Printed on 12-12-2018 20:26:53 PM

కాపులోన్లు ఇవ్వడం లేదు

 
పశ్చిమగోదావరి :  కాపుల‌కు రుణాలు ఇవ్వ‌డం లేద‌ని ఆ సామాజిక వ‌ర్గానికి చెందిన ప‌లువురు వైయ‌స్ జ‌గ‌న్‌కు ఫిర్యాదు చేశారు. కాపు సంఘం నాయ‌కులు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిశారు. అలాగే లంకలపల్లి శ్రీనివాస్‌ ఇటీవల నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ  వైయ‌స్ఆర్‌సీపీ తరఫున ఫ్లెక్సీలు వేశారని టీడీపీ నేతలు వేధిస్తున్నారని ఉప్పులూరు గ్రామానికి చెందిన లంకలపల్లి నాగదుర్గ వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. మా రేషన్‌ కార్డు తొలగించారు. ఇళ్ల స్థలం ఇవ్వడం లేదు. మా మావయ్యగారికి పెన్షన్‌ మంజూరు చేయడంలేదు.  నువ్వు వస్తేనే.. మా కష్టాలు తీరేద‌ని కోరారు.
బిడ్డకు ఆపరేషన్‌ చేయించే స్తోమత లేదు

Printed on 12-12-2018 20:26:53 PM

బిడ్డకు ఆపరేషన్‌ చేయించే స్తోమత లేదు

పశ్చిమగోదావరి : అన్నా మా బిడ్డకు కంటిలో నల్ల గుడ్డు కోణంగా ఏర్పడింది. ఆపరేషన్‌ చేయించాం. రెండో కన్నుకు  కూడా ఆపరేషన్‌ చేయించాలని అంటున్నారు. ఆటోనే జీవనాధారం చేసుకుని బతుకుతున్నాం. మళ్లీ మా బిడ్డకు ఆపరేషన్‌ చేయించే స్తోమత లేదు. నువ్వే సహకరించాలన్నా అంటూ పాదయాత్రలో విజయరావు, రాజకుమారి దంపతులు వైయ‌స్ జగన్‌కు విజ్ఞప్తి చేశారు.
చిన్నారికి అక్ష‌రాభ్యాసం

Printed on 12-12-2018 20:26:53 PM

చిన్నారికి అక్ష‌రాభ్యాసం


పశ్చిమగోదావరి  :  కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన  దంపతుల త‌మ‌ కుమార్తెకు అదే ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్న వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి అక్ష‌రాభ్యాసం చేయించారు. దీంతో ఆ దంపతులు మురిసిపోయారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చాక చ‌దువుల విప్ల‌వం తీసుకువ‌స్తామ‌న్నారు. చిన్న బిడ్డ‌ల‌ను ఏ స్కూల్‌కు పంపించినా స‌రే ఆ త‌ల్లి ఖాతాలో ప్ర‌తి ఏటా రూ.15 వేలు  అంద‌జేస్తామ‌న్నారు. విద్యార్థుల‌కు హాస్ట‌ల్ ఖ‌ర్చుల కోసం ఏడాదికి రూ. 20 వేలు చెల్లిస్తామ‌ని, మీ బిడ్డ‌ల‌ను ఏం చ‌దివిస్తారో చ‌దివించండి..ఎన్ని ల‌క్ష‌లు ఖ‌ర్చైనా భ‌రిస్తాన‌ని వైయ‌స్ జ‌గ‌న్ హామీ ఇచ్చారు.
ధికారుల చుట్టూ తిరిగినా ప‌ట్టించుకోవ‌డం లేదు

Printed on 12-12-2018 20:26:53 PM

ధికారుల చుట్టూ తిరిగినా ప‌ట్టించుకోవ‌డం లేదు
 
పశ్చిమగోదావరి :  సివిల్‌ సప్లయి గోదాముల్లో తమ భర్తలు పని చేస్తున్నప్పటికీ జీతం ఇవ్వడంలేదని దారవరం గ్రామానికి చెందిన గంటి రత్నకుమారి, గుమ్మాపు వాణి అనే మహిళలు అదే గ్రామంలో జగన్‌మోహన్‌రెడ్డిని కలసి తమ బాధ చెప్పుకున్నారు. జీతాలు చెల్లించాలని సంబంధిత అధికారులు చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు

క్యాన్సర్‌తో బాధపడుతున్నా..
క్యానర్‌తో బాధపడుతున్నానని వైద్యానికి సహకరించాలని దారవరానికి చెందిన గన్ని మరియమ్మ అనే మహిళ వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డిని కలుసుకుని తన బాధ చెప్పుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయని వైద్యానికి మీరే సహకరించాలని, పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరు కావడం లేదని, మీరు అధికారంలోకి రాగానే పింఛను ఇప్పించాలని కోరారు.
అప్పు చేసి ఇల్లు నిర్మించుకున్నాం

Printed on 12-12-2018 20:26:53 PM

అప్పు చేసి ఇల్లు నిర్మించుకున్నాం

పశ్చిమగోదావరి : అగ్ని ప్రమాదంలో మా ఇల్లు కాలిపోయింది. దీంతో కొత్త ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్నాం. రోజులు గడుస్తున్నా ఇల్లు మంజూరైనట్టు అధికారులు చెప్పకపోవడంతో రూ.4 లక్షలు అప్పు చేసి ఇల్లు నిర్మించుకున్నామని పశివేదలకు చెందిన కోట వెంకటలక్ష్మి అనే మహిళ అదే గ్రామంలో వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి చెప్పారు. ఇంటి నిర్మాణానికి సంబంధించి బిల్లుల కోసం దరఖాస్తు చేసుకున్నా సమాధానం చెప్పకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇబ్బందులు పెడుతున్నారని ఆమె వాపోయారు. మీరు అధికారంలోకి రాగానే మాకు న్యాయం చేయాలని ఆమె కోరారు.
రాయితీని రైతులకు ఇవ్వలేదు

Printed on 12-12-2018 20:26:53 PM

రాయితీని రైతులకు ఇవ్వలేదు
పశ్చిమగోదావరి : వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో దీర్ఘకాలిక రుణాలపై ఇచ్చే ఆరు శాతం వడ్డీ రాయితీని చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత నిలుపుదల చేసింది. నేటికీ ఆ రాయితీని రైతులకు ఇవ్వలేదు. అలాగే స్వల్పకాలిక రుణాలపై చిన్న, సన్నకారు రైతులకు రూ.లక్ష వరకూ వడ్డీలేదని ప్రభుత్వం ప్రకటించినా అవి ఉత్తర్వుల వరకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం రైతుల నుంచి ఏడు శాతం వడ్డీని ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. వడ్డీ రాయితీలో నాలుగు శాతం కేంద్రం, మూడు శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మూడు శాతం రాయితీని ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నాలుగు శాతం వడ్డీని రైతులకు చేరకుండా రాష్ట్ర ప్రభుత్వం, సహకార బ్యాంకులు కలిసి ఆ సొమ్మును సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నాయి అంటూ.. కొవ్వూరుకు చెందిన సహకార బ్యాంకు రిటైర్డ్‌ మేనేజర్‌ యాళ్ల నరసింహారావు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు.
నిరుపేద కాపులకు రుణాలు ఇవ్వడం లేదు

Printed on 12-12-2018 20:26:53 PM

నిరుపేద కాపులకు రుణాలు ఇవ్వడం లేదు
 
తూర్పుగోదావరి :‘కాపులను బీసీల్లో చేరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కాపులను బీసీ–ఎఫ్‌గా గుర్తిస్తున్నామని కేంద్రానికి పంపారు. రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకుని కాపులకు బీసీ– ఎఫ్‌గా ధృవీకరణ పత్రాలు ఇవ్వాలి. నిరుపేద కాపులకు కార్పొరేషన్‌ రుణాలు ఇవ్వడం లేదు’ అంటూ కొత్తపేటకు చెందిన కాపు జేఏసీ నాయకుడు సాధనాల శ్రీనివాస్‌ ఆవేదన వ్యక్తం చేస్తూ వైయ‌స్‌ జగన్‌కు వినతిపత్రం అందజేశారు.
వైయ‌స్ జగన్‌ సీఎం కావాలని..

Printed on 12-12-2018 20:26:53 PM

వైయ‌స్ జగన్‌ సీఎం కావాలని..

తూర్పుగోదావరి :దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయ‌స్‌.రాజశేఖరరెడ్డి స్వర్ణయుగం సాధించాలంటే ఆయన తనయుడు వైయ‌స్‌.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని పార్వతీపురం నుంచి తిరుపతి మీదుగా ఇడుపులపాయ వరకు రొంప‌ల్లి తిరుప‌తిరావు సైకిల్‌పై 1450 కిలోమీటర్ల యాత్ర నిర్వహించారు. వైయ‌స్ జగన్‌ పాదయాత్ర ఎక్కడ జరిగినా ఆయన అడుగులో అడుగు వేస్తున్నాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. 
కాంట్రాక్టు లెక్చరర్లను పర్మినెంట్‌ చేయాలి

Printed on 12-12-2018 20:26:53 PM

కాంట్రాక్టు లెక్చరర్లను పర్మినెంట్‌ చేయాలి
 
తూర్పుగోదావరి : ‘కాంట్రాక్టు లెక్చరర్లను పర్మినెంట్‌ చేయాలన్నా’ అంటూ రాజోలు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కాంట్రాక్టు లెక్చరర్‌గా పని చేస్తున్న పోతుమూడి అలివేలుమంగతాయారు జగన్‌కు విజ్ఙప్తి చేశారు. 17 ఏళ్లుగా నిరీక్షిస్తున్న తమను మీరు సీఎం అయిన తరువాత పర్మినెంట్‌ చేయాలని ఆమె కోరారు.
ఉమ్రా బాధితులను ఆదుకోవాలి

Printed on 12-12-2018 20:26:53 PM

ఉమ్రా బాధితులను ఆదుకోవాలి

 

తూర్పుగోదావరి: ఉమ్రా బాధితులను ఆదుకోవాలని నగరం, మామిడికుదురు గ్రామాలకు చెందిన పలువురు ముస్లింలు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా  వ‌చ్చిన వైయ‌స్‌ జగన్‌ను వారు కలుసుకుని ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలకు చెందిన సుమారు 300 మంది ముస్లింలు ఉమ్రా, ఇరాన్, ఇరాక్‌ యాత్రలకు వెళ్లేందుకు కొద్ది నెలల క్రితం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ద్వారా కేఎస్‌ఎస్‌ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌కు లక్షలాది రూపాయలు నగదు చెల్లించామన్నారు. ఈ విధంగా 75 మంది రూ.45 వేలు చొప్పున, 50 మంది రూ.25 వేలు చొప్పున, 180 మంది రూ.18 వేలు చొప్పున చెల్లించామన్నారు. బాధితుల్లో పలు కుటుంబాల్లో 10 మందికి పైగా సభ్యులు ఉన్నారన్నారు. నగదుతో పాటు తమ పాస్‌పోర్టులు కూడా వారి వద్దే ఉన్నాయని, వీటికి సంబంధించిన రశీదులు తమ వద్ద ఉన్నాయన్నారు. తమను మోసగించిన ట్రావెల్స్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదన్నారు. ఈ ట్రావెల్స్‌ చట్టాన్ని, న్యాయాన్ని తప్పుదోవ పట్టిస్తోందన్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు వజీద్‌జాన్‌సాహేబ్, సర్ఫరాజ్‌ హుస్సేన్, ఎస్‌కే నౌషాద్‌ మొహిద్దీన్, షేక్‌ జిలానీ తదితరులు కోరారు.
చిన్నారికి నామకరణం

Printed on 12-12-2018 20:26:53 PM

చిన్నారికి నామకరణం
 
తూర్పుగోదావరి  :  మా కుమార్తెకు సాల్విక రెడ్డిగా వైయ‌స్‌ జగన్‌ నామకరణం చేశారని కాజులూరు మండలం పల్లిపాలేనికి చెందిన బిల్లకుర్తి రామకృష్ణారెడ్డి, లోవ గంగాభవాని తెలిపారు . తమ కుమార్తెకు పేరు పెట్టాలని చెప్పడంతో వైయ‌స్ జగన్‌ నామకరణం చేయడం ఎంతో ఆనందంగా ఉందని వారన్నారు.