Printed on 27-05-2018 01:03:22 AM

ధరల స్థిరీకరణ, జ్యూస్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తా
అనంతపురం: దళారుల మోసాలతో అప్పులపాలు అవుతున్నామని టమాటా రైతులు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌కు మొరపెట్టుకున్నారు. టమాట ధరల పతనంపై అన్నదాతలు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులను కలుసుకున్న వైయస్‌ జగన్‌ వారి నిరసనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారంతా జననేతకు వారి కష్టాలను చెప్పుకున్నారు. ఎవరూ అధైర్య పడొద్దని, అన్ని విధాలుగా రైతులకు అండగా ఉంటానన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ధరల స్థిరీకరణ, జ్యూస్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తానని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. 
మహానేతకు మంచిపేరు వస్తుందని అధికార పార్టీ కుట్రలు

Printed on 27-05-2018 01:03:22 AM

మహానేతకు మంచిపేరు వస్తుందని అధికార పార్టీ కుట్రలు
అనంతపురం: మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి అయితే ఆయనకు మంచి పేరు వస్తుందని అధికార పార్టీలు కుట్రలు చేస్తున్నాయని అనంతపురం రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పలువురు రైతులు వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలు వివరించారు.  మహానేత మరణాంతరం హంద్రీనీవాను పూర్తి చేయకుండా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబులు మోసం చేశారని రైతులు విమర్శించారు. రెయిన్‌గన్ల పేరుతో రైతులను దగా చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవదని చంద్రబాబు గ్రహించి డబ్బులో గెలిచేందుకు అవినీతికి తెర లేపారని రైతులు ఆరోపించారు. నాడు చంద్రబాబు పాలనలో రైతాంగం దుర్భరంగా మారడంతో యస్‌ఆర్‌ హయాంలో రైతుల దర్జాగా బతికారన్నారు. 
 
వైయ‌స్ జగన్‌కు కలిసిన చెరుకు రైతులు

Printed on 27-05-2018 01:03:22 AM

వైయ‌స్ జగన్‌కు కలిసిన చెరుకు రైతులు

చిత్తూరు: ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డిని గురువారం ఉదయం చెల్లూరు క్రాస్‌ వద్ద చెరుకు రైతులు కలిశారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. చంద్ర‌బాబు ఎప్పుడు ముఖ్య‌మంత్రి అయినా కూడా జిల్లాలోని స‌హ‌కార చ‌క్కెర ఫ్యాక్ట‌రీలు మూత ప‌డుతున్నాయ‌ని తెలిపారు. న‌ల్లం బెల్లం త‌యారి చేయ‌కుండా ఆంక్ష‌లు విధించి త‌మ క‌డుపు కొడుతున్నార‌ని రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వారికి వైయ‌స్ జ‌గ‌న్ భ‌రోసా క‌ల్పించారు.
మన్నవరం ప్రాజెక్టును పూర్తి చేయాలి

Printed on 27-05-2018 01:03:22 AM

మన్నవరం ప్రాజెక్టును పూర్తి చేయాలి
చిత్తూరు: మన్నవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని స్థానికులు వైయస్‌ జగన్‌ను కోరారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను వివరించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి బతికి ఉంటే ఈ ప్రాజెక్టు ఎప్పుడో పూర్తి అయ్యేదని, ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య ఉండేది కాదని జననేత దృష్టికి తీసుకెళ్లారు.  కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మన్నవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని కోరారు.
 
వైయస్‌ జగన్‌ను కలిసిన రైతులు

Printed on 27-05-2018 01:03:22 AM

వైయస్‌ జగన్‌ను కలిసిన రైతులు
ఒంగోలు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కనిగిరి నియోజకవర్గంలో రైతులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా తమ పొలాలకు నీరు అందడం లేదని తెలిపారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారికి వైయస్‌ జగన్‌ భరోసా కల్పించారు.
 
గిట్టుబాటు ధర లేదని కందిరైతుల ఆవేదన

Printed on 27-05-2018 01:03:22 AM

గిట్టుబాటు ధర లేదని కందిరైతుల ఆవేదన
ప్రకాశం: ఆరుగాలం పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కంది రైతులు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి వారి ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కనిగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌ను కంది రైతులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి సమస్యను జననేతకు వివరించారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఏ పంట పండించినా గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. రూ. 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశాడన్నారు. పంటలకు మద్దతు ధర లేకపోవడంతో రోడ్లపై పారబోయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఈ మేరకు స్పందించిన వైయస్‌ జగన్‌ ఇంకో ఏడాది ఓపిక పట్టుకోవాలని, మన ప్రభుత్వం రాగానే వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కూడా కల్పిస్తామని వారికి భరోసా ఇచ్చారు.
వైయస్‌ జగన్‌ను కలిసిన మిర్చి, శనగ రైతులు

Printed on 27-05-2018 01:03:22 AM

వైయస్‌ జగన్‌ను కలిసిన మిర్చి, శనగ రైతులు
ప్రకాశం: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో ఇంకొల్లు మండలం మిర్చి, శనగ రైతులు కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. పండిన పంటకు కనీస మద్దతు ధర లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శనగ పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయిందని, ఎకరానికి 8 క్వింటాల్‌కు మించడం లేదని చెప్పారు. గతేడాది రూ.7 వేల మద్దతు ధర ఉండేది. ఇప్పుడు రూ.3500 అంటున్నారు. కనీసం కౌలు డబ్బులు కూడా రావడం లేదు. పండిన పంటకు గిట్టుబాట ధర లేదు. మిర్చికి రూ.10 వేలు ఇ వ్వాలని, శనగకు రూ.6 నుంచి 8 వేలు కవాలని, వైయస్‌ జగన్‌ను కలిసిన మిర్చి, శనగ రైతులు. నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సాగర్‌ నీరు తీసుకురావాలని వైయస్‌ జగన్‌కు కోరారు. వారందరికీ వైయస్‌ జగన్‌ మంచి రోజులు వస్తాయని ధైర్యం చెప్పారు.
 
వైయస్‌ జగన్‌ను కలిసిన రైతులు

Printed on 27-05-2018 01:03:22 AM

వైయస్‌ జగన్‌ను కలిసిన రైతులు

గుంటూరు: ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని మంగళగిరి నియోజకవర్గంలో రైతులు కలిశారు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని రైతులు వైయస్‌ జగన్‌కు వివరించారు. శనగలకు మూడేళ్లుగా గిట్టుబాటు ధర లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు మరో ఏడాదిలో దిగిపోతున్నానని రైతులను పట్టించుకోవడం లేదని ఆన్నదాతలు వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు.
 
బాబు వైఫ‌ల్యం వ‌ల్లే క్రాప్ హాలిడే

Printed on 27-05-2018 01:03:22 AM

బాబు వైఫ‌ల్యం వ‌ల్లే క్రాప్ హాలిడే

విజ‌య‌వాడ‌: వ‌్య‌వ‌సాయం ప‌ట్ల చంద్రబాబు వైఫల్యం కారణంగా క్రాప్‌ హాలిడే ప్రకటించాల్సి వచ్చిందని  కృష్ణా జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కృష్ణాజిల్లా రైతులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని కలిశారు. వేల క్యూసెక్కుల నీరు వృధాగా పోతున్న పట్టించుకోవడం లేదని వారు తెలిపారు. ఏ పంట‌కు గిట్టుబాటు ధ‌ర లేద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. మీరు సీఎం కావాల‌ని, రాజ‌న్న రాజ్యం తీసుకురావాల‌ని రైతులు వైయ‌స్ జ‌గ‌న్‌ను కోరారు.
వైయస్‌ జగన్‌ను కలిసిన మామిడి రైతులు

Printed on 27-05-2018 01:03:22 AM

వైయస్‌ జగన్‌ను కలిసిన మామిడి రైతులు
నూజివీడు: ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని మామిడి రైతులు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. మామిడి పంటకు ప్రసిద్ధి చెందిన నూజివీడు నియోజకవర్గం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ఈదర చేరుకున్న వైయస్‌ జగన్ను మామిడి రైతులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి సమస్యలను జననేతకు చెప్పుకున్నారు. మామిడి దిగుబడికి సరైన ధర కల్పించడం లేదని, రైతులకు ప్రభుత్వం నుంచి చేయూత లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. 
వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన రైతులు

Printed on 27-05-2018 01:03:22 AM

వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన రైతులు

కృష్ణా జిల్లా: ప‌్ర‌జా స‌మస్య‌లు తెలుసుకునేందుకు పాద‌యాత్ర‌గా బ‌య‌లుదేరిన వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని సోమ‌వారం కృష్ణా జిల్లా రైతులు అగిరిప‌ల్లి వ‌ద్ద క‌లిశారు. ఈ సంద‌ర్భంగా తాము పండించిన ఏ పంట‌కు గిట్టుబాటు ధ‌ర లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. భూగ‌ర్భ జ‌లాలు అడుగంటి పోవ‌డంతో వ్య‌వ‌సాయం భారంగా మారింద‌ని వాపోయారు. వారి స‌మ‌స్య‌లు సావ‌ధానంగా విన్న వైయ‌స్ జ‌గ‌న్ రైతుల‌కు భ‌రోసాక‌ల్పించారు. మ‌రో ఏడాది ఓపిక ప‌డితే మంచి రోజులు వ‌స్తాయ‌ని హామీ ఇచ్చారు.
పట్టిసీమతో ఒరిగింది ఏమీ లేదు

Printed on 27-05-2018 01:03:22 AM

పట్టిసీమతో ఒరిగింది ఏమీ లేదు

కృష్ణా జిల్లా: పట్టిసీమతో రైతులకు ఒరిగింది ఏమీ లేదని స్థానికులు పేర్కొంటున్నారు. పెడన నియోజకవర్గంలో రైతులు వైయస్‌ జగన్‌ను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. సాగునీరు అందక తమ పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయామని వాపోయారు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాది ఓపిక పట్టాలని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.