Printed on 20-04-2018 22:11:06 PM

ఏపీకి పట్టిన శని పోవాలంటే బాబు గద్దె దిగాలి
గుంటూరు: దేశ చరిత్రలో అబద్ధాలతో ముఖ్యమంత్రి అయిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడని, ఆయన చెప్పేవన్ని అబద్ధాలేనని వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ వరప్రసాదరావు విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రైతుల నోట్లో మన్నుకొట్టారని మండిపడ్డారు. వ్యవసాయం శుద్ధ దండుగ అని చెప్పిన వ్యక్తి ముఖ్యమంత్రి స్థానానికి అనర్హుడని ధ్వజమెత్తారు. గుంటూరులో వైయస్ జగన్ రైతు దీక్ష వేదికపై ఎంపీ వరప్రసాద్‌ మాట్లాడారు.  రైతులు ఓట్లు వేయకపోతే గెలవలేమని తెలిసి అబద్ధాల పుట్టను రైతులపై వెదజల్లి ఓట్లు వేయించుకొని చివరకు వారిని అష్టకష్టాలు పెడుతున్నారని బాబుపై మండిపడ్డారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని తీసేసిన దరిద్ర ఘనత చంద్రబాబుదన్నారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర దొరక్కుండా పోతుందన్నారు. పెట్టుబడులు కూడా దక్కక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలనిచ్చి రైతులను, యువకులను, డ్వాక్రా మహిళలను అందరినీ మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాజన్న పాలన మళ్లీ రావాలంటే తప్పనిసరిగా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు. దమ్మున్న నాయకుడు వైయస్‌ జగన్‌ అని వ్యాఖ్యానించారు. ఏపీకి పట్టిన శనిపోవాలంటే చంద్రబాబు గద్దెదిగాలన్నారు. బీజేపీతో భాగస్వామి అయిన చంద్రబాబు ప్రత్యేక హోదాను సాధించడంలో కూడా విఫలమయ్యాడని, అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు అని విమర్శించారు. 
టీడీపీని భూస్థాపితం చేద్దాం..?

Printed on 20-04-2018 22:11:06 PM

టీడీపీని భూస్థాపితం చేద్దాం..?
శ్రీకాకుళంః రైతులను, మహిళలను అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్న మహానేత దివంగత ముఖ్యమత్రి డా.  వైయస్ఆర్ అని రెడ్డి శాంతి అన్నారు. హీరమండలంలో నిర్వాసితుల సభ వేదిక నుంచి ఆమె మాట్లాడుతూ...బాబు సర్కార్ పై నిప్పులు చెరిగారు. వైయస్ఆర్ చనిపోయాక 9వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. బాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నాఒక్క రూపాయి కూడ నిర్వాసితులకు పరిహారం అందిన పాపాన పోలేదన్నారు. జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు పునరావాసం అందిస్తాం, యూత్ ప్యాకేజీ ఇస్తామని చెప్పి మోసం చేశారని ఫైర్ అయ్యారు. ప్రచార ఆర్భాటాల తెలుగుదేశానికి బుద్ధి చెబుదామని ప్రజలకు పిలుపునిచ్చారు. 

మీ అందరికి నేనున్నానంటూ భరోసా ఇస్తూ మీకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని చెప్పేందుకే వైయస్ జగన్ ఇక్కడకు వచ్చారని రెడ్డి శాంతి తెలిపారు. పాతపట్న నియోజకవర్గంలో వైయస్ఆర్ ఆశీస్సులతో జగన్ అండదండలతో ప్రతీ ఓటరు కలమట వెంకటరమణను గెలిపిస్తే నమ్మకద్రోహం చేశాడని మండిపడ్డారు. అన్నం పెట్టే చేయినే నరికేశాడంటూ కలమటపై నిప్పులు చెరిగారు. నిర్వాసితుల అభివృద్ధి కోసం వెళ్తున్నానని చెప్పి టీడీపీలోకి వెళ్లిన కలమట....ఇసుక దందాలు చేసి కోట్లు సంపాదించుకుంటున్నాడని రెడ్డి శాంతి ధ్వజమెత్తారు. ఉపాధి హామీ పథకం పనులను, నీరు‍‍చెట్టు, పుట్ట గట్టు అన్నీ తినేస్తున్నాడని దుయ్యబట్టారు. పేదలను ఆదుకోవాలన్న తపన ఉన్న నాయకుడు జగన్ అని రెడ్డి శాంతి పేర్కొన్నారు. టీడీపీ సర్కార్ ను కూల్చేసి...రాబోయే ఎన్నికల్లో వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేసుకుందామని పిలుపునిచ్చారు. 

అరాచక పాలనను తరిమికొడదాం

Printed on 20-04-2018 22:11:06 PM

అరాచక పాలనను తరిమికొడదాం
ప్రకాశంః గిద్దలూరు మండలం ముళ్ళపాడు (పంచాయతీ) గ్రామంలో నియోజకవర్గ ఇంచార్జ్ ఐవీ రెడ్డి గడప గడపకు వైయస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐ.వి.రెడ్డి యువసేన ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీతో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోని దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గడపగడపలో ఐ.వి.రెడ్డికి మహిళలు హారతులు పట్టారు.  అనంతరం ఐ.వి.రెడ్డి మాట్లాడుతూ.... రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న తెలుగుదేశం పార్టీకి  రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు పూర్తిగా రుణ మాఫీ చేస్తానని చెప్పి బాబు మోసం చేశాడన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పాడు.  అధికారంలోకి వచ్చాక ఉన్న జాబులు తీసేస్తున్నాడని ఫైర్ అయ్యారు.  నాడు దివంగత మహానేత వై.యస్.రాజశేఖర రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలను చంద్రబాబు ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని ఐ.వి.రెడ్డి మండిపడ్డారు.  ఇటువంటి ప్రభుత్వం దేశము లోనే ఎక్కడా లేని,  దౌర్జన్య పాలన ఆంద్రప్రదేశ్ లోనే ఉందని  విమర్శించారు. తెలుగుదేశం పార్టీ  అవినీతి, మోసాలపై గడపగడపకు తిరుగుతూ ప్రజలకు వివరించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.