Printed on 18-02-2018 02:59:34 AM

జననేతకు ఘనస్వాగతం
కదిరి: అనంతపురం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి అభిమానులు ఘన స్వాగతం పలికారు.  ఉదయం బెంగళూరు నుంచి పులివెందులకు వైఎస్ జగన్ రోడ్డు మార్గంలో బయలుదేరారు.  కదిరి పట్టణంలోని వేమారెడ్డి సర్కిల్‌లో ఆయన కాన్వాయ్‌ను చూసిన అభిమానులు అభివాదాలు చేస్తూ ఘనస్వాగతం పలికారు. వాహనం దిగి వచ్చి  వైఎస్ జగన్ వారందరినీ ఆప్యాయంగా పలకరించారు. దీంతో, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. కదిరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చాంద్‌బాషా టీడీపీలో చేరడం వల్ల పార్టీకి స్థానికంగా వచ్చిన నష్టం ఏమీ లేదంటూ వారు ఈ సందర్భంగా నినాదాలు చేశారు.

To read this article in English: http://bit.ly/1VQ4sjC

జ‌న‌నేత‌కు ఘ‌న‌స్వాగ‌తం

Printed on 18-02-2018 02:59:34 AM

జ‌న‌నేత‌కు ఘ‌న‌స్వాగ‌తం
అశ్వారావుపేట‌: ఖ‌మ్మం జిల్లా అశ్వారావుపేట‌లో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి ప్ర‌జ‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ముంపు మండ‌లాల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ ఏపీలో విలీన‌మైన కుక్కునూరు మండ‌ల ప‌ర్య‌ట‌న‌కు అశ్వారావుపేట మీదుగా వెళ్లారు. ఈ సంద‌ర్భంగా బ‌స్టాండ్ సెంట‌ర్‌లో అభిమానుల కోరిక మేర‌కు వైయ‌స్ జ‌గ‌న్ మహానేత  వైయ‌స్సార్ విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళులర్పించారు.  వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌ల‌వ‌డానికి మ‌హిళ‌లు పెద్ద సంఖ్య‌లో పోటీప‌డ్డారు. వైయస్ జగన్ కుక్కునూరు మండ‌ల ప‌ర్య‌ట‌న ముగించుకొని బుధ‌వారం రాత్రి బూర్గంపాడు మండ‌లం మోరంప‌ల్లి బంజ‌ర‌, కొత్త‌గూడెం, ఖ‌మ్మం మీదుగా హైద‌రాబాద్‌కు చేరుకున్నారు. మోరంప‌ల్లి బంజ‌ర‌లో వైయ‌స్సార్ విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళులర్పించారు. 
గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఘనస్వాగతం

Printed on 18-02-2018 02:59:34 AM

గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఘనస్వాగతం
విజయవాడ :  వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ఏలూరుకు బయలుదేరారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి  గన్నవరం ఎయిర్ పోర్ట్ చేరుకున్న వైయ‌స్ జగన్ కు పార్టీ ఎమ్మెల్యేలు ఉప్పలేటి కల్పన, రక్షణ నిధి, మేకా ప్రతాప అప్పారావుతోపాటు నేతలు కె పార్థసారధి, జోగి రమేష్, గౌతంరెడ్డి, సామినేని ఉదయభాను, డాక్టర్ దుట్టా రామచంద్రరావు  ఘన స్వాగతం పలికారు. అనంతరం హనుమాన్ జంక్షన్ వరకు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి భారీ ర్యాలీగా వెళ్లారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని శ్రీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ లో జరిగే యువ భేరి కార్యక్రమంలో వైయస్ జగన్ పాల్గొంటారు.
జననేతకు జన నీరాజనం

Printed on 18-02-2018 02:59:34 AM

జననేతకు జన నీరాజనం
  • తిమ్మంపల్లిలో వైయస్‌ జగన్‌కు బ్రహ్మరథం
  • అడుగడుగునా ఘన స్వాగతం పలికిన ప్రజలు
  • అందరినీ ఆప్యాయంగా పలకరించిన జననేత
తాడిపత్రి : వైయస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు నీరాజనం పలికారు. యల్లనూరు మండలం తిమ్మంపల్లికి వచ్చారు.  తాడిపత్రి నియోజకవర్గ వైయస్సార్‌సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి కుమారుడు హర్షవర్దన్‌రెడ్డి, కోడలు సాయి అర్చితలను ఆశీర్వదించారు. అంతకు ముందు ఆయన వైయస్సార్‌ జిల్లా పులివెందుల నుంచి బయలుదేరి యల్లనూరు మండలం దంతలపల్లి, శింగవరం మీదుగా తిమ్మంపల్లికి చేరుకున్నారు. దంతలపల్లి వద్ద కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, జిల్లా యువజన విభాగం అ«ధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి, జిల్లా, తాడిపత్రి, శింగనమల నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. 

అక్కడి నుంచి 12 కిలోమీటర్ల దూరంలోని తిమ్మంపల్లికి చేరుకునేందుకు మూడు గంటలు పట్టింది. దారి పొడవునా వృద్ధులు, మహిళలు, యవకులు, విద్యార్థులు, రైతులు పెద్దసంఖ్యలో బారులుతీరి జననేతకు స్వాగతం పలికారు. వారికి జగన్‌ అభివాదం చేస్తూ, ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వగ్రామమైన తిమ్మంపల్లిలో వీధులన్నీ జనంతో నిండిపోయాయి.  ప్రధాన రోడ్డుకు ఇరువైపులా, ఇళ్లపై నిలబడి జగన్‌ను చూసేందుకు ఎగబడ్డారు. ఒకదశలో వారిని అదుపుచేయడం పోలీసులకు కష్టంగా మారింది. నూతన దంపతులు కేతిరెడ్డి హర్షవర్దన్‌రెడ్డి, సాయి అర్చితలను ఆశీర్వదించిన తర్వాత జగన్‌..   వారి కుంటుంబ సభ్యులతో  కలిసి భోజనం చేశారు. 

కార్యక్రమంలో రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, రాప్తాడు, కదిరి నియోజక వర్గ సమన్వయకర్తలు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, డాక్టర్‌ సిద్ధారెడ్డి, పార్టీ జిల్లా నేత ఎర్రిస్వామిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రమేష్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి వీఆర్‌ వెంకటేశ్వరరెడ్డి, రాష్ట్ర రైతు విభాగం నాయకుడు గూడూరు సూర్యనారాయణరెడ్డి, యాడికి జెడ్పీటీసీ సభ్యుడు వెంకట్రామిరెడ్డి, తాడిపత్రి పట్టణ,  రూరల్, పెద్దపప్పూరు, యాడికి పార్టీ కన్వీనర్‌లు రామ్మోహన్‌రెడ్డి, నాగేశ్వరరెడ్డి, రఘునాథ్‌రెడ్డి, రమేష్‌నాయుడు, నాయకులు ఆలూరు రామచంద్రారెడ్డి, రంగారెడ్డి, సుంకిరెడ్డి, వేంనాథ్‌రెడ్డి, మున్నా, శివారెడ్డి, రంగనాథ్‌రెడ్డి, కిషోర్, టీకే ఫయాజ్, మునాఫ్, ప్రదీప్, సంపత్, బాలరాజు తదితర నాయకులు పాల్గొన్నారు.

వైయస్ జగన్ కు ఘనస్వాగతం

Printed on 18-02-2018 02:59:34 AM

వైయస్ జగన్ కు ఘనస్వాగతం
అమరావతి: అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు గన్నవరం విమానాశ్రయం చేరుకున్న వైయస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ కు పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం గన్నవరం మండలం కేసరపల్లిలో వైయస్‌ఆర్‌సీసీ రాష్ట్ర కార్యదర్శి తోట శ్రీనివాసులు ఆధ్వర్యంలో వైయస్‌ జగన్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మహిళలు జగన్‌కు హారతి ఇచ్చారు. వైయస్‌ జగన్‌తో పాటు రాజ‍్యసభ సభ‍్యుడు  విజయసాయిరెడ్డి, పలువురు శాసనసభ్యులు ఉన్నారు.
వైయస్‌ జగన్‌కు ఘన స్వాగతం

Printed on 18-02-2018 02:59:34 AM

వైయస్‌ జగన్‌కు ఘన స్వాగతం
అమరావతి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి గన్నవరం ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు విజయవాడ వచ్చిన వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని మంగళవారం పార్టీ నాయకులు పార్థసారధి, వంగవీటి రాధా, వెల్లంపల్లి శ్రీనివాస్,  దుట్టా రామచంద్రరావు, మేరుగ నాగార్జున తదితరులు ఎయిర్‌పోర్టులో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అపూర్వ స్వాగతం పలికారు.
తురకపల్లెలో పూలవర్షం

Printed on 18-02-2018 02:59:34 AM

తురకపల్లెలో పూలవర్షం
 
వైయస్‌ఆర్‌ జిల్లా:  ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ఆర్‌ జిల్లా తురకపల్లె గ్రామానికి చేరుకున్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి గ్రామస్తులు పూలవర్షం కురిపించారు. నాలుగు కిలోమీటర్ల మేర ఎదురెళ్లి జననేతకు ఆత్మీయ స్వాగతం పలికారు. మహిళలు హారతి పట్టి, నుదుటన తిలకం దిద్దారు.
 
పూలవ‌ర్షం

Printed on 18-02-2018 02:59:34 AM

పూలవ‌ర్షం
వైయస్‌ఆర్‌ జిల్లా:  వైయస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్రకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలతో లబ్ధిపొందిన ప్రజలు వైయస్‌ జగన్‌కు ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారు. ఎటు చూసినా జనమే. అశేష జనవాహిని ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి పూలతో స్వాగతం పలుకుతున్నారు. ఏడో రోజు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా దువ్వూరులో ప్రజలు పూలవర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
 
గులాబీలతో స్వాగతం

Printed on 18-02-2018 02:59:34 AM

గులాబీలతో స్వాగతం
కర్నూలు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి చాగలమ్రరిలో అపూర్వ స్వాగతం దక్కింది. గ్రామానికి విద్యార్థినులు గులాబీలు అందజేసి ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం తమ పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు లేవని తెలిపారు. కంప్యూటర్లు పని చేయడం లేదని ఫిర్యాదు చేశారు.

 
ఆత్మీయ స్వాగ‌తం

Printed on 18-02-2018 02:59:34 AM

ఆత్మీయ స్వాగ‌తం


చిత్తూరు:  ప్రజా సంకల్ప యాత్రలో వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మహిళల నుంచి విశేష స్పందన లభిస్తోంది.  అడుగడుగునా హారతులిచ్చి, తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.ఇవాళ ఉద‌యం కిలికిరి నుంచి వైయ‌స్ జ‌గ‌న్‌ పాదయాత్ర ప్రారంభమైంది. కొత్త‌ప‌ల్లి క్రాస్ మీదుగా యాత్ర సాగుతుండడంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అభిమానులు చుట్టుముట్టడంతో పాదయాత్ర కాస్త ఆలస్యమైంది. ఎక్కడికక్కడ మహిళలు హారతులు పడుతూ, దిష్టి తీస్తూ ఆత్మీయ స్వాగతం పలికారు.  పీలేరు కో–ఆప్షన్‌ సభ్యుడు హాబీబ్‌బాషా, ఎంపీపీ హరిత ఆధ్వర్యంలో 500 మంది మహిళలు వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ చిహ్నాలు కలిగిన చీరలు ధరించి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆత్మీయ స్వాగతం పలికారు. పాదయాత్రలో వీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.