Printed on 24-07-2017 04:12:08 AM

తండ్రీకొడుకులవి పచ్చి అబద్ధాలు
  • 5లక్షల ఉద్యోగాలంటూ పచ్చి మోసం
  • బలహీనవర్గాలను కించపర్చేలా లోకేష్ వ్యాఖ్యలు
  • మైనారిటీలకు చంద్రబాబు శఠగోపం
  • టీడీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు
హైదరాబాద్ః రాయలసీమకు 5 లక్షల ఉద్యోగాలిచ్చామంటూ చంద్రబాబు, లోకేష్ లు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి మండిపడ్డారు. ఎక్కడ ఇచ్చారో చెప్పమంటే అభివృద్ధి నిరోధక పార్టీ అంటూ చంద్రబాబు వైయస్సార్సీపీపై అభాండాలు వేస్తున్నాడని పార్థసారధి ఫైర్ అయ్యారు. నిన్నటికి నిన్న కర్నూలు జిల్లా పర్యటనలో 5లక్షల ఉద్యోగాలిచ్చామన్న లోకేష్ ను ప్రజాసంఘాల నేతలు, చదువుకున్న యువకులు ఏ విధంగా నిలదీశారో మనమంతా చూశామన్నారు. ఒక్క ఉద్యోగం ఇచ్చినట్టు చూపించు అని లోకేష్ ను ప్రశ్నించడంతో మంత్రి సమాధానం చెప్పుకోలేక రేయ్ వినరా అంటూ ఏవిధంగా దౌర్జన్యం చేశాడో చూశామన్నారు. అంతటితో ఆగకుండా బలహీన వర్గాలకు సీటు ఇస్తే గెలవగలరా అంటూ లోకేష్ వారిని అవమానించాడన్నారు.  అంటే బలహీన వర్గాలు ఏమీ చేయలేరు. రాజకీయాలు చేతకాదన్న అభిప్రాయంతోనే ఓడిపోయే సీట్లను టీడీపీ బలహీన వర్గాలకు కేటాయిస్తున్నట్టుగా అర్థమవుతోంద్నారు. లోకేష్ తీరును చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని పార్థసారధి అన్నారు.  బలహీన వర్గాలను కించపర్చిన టీడీపీకి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. 

ఖరీఫ్ పంటకు సంబంధించి రైతుల సమస్యలేవీ పట్టించుకోకుండా ..... నంద్యాల ఎన్నికల్లో బాబు ఈవెంట్ మేనేజర్ గా మారాడని పార్థసారధి దుయ్యబట్టారు. ఎమ్మెల్యేలు పోతేనే నియోజకవర్గాలు బాగుపడుతున్నాయన్న అభిప్రాయానికి చంద్రబాబు పార్టీ రావడం దారుణమన్నారు. చంద్రబాబు ఎక్కడ అబివృద్ధి చేయడు. ఎన్నికల్లో చేస్తున్నట్టు నటిస్తారని టీడీపీ నేతలే చెబుతున్నారని పార్థసారధి అన్నారు. ఎన్నికలున్నాయనే నంద్యాలలో రూ300కోట్లు జీవోలిచ్చారుని, అవి కూడ ఇంప్లిమెంట్ కావని అందరికీ తెలుసునన్నారు. నంద్యాలలో హామీలు గుప్పిస్తున్న చంద్రబాబు మిగతా నియోజకవర్గాలకు ఎందుకు చేయడం లేదని నిలదీశారు.  బాబు చెప్పే వన్నీ అబద్ధాలు, చేసేవన్నీ మోసాలేనని దుయ్యబట్టారు. కృష్ణాడెల్టాలో పిల్లకాలువలకు నీళ్లెక్కే పరిస్థితి లేక రైతులు మోటార్లతో నీళ్లు తోడుకుంటున్న దుస్థితి వస్తే...రైతులకు ఖరీఫ్ పెట్టుబడి, నీళ్లిచ్చాం  సత్తాచూపండని ముఖ్యమంత్రి చెప్పడం సిగ్గుచేటన్నారు. రాయలసీమకు నీళ్లిచ్చామంటూ హడావిడి చేసి గడ్డాలు, గుండు గీయించుకున్నారే తప్ప ఎక్కడ కూడ నీళ్లిచ్చి ఆదుకున్న పాపాన పోవడం లేదన్నారు. చంద్రబాబు నిర్వాకం కారణంగా కాపుకొచ్చిన చినీచెట్లను వేర్లతో సహా నరికేసిన పరిస్థితి వచ్చిందన్నారు. బాబు మాటలు నమ్మి నందికొట్కూరులో మినుములేసిన రైతులు పశువులకు మేపుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇదంతా స్వయంగా ఆయన అనుకూల పత్రిక ఏబీఎన్ లోనే వచ్చిందని స్పష్టం చేశారు. మైనారిటీలకు ఒక్క మంత్రి పదవికి కూడ ఇవ్వని ఘనుడు చంద్రబాబుని దుయ్యబట్టారు. వైయస్సార్సీపీ నుంచి గెలిచిన ఇద్దరు మైనారిటీలకు మంత్రి పదవి ఇస్తానని ఆశపెట్టి పార్టీలోకి తీసుకొని ఏవిధంగా శఠగోపం పెట్టారో ప్రజలంతా చూశారన్నారు. మైనారిటీలకు చంద్రబాబు చేసింది శూన్యమని పార్థసారధి చెప్పారు. ఉప ఎన్నికలో నంద్యాల ప్రజలు టీడీపీని బంగాళాఖాతంలో కలపడం ఖాయమని ఆయన అన్నారు.