Printed on 23-07-2018 05:58:54 AM

బాబు ప్ర‌జ‌ల‌ను మోసం చేశారు
నడికుడి(దాచేపల్లి): చ‌ంద్ర‌బాబు నాయుడు ఎన్నిక‌ల ముందు విడుద‌ల చేసిన మేనిఫెస్టోలోని ఏ ఒక్క హామీని ఇప్ప‌టి వ‌ర‌కు నెర‌వేర్చ‌లేద‌ని, ప్ర‌జ‌ల‌ను న‌మ్మించి మోసం చేశార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు విమ‌ర్శించారు. మూడున్న‌రేళ్ల కాలంలో ఏ ఒక్క ప‌ని చేయ‌ని చంద్ర‌బాబు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఇంటింటికీ టీడీపీ కార్య‌క్ర‌మం చేప‌ట్టార‌ని ప్ర‌శ్నించారు. నారాయణపురం పార్టీ కార్యాలయంలో సోమవారం జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో అంబ‌టి మాట్లాడుతూ  రైతులు, డ్వాక్రా మహిళలకు సంపూర్ణంగా రుణాలు మాఫీచేయకుండా...అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలు గడిచిన నిరుద్యోగభృతి ఇవ్వకుండా..సీసీ రోడ్లు వేయకుండా వేసినట్లే బిల్లులు తీసుకున్నామని, నీరు–చెట్టు ద్వారా వందల కోట్లు దండుకున్నామని, అక్రమమైనింగ్‌ ద్వారా ప్రజాధనంను కొల్లగొట్టామని, చెక్‌డ్యాంలు, తారురోడ్లు నాసిరకంగా నిర్మించి డబ్బులు డ్రా చేసుకున్నామని టీడీపీ నేతలు ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు చెబుతారా అని ఆయన ప్రశ్నించారు. ప్రజలను మెప్పించేస్థాయిలో చంద్రబాబు పాలనా సాగటం లేదని, ప్రజలను బుకాయించి తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఈ కార్యక్రమంను చేపట్టారని ఆయన విమర్శించారు. గడపగడపకూ వైయ‌స్ఆర్‌సీపీని తమ పార్టీ ప్రారంభిస్తే ఇంటింటికీ టీడీపీ అని తమ కార్యక్రమాలను కాఫీ కొడుతుందన్నారు. వైయ‌స్ఆర్‌ కుటుంబంతో తాము ప్రజల్లోకి వెళ్లుతున్నామని, ఎన్టీఆర్‌ కుటుంబంతో ప్రజల్లోకి వెళ్లే దమ్ము చంద్రబాబుకు లేదని, ఎన్టీఆర్‌ కుటుంబాన్ని సర్వనాశంన చేశారని ఆయన ఆరోపించారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో గెలుపును వాపుగా చూసుకుని టీడీపీ అతివిశ్వాసంతో ఉందని, నిజమైన తీర్పును ప్రజలు 2019లో వైయ‌స్ఆర్‌సీపీకి ఇస్తారని రాంబాబు చెప్పారు. బీసీసెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ వైయ‌స్ఆర్ స్వర్ణయుగం గురించి ప్రజలకు వివరించి చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించటం కోసమే వైయ‌స్ఆర్ కుటుంబం కార్యక్రమంను ప్రారంభించామని, ఈ కార్యక్రమం ద్వారా తమ పార్టీ ప్రజలకు మరింతగా చేరువ ఆవుతుందన్నారు.
ఫైబర్‌ కుట్రపూరిత గ్రిడ్‌

Printed on 23-07-2018 05:58:54 AM

ఫైబర్‌ కుట్రపూరిత గ్రిడ్‌

కేబుల్‌ ఆపరేటర్స్‌ను రోడ్డుపై నిలబెట్టాలనే దుర్బద్ధి
తనకు ఇష్టమైన ఛానల్స్‌ మాత్రమే చూపించేందుకు కుట్ర
ప్రభుత్వ సంస్థలు టెలివిజన్‌ రంగంలోకి వెళ్లొద్దని చంద్రబాబుకు తెలియదా
కేబుల్‌ ఆపరేటర్స్‌కు పార్టీ అండగా ఉంటుంది
విజయవాడ: కేబుల్‌ ఆపరేటర్స్‌ వ్యవస్థను రోడ్డున పడేసేందుకు చంద్రబాబు కుట్రపూరితంగా ఫైబర్‌ గ్రిడ్‌ను తీసుకువచ్చారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. టెలివిజన్‌ రంగంపై పెత్తనం చలాయించాలనే దుర్బుద్ధిలో చంద్రబాబు, లోకేష్‌ ఉన్నారని మండిపడ్డారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫైబర్‌ గ్రిడ్‌ ఒక విప్లవం అని దీని ద్వారా ప్రతి ఇంటికి కేబుల్‌ టీవీ, హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సర్వీసులు కేవలం రూ. 149కే అందిస్తామని చంద్రబాబు మాట్లాడారని గుర్తు చేశారు. ఫైబర్‌ గ్రిడ్‌ ఏ విధంగానూ ప్రజలకు ఉపయోగపడదన్నారు. కుట్రపూరితంగా ఏర్పాటు చేసిన గ్రిడ్‌ ఇదన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ టెక్నాలజీకి వ్యతిరేకం కాదని, టెక్నాలజీ కొత్తదనానికి ప్రజలు చేరువ కావాలన్నారు. కానీ ప్రభుత్వం మసిపూసి మారేడు కాయ చేస్తుందని ధ్వజమెత్తారు. టెక్నాలజీ ప్రైవేట్‌రంగంతో పాటు ప్రభుత్వరంగం కూడా పోటీ పడినప్పుడే మంచి నాణ్యతగా అందించే అవకాశం ఉంటుందన్నారు. గతంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ తప్ప వేరే ఫోన్‌ లేదన్నారు. కానీ ఇప్పుడు ప్రైవేట్‌రంగం వచ్చాక ఫోన్‌ చార్జిలు చాలా చౌకగా లభిస్తున్నాయన్నారు. టెక్నాలజీ పెరిగిన తరువాత అందరూ పాల్గొనేటట్లు ఉండాలి కానీ.. ప్రభుత్వమే మోనోపలైజ్‌ చేసి దాన్ని స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నం ఫైబర్‌ గ్రిడ్‌ ద్వారా జరుగుతుందన్నారు. 

ట్రాయ్‌ రూల్స్‌ ప్రకారం ఏ ప్రభుత్వ సంస్థ అయినా టెలివిజన్‌ రంగంలోకి రాకూడదని నిబంధన ఉందని అంబటి గుర్తు చేశారు. కానీ చంద్రబాబు దొడ్డిదారిన ఇంటర్నెట్‌ పొటోకాల్‌ టీవీ అనే విధానంతో కేబుల్‌ రంగంలోకి వస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్‌ ఒక దుర్బుద్దితో ఒక మెమోను కూడా విడుదల చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైబర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ తప్ప ఎవరూ విద్యుత్‌ స్తంభాలపై లైన్‌లు వేయడానికి వీల్లేదని చట్టవిరుద్ధమైన ఆర్డర్‌ను పాస్‌ చేశారన్నారు. 4బీ రైట్‌ వే ఆఫ్‌ కేబుల్‌ ఆపరేషన్‌ అండ్‌ పర్మీషన్‌ బై పబ్లిక్‌ అథారిటీ సెక్షన్‌ ప్రకారం లైసెన్స్‌ తీసుకున్న వారు అండర్‌ గ్రౌండ్, పోల్స్‌పై లైన్లు వేసుకోవచ్చు అని నిబంధన ఉందన్నారు. కడపలో కొంతమంది కేబుల్‌ ఆపరేటర్స్‌ కోర్టును ఆశ్రయిస్తే కోర్టు చంద్రబాబు మెమోను కొట్టిపారేసిందన్నారు. తరువాత ఏపీ ఎస్‌ఎఫ్‌ఎల్‌ తప్ప మిగితా ఎవరూ వేసుకున్నా తీసేయమని, అవసరం అయితే పోలీసుల సహకారం తీసుకోవాలని చెప్పడం దుర్మార్గమన్నారు. అంటే ఏపీ ఎస్‌ఎఫ్‌ఎల్‌ ఒక్కరే బిజినెస్‌ చేయాలా అని ప్రశ్నించారు. 

మీడియాపై తన పెత్తనం చెలాయించేందుకు కేబుల్‌ ఆపరేటర్స్‌ సిస్టమ్‌లోకి ప్రభుత్వం ఎంటర్‌ అవుతుందని అంబటి మండిపడ్డారు. గతంలో చంద్రబాబు చెబితే ఒక చానల్‌ను 6 నెలల పాటు ఆంధ్రప్రదేశ్‌లో ప్రసారం కానివ్వకుండా నిలిపివేశారని గుర్తు చేశారు. ఆపరేటర్‌ వ్యవస్థను అంతా తన దగ్గరకు తెచ్చుకుంటే ఇష్టం వచ్చిన చానల్‌ను మాత్రమే చూపించవచ్చు అని కుట్రతో ఫైబర్‌ గ్రిడ్‌ తీసుకువచ్చార ని విరుచుకుపడ్డారు. న్యూస్‌ తప్ప అన్ని పే చానల్స్‌ ఉన్నాయని, అలాంటప్పుడు రూ.149కి ఎలా ఇస్తారని, ఇది సాధ్యపడే గ్రిడ్‌ కాదన్నారు. ఫైబర్‌ గ్రిడ్‌తో వినియోగదారులకు తీవ్రమైన నష్టం కలుగుతుందన్నారు. ఫైబర్‌ గ్రిడ్‌లో  వందల కోట్ల కుంభకోణం జరిగిందని, ఈవీఎంల దొంగతనం కేసుల్లోని నిందితుడు వేమూరి హరికృష్ణను సలహాదారుడిగా పెట్టుకున్నారన్నారు. హెరిటేజ్‌లో డైరెక్టర్‌లు కొల్లి రాజేష్, దేవినేని సీతారాంలు కూడా దీంట్లో భాగస్వాములుగా ఉన్నారన్నారు. తన కోటరీకి దొడ్డిదారిన డబ్బులు అందించేందుకు, కేబుల్‌ ఆపరేటర్‌ వ్యవస్థను తన ఆదీనంలోకి తెచ్చుకునేందుకు ఫైబర్‌ గ్రిడ్‌ ఏర్పాటు చేశారన్నారు. కేబుల్‌ ఆపరేటర్స్‌కు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని అంబటి భరోసా ఇచ్చారు.  
 
క్షుద్రపూజలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరగాలి

Printed on 23-07-2018 05:58:54 AM

క్షుద్రపూజలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరగాలి
చంద్రబాబు హిందూధర్మాన్ని మలినం చేస్తున్నాడు
కొడుకును సీఎం చేయాలని భువనేశ్వరి చేయించారు!
దోషులను తప్పించేందుకే చంద్రబాబు కమిటీ
హైదరాబాద్‌: లోకేష్‌కు అర్ధంతరంగా ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టడం కోసమే ఆయన తల్లి భువనేశ్వరి రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో క్షుద్రపూజలు జరిపించివుంటారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. డిసెంబర్‌ 26వ తేదీన విజయవాడ దుర్గగుడిలో, డిసెంబర్‌ 18వ తేదీన శ్రీకాళహస్తి దేవాలయంలో కాళభైరవ గుడిలో మాసంతం, మద్యం పెట్టి జంతువులను బలిచేసి తాంత్రిక పూజలు చేసినట్లుగా పత్రికల్లో వచ్చిందన్నారు. తాంత్రిక పూజలపై నిజనిర్ధారణ కమిటీ వేశారని, దాని వల్ల ఉపయోగం లేదని, ప్రభుత్వానికి అనుకూలంగా కమిటీ నివేదిక ఇవ్వనుందని అంబటి జోస్యం చెప్పారు. ఈ మేరకు హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు కుటుంబం లోకేష్‌ కోసం దేవాలయాల్లో తాంత్రిక పూజలు చేశారని లోకమంతా కోడైకూస్తుందన్నారు. హిందూ ధర్మానికి సంబంధించిన విషయంపై చంద్రబాబు నిజనిర్ధారణ కమిటీ వేయడం దోషులను తప్పించడమేనన్నారు. క్షుద్ర పూజలు ఎవరు నిర్వహించారో వాస్తవాలు తెలియాలంటే సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. 

సింహాచలం, తిరుపతి ఇంకా రాష్ట్రంలోని అనేక పుణ్యక్షేత్రాల్లో చంద్రబాబు కుటుంబం తాంత్రిక పూజలు నిర్వహించిందో లేదో తెలియాలంటే సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. ఇది కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయమన్నారు. రాజ్యాధికారం, అనుకున్న పనులను దక్కించుకోవడం కోసం తాంత్రిక పూజలు చేయడాన్ని సినిమాల్లో చూశాం.. పురణాల్లో చదివామన్నారు. కానీ సాక్షాత్తు నారావారి పాలనలో హిందూ ధర్మన్ని మలినం చేసే విధంగా క్షుద్రపూజలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రానికే అరిష్టమన్నారు. 

వాస్తవాలు కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు తూతూ మంత్రంగా ఒక కమిటీని వేశారని అంబటి విమర్శించారు. గతంలో తహసీల్దార్‌ వనజాక్షిపై దాడి ఘటనపై కమిటీ, ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్‌పై ఎంపీ, ఎమ్మెల్యే దౌర్జన్యం చేస్తే కమిటీ, చంద్రబాబు షూటింగ్‌ పిచ్చి వల్ల గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే దానిపై ఒక కమిటీ, విశాఖ భూ కుంభకోణంపై ఒక కమిటీ వేశారన్నారు. కానీ ఒక్క కమిటీ కూడా వాస్తవాలు చెప్పలేదన్నారు. చేతులు దులుపుకునేలా చంద్రబాబు కమిటీ వేశారన్నారు. ఎవరు వాస్తవాలు దాచిపెట్టినా దుర్గమ్మ తల్లి మాత్రం వదిలిపెట్టదన్నారు. తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా మీపై ఉగ్రరూపం చూపిస్తుంది చంద్రబాబూ అంటూ హెచ్చరించారు. గతంలో రాజధాని నిర్మాణం కోసం 50 దేవాలయాలను కూల్చివేశారన్నారు. చంద్రబాబు వేసిన కమిటీని ఖండిస్తున్నామని, సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించి వాస్తవాలు తెలపాలని డిమాండ్‌ చేశారు.