Printed on 15-12-2018 07:59:37 AM

వైయ‌స్ఆర్‌సీపీలో భారీగా చేరిక‌లు
శ్రీ‌కాకుళం:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌పార్టీ జాతీయ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాయ‌క‌త్వాన్ని మెచ్చి, ఆయ‌న చేస్తున్న పోరాటాల‌కు ఆక‌ర్షితులై చాలా మంది వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అందులో భాగంగానే శ్రీ‌కాకుళం జిల్లా కొత్తూరు మండ‌లంలోని మ‌హ‌సింగి గూడ‌లో చాలా మంది యువ‌త‌, మ‌హిళ‌లు జిల్లా అధ్య‌క్షురాలు రెడ్డి శాంతి ఆధ్వ‌ర్యంలో పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి త‌మ వంతు కృషి చేస్తామ‌న్నారు.
జననేత సమక్షంలో పార్టీలో చేరిన శ్రీనివాసరావు

Printed on 15-12-2018 07:59:37 AM

జననేత సమక్షంలో పార్టీలో చేరిన శ్రీనివాసరావు
పశ్చిమ గోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ వడ్లపట్ల శ్రీనివాసరావు జననేత సమక్షంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. శ్రీనివాసరావుతో పాటు దుగ్గిరాల మాజీ సర్పంచ్‌ వెంటం ఆనందరావుతో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వైయస్‌ జగన్‌ దెందులూరు నియోజకవర్గ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టినా అఖండ మెజార్టీతో గెలిపిస్తామన్నారు. 
వైయస్ఆర్ కాంగ్రెస్ లోకి చేరికలు

Printed on 15-12-2018 07:59:37 AM

వైయస్ఆర్ కాంగ్రెస్ లోకి చేరికలు

చింతలపూడి నియోజకవర్గంలోని జంగారెడ్డిగూడెం మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ పిపిఎన్ చంద్రరావు, తన అనుచరులతో కలిసి గురువారం వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజా సంకల్పయాత్ర శిబిరంలో అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు కండువా కప్పిపార్టీలోకి ఆహ్వానించారు. చంద్రరావు ప్రస్తుతం జంగారెడ్డి గూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఉన్నారు.