Printed on 21-10-2018 12:05:09 PM

టీడీపీ ప్రభుత్వంలో దళితులకు రక్షణ కరువు
సత్తెనపల్లి: టీడీపీ ప్రభుత్వంలో దళితులకు రక్షణ కరువైందని వైయస్సార్‌ సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి కోడిరెక్క దేవదాస్‌ విమర్శించారు. సోమవారం పట్టణంలోని పార్టీ కార్యా లయం లో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రకాశం జిల్లా దేవరపల్లి గ్రామంలో గత 70 ఏళ్ళుగా భూములను వ్యవసాయం చేసుకొని జీవిస్తున్న దళితులకుకు చెందిన 300 ఎకరాల భూమిని టీడీపీ నాయకులు దౌర్జన్యంగా లాగేసు కోవడం బాధాకరమన్నారు. విషయం తెలుసుకున్న వైయస్సార్‌ సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున అక్కడకు వెళ్ళుతుండగా మార్గ మద్యలోనే అరెస్ట్‌ చేయడం చాలా బాధాకరమన్నారు. దళితులకు వైయస్సార్‌ సీపీ అండగా ఉంటుంద న్నారు. సమావేశంలో ఎస్సీ సెల్‌ పట్టణ అధ్యక్షుడు చుక్కా మోషే, పార్టీ నాయకులు ఎద్దులదొడ్డి శ్రీనివాసరావు, ఎస్డీ హుస్మాన్, తదితరులు ఉన్నారు.