Printed on 23-09-2018 16:20:17 PM

ప్రతి ఇంటికీ నవరత్నాలు కరపత్రం పంపిణీ
  • సంక్షేమనికి గండికొట్టాడు
  • ఎన్నికల హామీలను పూర్తిగా విస్మరించాడు
  • అన్ని వర్గాల ప్రజలను మోసగించిన చంద్రబాబు
  • ప్రజలకు అండగా వైయస్సార్సీపీ 
  • అన్నొస్తున్నాడు..నవరత్నాలు తెస్తున్నాడన్న భరోసా
  • నవ్యాంధ్రకు నవరత్నాలు కరపత్రాలను విడుదల చేసిన పార్టీ నేతలు
హైదరాబాద్ః గడిచిన మూడేళ్లలో సంక్షేమానికి గండికొట్టడమే గాకుండా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో అన్ని వర్గాల ప్రజలు అన్యాయానికి గురయ్యారని అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, భూమన కరుణాకర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలతో కలిసి ధర్మాన ప్రసాదరావు నవ్యాంధ్రకు నవరత్నాలు కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ...ప్రభుత్వ మోసపూరిత విధానాలతో వంచనకు గురైన ప్రజల్లో ధైర్యం నింపేందుకే అన్న వస్తున్నాడు నవరత్నాలు తెస్తున్నాడన్న నినాదంతో గడపగడపకు కరపత్రాలు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. ఆగష్టు 10 నుంచి 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని పార్టీ నాయకత్వం అనుకూలమైన తేదీలో కేడర్ తో సమావేశమై కరపత్రాన్ని వారికి పూర్తిగా వివరించి బాధ్యతలు అప్పజెప్పడం జరుగుతుందన్నారు. వైయస్ఆర్ వర్థంతి రోజైన సెప్టెంబర్ 2 నుంచి అక్టోబర్ 7 వరకు గ్రామ స్థాయిలో నేతలు ప్రతీ ఇంటికి వెళ్లి వైయస్ జగన్ ఇచ్చిన 9 హామీల గురించి వివరిస్తారని చెప్పారు. నవ్యాంధ్రకు నవరత్నాల కరపత్రంతో పాటు టీడీపీ ప్రజలను ఎలా మోసం చేసిందో వివరిస్తూ టీడీపీ హామీల కరపత్రాన్ని కూడ జోడించి పంపిణీ చేయనున్నట్టు ప్రకటించారు. నిరుత్సాహంలో ఉన్న కుటుంబాలకు  మనకు సహాయపడేందుకు వైయస్సార్సీపీ ముందుకొస్తోంది, నాయకుడు వస్తున్నాడన్న దైర్యం కల్పించడం ప్రధాన ప్రతిపక్షం బాధ్యతని ధర్మాన అన్నారు.  జగనన్న వస్తున్నాడు నవరత్నాలు తెస్తున్నాడన్న స్లోగన్ తో ప్రజల్లోకి వెళ్తామన్నారు. వైయస్ఆర్ ఆశయ సాధన కోసం వైయస్ జగన్ తెస్తున్న నవరత్నాలు పథకాలను ప్రజలు ఆదరిస్తున్నారని ధర్మాన తెలిపారు. 

వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఏపీలో రైతాంగం కుదేలయిపోయి రైతులు తీవ్ర ఆవేదనతో ఉన్నారని ధర్మాన అన్నారు. నేనొస్తే రుణాలన్నీ మాఫీ చేస్తా, బ్యాంకులో బంగారం ఇంటికి తెప్పిస్తానని ఓట్లు వేయించుకున్న చంద్రబాబు...ఎన్నికలయ్యాక వాటిని పూర్తిగా విస్మరించడంతో రుణభారం పెరిగిపోయి రైతులు  ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి వచ్చిందన్నారు. ఉపాధి కోసం వలసలు పోతున్న దుస్థితి నెలకొందన్నారు. శాసనసభ వెలుపల, లోపల ప్రభుత్వానికి రైతాంగం పడుతున్న అవస్థలను చెప్పినా పట్టించుకున్న దాఖలాలు లేవు. వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ప్రభుత్వం ఏ ఒక్క ప్రయత్నం చేయలేదు. రుణమాఫీ నుంచి తప్పించుకునేందుకు మార్గాలు అన్వేషించారు. రూ.87వేల కోట్లపైగా రుణాలు అనౌన్స్ చేశారు. రైతులెవరు రుణాలు కట్టొద్దని చెప్పారు. అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం రుణాలు మాఫీ చేయకపోవడంతో  రైతులకు బ్యాంకులతో సంబంధాలు తెగిపోయాయి. రైతుకు రుణం పుట్టే పరిస్థితి లేదు. ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల చేతుల్లోంచి రైతులను కాపాడేందుకు 70 ఏళ్ల క్రితం ఏ ప్రయత్నం జరిగిందో బాబు స్వార్థం వల్ల అది కుప్ప కూలిపోయింది. బ్యాంకుల్లో అప్పు తీసుకునేనాడు ఇన్సూరెన్స్  ప్రీమియం చెల్లిస్తే బీమా సౌకర్యం వచ్చేది. ఇప్పుడు అది రావడం లేదు. ఇన్ పుట్ సబ్సిడీ ఆగిపోయింది. చంద్రబాబు చేసిన మోసానికి 70లక్షల కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయి. వైయస్సార్సీపీ అధికారంలోకి వస్తే వైయస్ఆర్ రైతు భరోసాతో ఆదుకుంటానని వైయస్ జగన్ రైతులకు వైయస్ఆర్ రైతు భరోసానిచ్చారు. ఏడాదికి రూ. 12వేల 500 చొప్పున ఐదేళ్లకు రూ. 50వేల రుణాలు నేరుగా రైతుకు అందించే కార్యక్రమం. 66లక్షల కుటుంబాలు ప్రయోజనం పొందుతున్నాయి. 33వేల కోట్లు రైతులకు అదనంగా అందించే కార్యక్రమం.

మహిళలు తన సొంత కాళ్లపై నిలబడేలా వైయస్ఆర్ డ్వాక్రారుణాలు ఇచ్చి వారిలో ఆత్మవిశ్వాసం నింపారు. బ్యాంకుల నుంచి 20వేల కోట్లు రుణం ఇప్పించి  మహిళలు ప్రతీ కార్యక్రమాల్లో పాల్గొనే శక్తి, ఉత్సాహం ఇచ్చారు. తద్వారా ఆదాయం పెరిగింది. సమాజంలో మహిళల గౌరవం, ఆత్మవిశ్వాసం పెరిగింది. కానీ నేడు,  మహిళలు ఇంటినుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. బ్యాంకు మెట్లు ఎక్కే పరిస్థితి లేదు. మీరు రుణం కట్టొద్దంటూ బాబు ఓటేయించుకున్నారు. మోసం చేశారు. వడ్డీ పెరుకుపోతుంది. తన కుటుంబ యజమానితో సమానంగా ఆదాయం సంపాదిస్తున్నామన్న నమ్మకాన్ని మహిళలు కోల్పోయారు.  మహానేత వైయస్ఆర్ కుల, మత, ప్రాంత, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించి ప్రజాస్వామ్యంలో ఇలాంటి పాలన ఉందా అని రుచిచూపించారు. సంక్షేమానికి వైయస్ఆర్ అమలు చేసిన మూలసూత్రాలు పునికిపుచ్చుకొని వచ్చిన పార్టీగా ధరలస్థిరీకరణ నిధి, పెన్షన్లు, ఇతరత్రా నవరత్నాలు అమలు చేసేందుకు  వైయస్సార్సీపీ నిర్ణయం తీసుకుంది. 

ప్రస్తుత పాలనలో పెన్షన్ అమలు కోసం జన్మభూమి కమిటీలపైనా ఆధారపడాల్సిన దుస్థితి. మీకు ఓటేసే వాళ్లకే పెన్షన్ ఇస్తున్నారు తప్ప...పేదల ఆకలిని, కన్నీళ్లను తూడ్చేవిధంగా ఆలోచన చేయడం లేదు.  దీనికి వైయస్సార్సీపీ పూర్తిగా వ్యతిరేకం.  వైయస్ఆర్ సంక్షేమ పథకాలను దేశంలోని ఇతర రాష్ట్రాలన్నీ అమలు చేసిన పరిస్థితి. చంద్రబాబుది  దుర్మార్గపు పరిపాలన. వైయస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక పెన్షన్ వేయి నుంచి రూ. 2వేలు చేయడమే గాకుండా... అర్హత గల ప్రతి ఒక్కరికీ న్యాయం చేయడం జరుగుతుంది. చంద్రబాబు 27 లక్షల ఇళ్లు కడాతమని మేనిఫెస్టోలో పెట్టారు. రూ.5వేలైనా కట్టారా..? ఇంత దారుణమా..?మహానేత వైయస్ఆర్ లక్షలాది ఇళ్లు కట్టించగా మిగిలిపోయినవి మీరు కడతారని చూసి ఓటేసారు. కానీ, బాబు పేదలకు ఇళ్లు కట్టించిన పాపాన పోవడం లేదు. అందుకే వైయస్ జగన్ నవరత్నాల్లో భాగంగా వైయస్ఆర్ కలను నిజం చేసేందుకు ఐదేళ్లలో 25లక్షల ఇళ్లు నిర్మాణం చేయాలని నిర్ణయించారు. ఏపీలో ఇళ్లు లేని వారెవరూ ఉండకూడదన్నదే వైయస్ జగన్ భావన. ఇళ్లు, ఆస్తులు లేకపోయినా నాకొడుకు సొంతింట్లో నివసిస్తే చాలన్న పేదల ఆశల్ని వైయస్ జగన్ నెరవేర్చబోతున్నారు.  మిగిలిన కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకే జగనన్న వస్తున్నాడు. వైయస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఈ కార్యక్రమం ప్రారంభమవుతోంది.

ఫీజు రీయింబర్స్ మెంట్ లేకపోతే బీదలు బీదలుగా, పెద్దలు పెద్దలుగా ఉండిపోతారు. అందుకే దేశంలో ఎక్కడా లేనివిధంగా ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని తీసుకొచ్చి వైయస్ఆర్ ఎంతోమందికి చదువుకునే అవకాశం ఇచ్చారు. పీజు రీయింబర్స్ మెంట్ తో ఎంతో మంది జీవన శైలి మారింది. విదేశాల్లో ఉన్నారు. సమాజంలో ఉన్నతంగా ఉన్నారు. మళ్లీ దీన్ని పెద్ద ఎత్తున చేపట్టేందుకు ఫీజు రీయింబర్స్ మెంట్ తో పాటు విద్యార్థి వసతి కోసం రూ. 20 వేలు ఇవ్వాలని వైయస్సార్సీపీ నిర్ణయించింది. ఏ బీదవాడైనా ఉన్నత విద్యనభ్యసించేందుకు బీదరికం అడ్డుకాకూడదన్నదే వైయస్ జగన్ ఆలోచన. ఏ లక్ష్యం కోసం వైయస్సార్సీపీ ఆవిర్భవించిందో ....వైయస్ఆర్ ఆశయాలను అమలు చేసేందుకు నూటికి నూరుపాళ్లు పనిచేయాలన్న నేపథ్యంలోనే ప్రజల్లో విశ్వాసం నింపేందుకు నవరత్నాలను విడుదల చేశాం. ప్రభుత్వ మోసాల గురించి శాసనసభలో, వెలుపల కరపత్రాలు పంచాం. గగ్గోలుపెట్టాం. ఐనా,  పట్టించుకోలేదు. మా కార్యక్రమాల్ని చులకనగా చేసి మాట్లాడుతోంది. ప్రజాసంఘాలను సంప్రదించడం లేదు. విచ్చలవిడిగా దోపిడీ జరుగుతోంది. ఎక్కడ కూడ ప్రజాస్వామ్యబద్ధంగా పాలన జరగడం లేదు.  ప్రతిపక్ష బాధ్యత అప్పజెప్పిన పౌరులకు నేను వస్తున్నాను మీరు నిరూత్సాహపడాల్సిన అవసరం లేదన్న భరోసాతోనే అన్నొస్తున్నాడు నవరత్నాలు తెస్తున్నాడన్న స్లోగన్ తో ప్రజల్లోకి వెళ్తున్నాం . ప్రభుత్వ వైఫల్యాలతో చిన్నాభిన్నమైన ప్రజలకు వైయస్సార్సీపీ అండగా ఉందన్న భరోసా వైయస్ జగన్ అని ధర్మాన అన్నారు.  వైయస్ఆర్ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకొని వారి సమస్యలకు పరిష్కారం చూపి దేశవ్యాప్తంగా ఏవిధంగా మన్ననలు పొందారో..ఆ అడుగుజాడల్లోనే వైయస్ జగన్ నడుస్తున్నారు.  ప్రజల్లో ధైర్యం నింపేందుకు  రూ. 3వేల కి.మీ.  వైయస్ జగన్ అక్టోబర్ 27 నుంచి పాదయాత్ర చేపడుతారు.