Printed on 25-06-2018 19:08:59 PM

అన్నదాతను రోడ్డున పడేస్తున్న ఏపీ సర్కార్‌
 • వ్యవసాయం శుద్ధదండగ అనే ఆలోచనలో చంద్రబాబు
 • మే 1, 2 తేదీకి వైయస్‌ జగన్‌ రైతు దీక్ష వాయిదా
 • రైతులారా ఆత్మస్థైర్యం కోల్పోవద్దు
 • ప్రభుత్వం మెడలు వంచైనా మద్దతు ధరను పొందుదాం
 • వైయస్ జగన్ రైతు దీక్షను విజయవంతం చేద్దాం
 • వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ
హైదరాబాద్‌: వ్యవసాయం శుద్ధ దండగ అనే ఆలోచనను చంద్రబాబు నాయుడు సార్థకత చేసుకుంటున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బొత్స సత్య నారాయణ విమర్శించారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కూడా చెల్లించకుండా అన్నదాతను రోడ్డున పడేస్తున్నాడని బొత్స మండిపడ్డారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో బొత్స విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  ఎన్నికల సమయంలో రైతులకు రూ. 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తాం.. పంటలకు గిట్టుబాటుధర రానప్పుడు ప్రభుత్వమే మద్దతు ధరను కల్పిస్తుందని చంద్రబాబు ప్రగల్భాలు పలికారన్నారు. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే ఆ స్థిరీకరణ నిధి కనుచూపుమెరలో కూడా కనిపించడం లేదన్నారు. ప్రస్తుతం రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైందన్నారు. మిర్చి, సుబాబుల్, పసుపు పండించే రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. కందులు, టమాట, మామిడి పండించే రైతులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు మద్దతు ధర కల్పించాలని ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని నిలదీసినా చలనం లేదన్నారు. మార్కెట్‌ ద్వారా కొనుగోలు చేస్తాం.. సీసీఐ ద్వారా కొంటామని చంద్రబాబు ఉత్తర కుమారుడి ప్రగల్భాలు పలుకుతున్నాడని మండిపడ్డారు. 

ప్రతిపక్షం పోరాటం చేసినా ప్రభుత్వంలో చలనం లేదు
ప్రభుత్వ మెడలు వంచైనా రైతు పంటకు కనీస మద్దతు ధర కల్పించాలని గుంటూరు వేదికగా ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతుదీక్ష చేయనున్నారని బొత్స స్పష్టం చేశారు. ఈ నెల 26, 27 తేదీల్లో నిర్వహించాల్సిన వైయస్‌ జగన్‌ దీక్ష వాయిదా పడిందన్నారు. మే 1, 2 తేదీలకు మార్చడం జరిగిందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకొని రైతులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతోనే వైయస్‌ జగన్‌ దీక్ష చేస్తున్నారన్నారు. రైతు సోదరులంతా దీక్షకు మద్దతు పలికి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రైతును మోసం చేస్తున్న ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. రైతుల తరపున వైయస్సార్సీపీ పోరాటం కొనసాగిస్తుందని చెప్పారు.  పట్టెడన్నం పెట్టేవాడిగా రైతు ఉండాలి కానీ, చెయ్యిచాచేవాడిలా ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే వైయస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. 

టీడీపీ నేతలకేనా మద్దతు ధర
నూటికి 80 శాతం మంది రైతులు దళారులకు పంటను అమ్ముకొని మోసపోతున్నారని బొత్స సత్యనారాయణ చెప్పారు. అయినా ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ధ్వజమెత్తారు. క్వింటాలుకు రూ. 1500 ఇస్తామని చెప్పి సర్టిఫికేట్లు అంటూ తిరకాసు పెడుతున్నారు. అన్నీ ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకుడై ఉంటేనే ఆ ధర కల్పిస్తున్నారని విమర్శించారు. గతంలో ప్రత్తి రైతుల విషయంలో కూడా ప్రభుత్వం ఇదే విధంగా మోసం చేసిందన్నారు. సంబంధిత మంత్రి అనుచరులు, టీడీపీ నాయకులు, కంపెనీల యాజమాన్యాలు రైతుకు మద్దతు ధర ఇవ్వకుండా దోచుకుతిన్నారని ఆరోపించారు. ప్రత్తి కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే 26 మంది దోషులుగా తేలిన విషయాన్ని గుర్తు చేశారు. గత ప్రభుత్వాల హయాంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఆ ప్రభుత్వాలు చొరవ చూపి ఇతర రాష్ట్రాలకు పంటలను పంపించి రైతులను ఆదుకోవడం జరిగిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే ఈ విధంగా మోసం చేస్తే రైతులు వారి ఆవేదనను ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. రుణమాఫీ విషయంలో కూడా ఇదే విధంగా బాబు మోసం చేశారని బొత్స ధ్వజమెత్తారు. గత మూడు సంవత్సరాలుగా ప్రతిపక్ష పార్టీ రైతుల పక్షాన పోరాడుతుంటే రాజకీయ ఉద్దేశ్యాలతో ప్రభుత్వం తన పబ్బం గడుపుకోవడానికి పయత్నం చేస్తుందన్నారు. ప్రభుత్వ మెడలు వంచైనా మద్దతు ధర కల్పించుకుందామని రైతులకు సూచించారు. 
చంద్రబాబు రైతు వ్యతిరేకి

Printed on 25-06-2018 19:08:59 PM

చంద్రబాబు రైతు వ్యతిరేకి
 • రైతు సమస్యలపై చర్చకు భయపడి పారిపోయిన బాబు
 • ముఖ్యమంత్రి పదవిని భ్రష్టుపట్టిస్తున్న చంద్రబాబు
 • ధరల స్థిరీకరణ నిధి ఏమైంది..?
 • దోచుకోవడం, దాచుకోవడం తప్ప రైతు శ్రేయస్సు పట్టదా..?
 • కాళ్లబేరం బాబు నైజం.. వైయస్‌ జగన్‌ది కాదు
 • వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి
నెల్లూరు: చంద్రబాబు రైతు వ్యతిరేకి అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి విమర్శించారు. జీఎస్‌టీ బిల్లుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించినా.. తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వలేదని తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. నెల్లూరు జిల్లా వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిన్నటి రోజున అసెంబ్లీ సమావేశాల్లో జీఎస్‌టీ బిల్లుతో పాటు రైతు సమస్యలపై చర్చించాలని ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ సూచించారని చెప్పారు. రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. వారి సమస్యలపై చర్చిద్దాం.. అవకాశం ఇవ్వండి.. అసెంబ్లీని ఒక్కరోజు కాకుండా నాలుగు రోజులు పాటు పొడిగించైనా కులంకుశంగా చర్చించాలని వాయిదా తీర్మాణం ఇస్తే దాన్ని తోసిపుచ్చారన్నారు. అయినా రైతాంగ సమస్యలను చర్చించడానికి ప్రభుత్వం వెనుకడుగువేసిందన్నారు. రైతుల సమస్యలు ప్రభుత్వానికి పట్టవా అని ప్రశ్నించారు. ప్రభుత్వ బండారం బయటపడుతోందని పలాయనం చిత్తగించిందన్నారు. 

మూడు సంవత్సరాలైంది స్వామినాథన్‌ కమిటీ సిఫార్సు ఎక్కడా?
ఎన్నికల సమయంలో రైతుల పంటలకు స్వామినాథన్‌ కమిటీ సిఫారస్సులను అమలు చేస్తామని, రూ. 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు.. అవన్నీ ఏమైపోయాయని కాకాణి చంద్రబాబును ప్రశ్నించారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మీకు బాధగా లేదా అని నిలదీశారు. ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు గడిచినా ధరల స్థిరీకరణ నిధి ఊసే లేదన్నారు. చంద్రబాబు పరిపాలనలో రాష్ట్రంలో వ్యవసాయం మొత్తం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. ఇప్పటి వరకు అనేక సార్లు క్యాబినెట్‌ మీటింగ్‌లు పెట్టుకున్నారు. వాటిల్లో ఒక్కసారైనా రైతుల సమస్యలపై చర్చించారా అని ధ్వజమెత్తారు. ఎంతసేపు రైతులు భూములు ఎలా లాక్కోవాలి... లాక్కున్న భూమిని ఏ విధంగా పారిశ్రామిక వేత్తకు అప్పగించి ముడుపులు సాధించాలనే ఆలోచన తప్ప రైతాంగ శ్రేయస్సు, మద్ధతు ధర గురించి ఆలోచనే లేదన్నారు. 

ప్రధానిని ఇన్‌డైరెక్ట్‌గా విమర్శించాలా..?
చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిని దిగజార్చుతూ, భ్రష్టుపట్టిస్తున్నాడని కాకాణి విమర్శించారు. ప్రధానిపై  నేరుగా కాకుండా ఇన్‌డైరెక్ట్‌గా విమర్శలు చేయండి అని స్వయానా ముఖ్యమంత్రి చెప్పడం నీచం అన్నారు. ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ ప్రధానిని కలవడంతో టీడీపీలో కలవరం మొదలైందన్నారు. ఏ విధంగా వైయస్‌ జగన్‌ను ఇబ్బంది పెట్టడానికి అవకాశం దొరుకుతుందా అని ప్రభుత్వం కాచుకొని కూర్చుందన్నారు. కేసుల గురించి ప్రధాని దగ్గర వైయస్‌ జగన్‌ కాళ్లబేరం ఆడారని మాట్లాడుతున్న టీడీపీ నేతల వ్యాఖ్యాలను కాకాణి ఖండించారు. చంద్రబాబులా కాళ్లబేరమాడే వ్యక్తిత్వం వైయస్‌ జగన్‌కు ఉంటే ఇన్ని అక్రమ కేసులు, ఇబ్బందులు ఉండేవి కావని స్పష్టం చేశారు. ఆత్మగౌరవ నినాదంతో సోనియాగాంధీ లాంటి వ్యక్తిని ఢీ కొనడం వల్లే కష్టాలు కొని తెచ్చుకున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు ఏం మాట్లాడే పరిస్థితుల్లో లేక ప్రతిపక్షంపై బురదజల్లుతూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడన్నారు. రైతుల సంక్షేమంపై ముఖ్యమంత్రికి, మంత్రులకు చిత్తశుద్ధి లేదన్నారు. రైతుల పక్షాన వైయస్‌ఆర్‌సీపీ పోరాటం చేస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.