గెట్‌ చేసుకుని వ్యవసాయం చేయనీయకుండా సాగు భూములను లాక్కుని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు జీవనాధారం లేకుండా చేశారని ఆరోపించారు. అదేవిధంగా యడవల్లిలో దళితులకు చెందిన 416 ఎకరాల వ్యవసాయ భూమిలో గ్రానైట్‌ నిక్షేపాలున్నాయని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వారి వద్ద నుంచి లాక్కునేందుకు అనుమతులు తీసుకువచ్చారని చెప్పారు. తమ ఐక్యవేదిక ద్వారా సమస్యను లోకాయుక్తకు కూడా తీసుకువెళ్లామని వైయ‌స్‌ జగన్‌కు చెప్పారు. 


జీతాలు పెంచాలని విన‌తి

Printed on 21-11-2018 01:38:49 AM

జీతాలు పెంచాలని విన‌తి
గుంటూరు:ప్రభుత్వ కాంట్రాక్ట్‌ కార్మికులకు అందిస్తున్న సౌకర్యాలను 108 సిబ్బందికీ అమలు చేయాలని వైయ‌స్ జగన్‌ను 108 కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రతినిధులు కోరారు.  ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో వైయ‌స్‌ జగన్‌ను 108 సిబ్బంది కలిశారు. 108ను నీరుగార్చేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని తెలిపారు. వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి తమకు 8 గంటల పని విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు.  ఇప్పుడు ఆ హామీ అటకెక్కిందన్నారు. ప్రభుత్వ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల వలే తమకు 50 శాతం జీతాలు పెంచాలని కోరారు. మండలానికి ఒక అంబులెన్స్‌ ఉండేలా చూడాలన్నారు.


వ్యవసాయ కూలీలుగా మార్చాల్సి వచ్చింది

Printed on 21-11-2018 01:38:49 AM

వ్యవసాయ కూలీలుగా మార్చాల్సి వచ్చింది

గుంటూరు : అక్షయగోల్డ్‌లో ఏజెంట్‌గా చేరి లక్షల రూపాయలు నష్టపోయాను. గ్రామంలో దాదాపు 90 మంది నుంచి రూ.15 లక్షల కట్టించాను. అక్షయగోల్డ్‌ కంపెనీ మూతపడిన తరువాత డబ్బు కట్టించిన వారు ఇంటిపైకి వచ్చి గొడవకు దిగారు. దీంతో నాభర్త తీవ్ర మనస్తాపానికి గురై మరణించారు. ఆయన మరణానంతరం డిపాజిట్‌దారుల ఒత్తిడితో చేసేదేమీ లేక ఉన్న ఎకరం పొలాన్ని అమ్మి డబ్బు చెల్లించాను. ప్రస్తుతం చదువుకునే నా ఇద్దరుపిల్లలకు ఎటువంటి ఆధారం లేకపోడంతో వ్యవసాయ కూలీలుగా మార్చాల్సి వచ్చింది’ అని సత్తెనపల్లి మండలం భృగుబండకు చెందిన ఇందూరి అరుణకుమారి వైయ‌స్‌ జగన్‌ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా  చాగంటివారిపాలెం శివారుల్లో జననేతను కలిసి ఆమె తన సమస్యలు చెప్పుకుని కన్నీటి పర్యంతమయ్యారు. వితంతు పింఛన్‌ ఇప్పిస్తానని జన్మభూమి కమిటీ సభ్యుడు రూ.5 వేలు తీసుకుని నేటికీ పింఛన్‌ ఇప్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

అందరికీ ఓటు హక్కు కల్పించేలా చూడాలి

Printed on 21-11-2018 01:38:49 AM

అందరికీ ఓటు హక్కు కల్పించేలా చూడాలి
గుంటూరు : ‘అయ్యా.. ఉద్దేశపూర్వకంగానే  నా పేరు ఓటర్ల జాబితాలో నుంచి  టీడీపీ నాయకులు తొలిగించారు’ అని అమృతలూరు మండలానికి చెందిన పాస్టర్‌ ఏలియా ప్రజా సంకల్పయాత్ర జననేత జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం  పార్టీ సీనియర్‌ సిటిజన్‌లని 55 ఏళ్లు పైబడిన వారి పేర్లను, అలాగే వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా ఉన్న వారి పేర్లను ఓటరు జాబితాలో నుంచి తొలిగిస్తున్నారని తెలిపారు. అధికారులను ప్రశ్నించినా పట్టించుకోవడం లేదని జననేతకు వివరించారు. రానున్న ఎన్నికల్లో అందరికీ ఓటు హక్కు కల్పించేలా చూడాలని కోరారు.

దళిత క్రైస్తవులను ఎస్సీల్లో చేర్చాలి

Printed on 21-11-2018 01:38:49 AM

దళిత క్రైస్తవులను ఎస్సీల్లో చేర్చాలి
గుంటూరు :ప్రస్తుతం బీసీ–సీ జాబితాలో ఉన్న దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని నవ దళిత క్రైస్తవ పరిరక్షణ సంఘం రాష్ట్ర కన్వీనర్‌ కొట్ల దిలీప్ కోరారు. ఈ మేర‌కు జననేత వైయ‌స్‌ జగన్‌ను కలిసి క్రైస్తవుల సమస్యలు వివరించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి ఈ అంశంపై సానుకూలంగా స్పందించినట్లు గుర్తు చేశారు. ఎస్సీ జాబితాలో చేర్చేందుకు కృషి చేయాలని కోరుతూ జగన్‌కు వినతిపత్రం అందించారు.


పిల్ల‌ల‌ను ఉన్న‌త చ‌దువులు చ‌దివించ‌లేక‌పోతున్నాం..

Printed on 21-11-2018 01:38:49 AM

పిల్ల‌ల‌ను ఉన్న‌త చ‌దువులు చ‌దివించ‌లేక‌పోతున్నాం..
గుంటూరు :రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఎర్రబాలెంకు చెందిన ఉప్పులూరి వెంకటసత్యలక్ష్మి ప్రజాసంకల్పయాత్రలో జననేత జగన్‌ను కలిసి విన్నవించుకున్నారు. తమ పిల్లలను ఉన్నత విద్య చదివించాలంటే అనేక రకాల ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మనందరి ప్రభుత్వం వచ్చిన తరువాత తప్పకుండా బ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి చేస్తానని జగన్‌ భరోసా ఇచ్చారు.

కృష్ణ‌మ్మ చెంత నీటికి చింత

Printed on 21-11-2018 01:38:49 AM

కృష్ణ‌మ్మ చెంత నీటికి చింత
కృష్ణా జిల్లా :‘రాయలసీమకు సైతం నీళ్లుస్తున్నాం అంటూ నిత్యం గొప్పలు చెప్పే జలవనరుల శాఖామంత్రి ఇలాకాలోనే నీరు లేక అల్లాతున్నాం’ అంటూ కృష్ణా జిల్లా వాసులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప‌క్క‌నే కృష్ణా న‌ది ఉన్నా..నీటి క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. ఎడాపెడా ఇసుక త‌వ్వ‌కాలు చేప‌ట్ట‌డంతో భూగ‌ర్భ‌జ‌లాలు అడుగంటి పోయాయని ప్రజాసంకల్పయాత్రలో ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట స్థానికులు తమ బాధలు చెప్పుకున్నారు. జి కొండూరు మండలం చెవుటూరులో  పది మందికి పైగా గొర్రెల పెంపకం దారులు ఉన్నారని, రెండు వేల వరకూ జీవాలు(గొర్రెలు) ఉన్నట్లు పశుపోషకుడు ఉమ్మడి వెంకటేశ్వరరావు తెలిపారు. పైగ్రామాల వారు కాలువలోకి నీరు రానివ్వకపోవడంతో మూగజీవాలు తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని, చేతిపంపుతో నీరు కొట్టి వాటికి పెట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని చెప్పారు. తమకు నీరందే విధంగా అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని వారు జననేతను కోరారు.
ఆరోగ్యశ్రీ వర్తించదని చెబుతున్నారు

Printed on 21-11-2018 01:38:49 AM

ఆరోగ్యశ్రీ వర్తించదని చెబుతున్నారు
కృష్ణా జిల్లా : ‘అన్నా.. నాకు ముగ్గురు బిడ్డలు. నా భర్త చనిపోయి పదేళ్లవుతుంది. అప్పటి నుంచి నా కుటుంబాన్ని పోషించుకునేందుకు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. అయితే గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదంలో నా కాలు విరిగిపోయింది. దీంతో కుటుంబ పరిస్థితి దారుణంగా తయారైంది’ అంటూ ఈదర ప్రాంతానికి చెందిన లక్కపల్లి విజయరాణి ప్రజా సంకల్పయాత్రలో వైయ‌స్‌ జగన్‌ను కలిసి కన్నీరుమున్నీరయ్యారు. కాలు విరగడం వల్ల ఏ పనికి వెళ్లలేకపోతున్నానని, ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్‌ చేయించుకున్నా.. కాలు సరిగా బాగవ్వలేదని చెప్పారు. మళ్లీ చూపించుకోవాలన్నా, కాలులో ఆపరేషన్‌ సమయంలో వేసిన రాడ్డును తీయించుకోవాలన్నా ఆరోగ్యశ్రీ వర్తించదని చెబుతున్నారు. ఆరోగ్యశ్రీని మాలాంటి నిరుపేదలకు ఉపయోగపడేలా మార్పులు చేయాలని, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.


ప్రభుత్వం కనికరించడం లేదు

Printed on 21-11-2018 01:38:49 AM

ప్రభుత్వం కనికరించడం లేదు
కృష్ణా జిల్లా: ‘అయ్యా.. మా అబ్బాయి తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. ఆపరేషన్‌కు రూ.25 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వం కనీసం కనికరించడం లేదు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ఎల్‌వోసీ ఇస్తే ఆస్పత్రిలో పని చేయదంటున్నారు’ అని భూక్యా వెంకటేశ్వర నాయక్  రావిచర్ల క్రాస్‌ వద్ద జరిగిన ప్రజాసంకల్పయాత్రలో వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమ సమస్యలను వివరించారు. తన కుమారుడు జ్యోతిశ్వర్‌కు పుట్టుకతోనే తలసేమియా వ్యాధి రావడంతో ఉన్నంతలో వైద్యం చేయించామని తెలిపారు.

తమిళనాడు రాష్ట్రంలోని రాయ వెల్లూరులో బాలుడికి ఆపరేషన్‌కు రూ. 25 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పినట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఎల్‌వోసీ లేఖను ఇచ్చినా ఆస్పత్రి వర్గాలు దానిని అంగీకరించటం లేదన్నారు. ఆ మొత్తానికి ఆస్పత్రి పేరిట చెక్కు ఇప్పించాలని విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం స్పందించటం లేదని వెంకటేశ్వర నాయక్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి 15 రోజులకు రక్తం ఎక్కించేందుకు, మందులు కొనేందుకు రూ. 18 వేలకుపైగా ఖర్చు అవుతుందని, తన కుమారుడిని కాపాడాలని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.

పూటగడవటం లేదు

Printed on 21-11-2018 01:38:49 AM

పూటగడవటం లేదు
కృష్ణాజిల్లా : ‘అయ్యా.. మాది నిరుపేద కుటుంబం. నాలుగేళ్ల నుంచి వృద్ధాప్య పింఛన్‌ మంజూరు చేయడం లేదు’ అని  గోపావారిగూడెంకు చెందిన బి. హనుమంతరావు ప్రజా సంకల్పయాత్రలో వైయ‌స్‌ జగన్‌ను కలిసి కన్నీరు పెట్టుకున్నారు.  వృద్ధాప్య పింఛన్‌ కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ జన్మభూమి, గ్రామసభల్లో అర్జీలు పెట్టుకున్నా ప్రయోజనం లేదని వాపోయారు. పింఛన్ల మంజూరులో అవకతవకలు జరుగుతున్నాయని, తన లాంటి అర్హులకు సంక్షేమ పథకాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పూటగడవక నానా అవస్థలు పడుతున్నానని, తనకు పింఛన్‌ వచ్చేలా చూడాలని జననేత వైయ‌స్‌ జగన్‌ను కోరారు.
అంతా రాజ‌శేఖ‌ర‌రెడ్డి పుణ్య‌మే

Printed on 21-11-2018 01:38:49 AM

అంతా రాజ‌శేఖ‌ర‌రెడ్డి పుణ్య‌మే
 

కృష్ణా జిల్లా : ‘అన్నా.. మా నాన్న బొమ్మారెడ్డి వెంకటరెడ్డికి గుండెపోటు వచ్చింది. ఆరోగ్యశ్రీ పథకంలో ఉచితంగా గుండె ఆపరేషన్‌ చేశారు. ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం వల్లనే మా నాన్న ఈరోజు మా మధ్యన తిరుగుతున్నారు’ అని ఉంగుటూరు మండలం తుట్టగుంట గ్రామానికి చెందిన ఏరువ సునీతరెడ్డి పురుషోత్తంపట్నం వద్ద ప్రజా సంకల్పయాత్రలో జననేత వైయ‌స్ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. 

తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులుపడుతున్నాం

Printed on 21-11-2018 01:38:49 AM

తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులుపడుతున్నాం

కృష్ణా జిల్లా : ‘అన్నా.. మా గ్రామంలో తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులుపడుతున్నాం. మూడేళ్ల నుంచి మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోడం లేదు’ అంటూ గన్నవరం నియోజకవర్గం ఇందుపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసరావు,కోటేశ్వరమ్మ, శివపార్వతి,  జననేత ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయ‌స్‌ జగన్‌ను కలసి సమస్యలు విన్నవించారు. తాగునీటి కుళాయి, బోరింగ్‌ పంపులు రెండూ ఒకేచోట ఏర్పాటు చేయడం వల్ల  గ్రామంలో మిగిలిన ప్రదేశాలలో నివసించే వారు బిందెలు మోసుకుంటూ దూరం నుంచి నీళ్ల తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని చెప్పారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు.
భూగర్భజలాలను తోడేస్తున్నారు

Printed on 21-11-2018 01:38:49 AM

భూగర్భజలాలను తోడేస్తున్నారు
కృష్ణాజిల్లా : ‘అన్నా.. చేపల చెరువుల పేరుతో అనుమతులు తీసుకుని రొయ్యలు సాగు చేయడంతో తాగు నీరు కలుషితం అవుతుంది’. అని మండవల్లి మండలం కానుకొల్లు ఎస్సీ కాలనీకి చెందిన మరియరాజు జననేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో రెండు వేల ఎకరాలు అక్రమంగా రొయ్యల సాగు చేస్తున్నారని, దీంతో గ్రామంలోని బావులన్నీ ఉప్పునీరుగా మారి తాగేందుకు నీరు దొరకని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అక్రమ రొయ్యల సాగు యథేచ్ఛగా కొనసాగుతుందని వాపోయారు.

చేపల సాగుకు నీటితో 0.5 శాతం ఉప్పునీరు ఉంటే సరిపోతుందని, రొయ్యల సాగుకు 8 శాతం ఉప్పు నీరు అవసరమని పేర్కొన్నారు. దీంతో ఉప్పునీటి కోసం 250 నుంచి 300 అడుగుల్లో విచ్చలవిడిగా బోర్లు వేస్తూ భూగర్భజలాలను తోడేస్తున్నారని వివరించారు. రొయ్యల సాగు వల్ల ఎస్సీ కాలనీలో నివసిస్తున్న 500 మం
సొంతిల్లు వస్తాయనే నమ్మకం కలిగింది

Printed on 21-11-2018 01:38:49 AM

సొంతిల్లు వస్తాయనే నమ్మకం కలిగింది
పశ్చిమగోదావరి   : నల్లజర్ల సెంటర్లో జరిగిన బహిరంగ సభలో జగనన్న ఇచ్చిన డ్వాక్రా రుణాల మాఫీ హామీ మా జీవితాల్లో సరికొత్త ఆనందాన్ని నింపిందని ద్వారకా తిరుమల మండలం రాజులకుంట గ్రామానికి చెందిన ఎం.జ్యోతి, జి.నాగమణి తెలిపారు. ఇదే కాదు జగనన్న అధికారంలోకి వస్తే మా పిల్లల చదువులు కూడా బాగుంటాయని, మాకు సొంతిల్లు వస్తాయనే నమ్మకం కలిగింది.