Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ డ్రామాల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు: శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి                               చంద్రబాబుపై పోరాడాల్సింది పోయి.. ప్రతిపక్షాన్ని ప్రశ్నించటంలో ఆంతర్యమేంటి?- అంబ‌టి రాంబాబు                               చౌటపాలెంలో పార్టీ జెండా ఆవిష్కరించిన వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి                               వైయ‌స్ జ‌గ‌న్ 93వ రోజు ప్రజాసంకల్పయాత్ర విప్పగుంట శివారు నుంచి ప్రారంభ‌మైంది.                               చింత‌మ‌నేనిపై అన‌ర్హ‌త వేటు వేయాలి: - అసెంబ్లీ కార్య‌ద‌ర్శికి వైయ‌స్ఆర్‌సీపీ ఫిర్యాదు                               చట్టాలు తెలియనిది మాకా..?చంద్రబాబుకా..?: బొత్స స‌త్య‌నారాయ‌ణ‌                               నరేంద్ర మోదీ అంటే చంద్రబాబుకు ఎందుకంత భయం. బీజేపీ మంత్రులు రాజీనామా చేస్తామంటే కేంద్రంలోని మా మంత్రులు రాజీనామా చేయరని చంద్రబాబు అంటున్నారు: పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి                               ఊపిరి ఉన్నంత వ‌ర‌కు హోదా కోసం పోరాడుతూనే ఉంటాం: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి                               ప‌్ర‌త్యేక హోదా సాధించ‌డ‌మే వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ల‌క్ష్యం: భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి                  

మనతోనే

Share

పేరే ఓ భరోసా... ఏళ్లు గడుస్తున్నా ఆయన అడుగు జాడలు చెదిరిపోలేదు. ఆయన మాటల్ని జనం మర్చిపోలేదు. ఆ మహోన్నత నేత ఇంకా వారి హృదయాల్లో సజీవంగా ఉన్నారు. ఆయన్ను... ఆయన జ్ఞాపకాలను అభిమాన జనం గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తూనే ఉన్నారు. ఆయన చేసిన మేలు ప్రతి ఒక్కరి స్మృతిపథంలో మెదులుతూనే ఉంటుంది. ఆపదలో ఉన్న వారికి కొండంత అండగా నిలిచిన వైయస్ లేరని ఆయన అభిమానులు ఎవరూ అనుకోవడంలేదు. అందుకే ఊరూ వాడా వైయస్ విగ్రహాల్ని ప్రతిష్ఠించుకుంటూ వాటిలో ఆయన్ను చూసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకూ దాదాపు మూడు వేల విగ్రహాల్ని ప్రతిష్ఠించారంటే ఆయన పట్ల జనం పెంచుకున్న అభిమానం ఎటువంటిదో అర్థమౌతుంది.

మరికొందరైతే గుడిని నిర్మించి వైయస్సే తమ దేవుడని చాటుకున్నారు. గుంటూరు జిల్లా నకిరికల్లు మండలం కుంకులకుంట గ్రామస్తులు చందాలు వేసుకుని పాలరాతితో వైయస్‌కు గుడి కట్టి తమ మదిలోని ప్రేమను ప్రకటించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల అద్దాల మందిరాలూ నిర్మించారు. నిత్యం దీపం పెట్టి నీరాజనాలర్పిస్తున్నారు. రాష్ట్రంలోనే కాదు దేశ, విదేశాల్లోని తెలుగువారు ఆయన సేవల్ని గుర్తుకు చేసుకుంటూనే ఉన్నారు. కొందరైతే జయంతి అనడానికి కూడా ఇష్టం లేక వైయస్ హ్యాపీ బర్త్‌డే చేసుకుంటున్నారు. వైయస్ జయంతి, వర్ధంతులను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు.

ఆరోగ్యశ్రీ ద్వారా ఎందరికో ప్రాణదాత.. ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా మరెందరికో విద్యాదాత... బడుగు, బలహీన, దళిత వర్గాలకు చరిత్రలో నిలిచిపోయేలా సంక్షేమ పథకాల ప్రదాత.... ఆకలితో ఉన్నవారికిచ్చిన అక్షయపాత్ర (కిలో రూ.రెండుకే బియ్యం)... రైతులకు ఉచిత విద్యుత్తు.. వృద్ధులు, కళాకారులకు నెలనెలా పింఛన్లు.... మహిళలకు పావలా వడ్డీ రుణాలు.. నోళ్లు ఎండి బీడువారిన భూములకు దాహార్తి తీర్చే జలయజ్ఞం.. ఇలా అనేక పథకాల్ని అమలుచేసి చరిత్రలో నిలిచిపోయిన మహానేత వైయస్.. ఆయన మహోన్నత వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న యువనేత వైయస్ జగన్మోహన్‌రెడ్డి.. తండ్రి నడచిన ప్రజా సంక్షేమ బాటలో ముందుకు సాగుతున్నారు. మహానేత కలలుగన్న స్వర్ణ యుగాన్ని సాక్షాత్కరింపజేయడానికి అకుంఠిత దీక్షతో మున్ముందుకు కదులుతున్నారు. పార్టీ పేరులో వైయస్‌ఆర్... జెండాలో వైయస్‌ఆర్... లక్ష్యంలో వైయస్‌ఆర్... కర్తవ్యంలో వైయస్‌ఆర్.... స్ఫూర్తినిచ్చే ప్రతి అడుగులోనూ వైయస్‌ఆర్... అందుకే వైయస్‌ఆర్ అజరామరుడు... ఆయన అనునిత్యం మన వెన్నంటే ఉన్నాడు.. వెన్నుతట్టి ముందుకు నడుపుతూనే ఉంటాడు...


Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com