Printed on 26-05-2018 11:43:40 AM

చెప్పేవి నీతులు.. చేసేవి దరిద్రపు చేష్టలు
నెల్లూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పేవన్నీ నీతి సూక్తులు.. చేసేవన్నీ దరిద్రపు చేష్టలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబు ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను దిగజార్చుతున్నాడని మండిపడ్డారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌ సీపీకి రాజ్యసభ సీటు రాకుండా చేసేందుకే చంద్రబాబు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను డబ్బులతో ప్రలోభపెట్టి లాక్కుంటున్నాడని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలంతా ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవాలంటే ఇలాంటి దరిద్ర చేష్టలను ఖండించాలన్నారు. ప్రజలు కూడా బాబు అరాచకాలను భరించే స్థితిలో లేరన్నారు. 
చంద్రబాబు పరమ మోసగాడు

Printed on 26-05-2018 11:43:40 AM

చంద్రబాబు పరమ మోసగాడు
ఢిల్లీ: చంద్రబాబు పరమ మోసగాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రివర్గంలో కొనసాగుతూ విభజన అంశాలపై టీడీపీ డ్రామాలు ఆడుతుందని మండిపడ్డారు. పార్లమెంట్‌ ఆవరణలో మేకపాటి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు నైతిక విలువలు లేవని, మోడీ గ్రాఫ్‌ తగ్గిందని ఆందోళనలు చేస్తున్నారని, మోడీ గ్రాఫ్‌ మళ్లీ పెరిగితే.. వాళ్ల చెంతకే చేరుతాడన్నారు. గతంలో మోడీని నానా మాటలని మళ్లీ లాలూచీ పడ్డారన్నారు. చంద్రబాబు మోసాలకు అంతు లేకుండా పోయిందని మేకపాటి మండిపడ్డారు. స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టిన చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టేందుకు ఢిల్లీ కేంద్రంగా డ్రామాలు ఆడుతున్నాడన్నారు. టీడీపీ ఎంపీల డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై చంద్రబాబు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. కేంద్రమంత్రులు అశోక్‌ గజపతిరాజు, సుజనా చౌదరిలు ఆందోళనల్లో ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. కేంద్రాన్ని చంద్రబాబు ప్రశ్నిస్తే కేసులు పెడతారని భయమా అని నిలదీశారు. మీ కేసుల భయంతో రాష్ట్రాన్ని పణంగా పెడతారా..? మీరు దొంగ నాటకాలాడుతూ ఇతరులపై విమర్శలు చేస్తారా..? అని చంద్రబాబు ప్రభుత్వంపై మేకపాటి ధ్వజమెత్తారు. టీడీపీ ఆడుతున్న డ్రామాలకు ప్రజలు కచ్చితంగా బుద్ధి చెప్పతారని హెచ్చరించారు. 
ప్రత్యేక హోదాతోనే ఏపీ అభివృద్ధి సాధ్యం

Printed on 26-05-2018 11:43:40 AM

ప్రత్యేక హోదాతోనే ఏపీ అభివృద్ధి సాధ్యం


నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. మేం మొదటి నుంచి ప్రత్యేక హోదానే కోరుతున్నామని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా సంజీవని అని చెప్పి..ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీ కావాలని కేంద్రాన్ని కోరాడన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు ప్యాకేజీ జపం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. మార్చి 1న అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నా కార్యక్రమాలు, 5న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టినట్లు ఎంపీ మేకపాటి వెల్లడించారు. నిరసన కార్యక్రమాల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మన వాణిని వినిపిద్దామని ఆయన పిలుపునిచ్చారు.
 
బాబు సీఎం పదవికి అనర్హుడు

Printed on 26-05-2018 11:43:40 AM

బాబు సీఎం పదవికి అనర్హుడు
నెల్లూరు:  రాష్ట్ర ప్రయోజనాలు పట్టని చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవికి అనర్హుడని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. బాబును రాజకీయాల నుంచి వెలివేయాలని ఆయన సూచించారు. మాకు పదవులు ముఖ్యం కాదని, ప్రజల కోసం పోరాటం చేస్తామని, వైయస్‌ జగన్‌ నేతృత్వంలో హోదా కోసం ఎన్ని త్యాగాలకైనా సిద్ధమే అని ప్రకటించారు. చంద్రబాబు డైరెక్షన్‌లో టీడీపీ ఎంపీలు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి పోరాడుతుంది మేమే అన్నారు.  చంద్రబాబుకు ఓటుకు  కోట్లు కేసు భయం పట్టుకుందని విమర్శించారు.