Epaper      Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             అగ్రిగోల్డ్ బాధితులకు అండగా వైయస్సార్సీపీ                               ఏర్పేడు ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించిన వైయస్ జగన్                               అధికార పార్టీ నేతలతో పోలీసులు, అధికారులు కుమ్మక్కయ్యారుః వైయస్ జగన్                               స్వర్ణముఖి నదీతీరంలో టీడీపీ నేతలు విచ్చలవిడిగా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారుః వైయస్ జగన్                               ఏర్పేడు దుర్ఘటన వెనుక కుట్ర కోణం ఉంది..సీబీఐతో విచారణ జరిపించాలిః వైయస్ జగన్                               లోకేష్ అసమర్థుడు, పనికిమాలిన నాయకుడుః విజయసాయిరెడ్డి                               బుర్రలో గుజ్జులేని వ్యక్తి లోకేష్...ఆయన మంత్రి పదవికి అనర్హుడుః అంబటి రాంబాబు                               చట్టబద్ధంగా వ్యవహరిస్తే స్వాగతిస్తాం..కానీ, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని మా కార్యకర్తల జోలికొస్తే సహించంః విజయసాయిరెడ్డి                               టీడీపీకి చెందిన ఓ దళారి ఫిర్యాదుపై మీరెలా స్పందిస్తారని అసెంబ్లీ సెక్రటరీని నిలదీసిన విజయసాయిరెడ్డి                 

పార్టీ స్పీక్
ఆశల రహదారి

Share

వైయస్ వ్యక్తిత్వంలో ప్రజలు చూసిన విశ్వసనీయత, మాటకు కట్టుబడే తత్వం, ఆత్మీయత వంటి మంచి లక్షణాలకు జగన్మోహన్‌రెడ్డి వారసుడని, జగనైతేనే తన తండ్రి ప్రజాసంక్షేమ పథకాలను కొనసాగించగలడనీ ప్రజలలో భావోద్వేగాలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ ఎక్కడికి వెళ్లినా జనం తండోపతండాలుగా వచ్చి తమ ఆశలను, ఆకాంక్షలను వెల్లడిస్తుండడానికి కారణం అదే. చేవ చచ్చిన కాంగ్రెస్‌ను రెండుసార్లు అధికారంలోకి ఒంటిచేత్తో తీసుకువచ్చి కరవు కోరల్లో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్‌ను ప్రగతి రథంలో కూర్చోబెట్టిన వైయస్‌కున్న తెగువ, సత్తా జగన్‌లో ఉన్నాయని జనం నమ్ముతున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఇచ్చిన మాట కోసం అధిష్టానాన్ని సైతం ధిక్కరించి ఓదార్పు యాత్ర సాగిస్తున్న జగన్‌లో జనానికి వైయస్ కనిపించడంలో ఆశ్చర్యమేముంది? చెప్పినట్లు తలాడిస్తే జగన్‌ను కేంద్రమంత్రిపదవి వరించేది. అధిష్టానానికి జీ హుజూర్ అని ఉంటే సీబీఐ వేధింపులు, ఐటీ నోటీసులు, ఈడీ దాడులు తప్పేవి. ‘తండ్రి మరణాన్ని తట్టుకోలేక మరణించిన అన్ని కుటుంబాలనూ ఓదార్చుతా’నని నల్లకాలువలో ఇచ్చిన మాటను అక్కడే వదిలేస్తే జగన్‌కు ఏ కష్టమూ ఉండేది కాదు.

కానీ మాట తప్పడం, మడమ తిప్పడం ఆ కుటుంబానికి తెలియదు. ‘ఎంత కాలం బతికామన్నది కాదు బతికినంత కాలం ఎలా బతికామన్నదే ముఖ్యం’ అన్న తండ్రి మాటను జగన్ అక్షరాలా పాటిస్తున్నారు. సీబీఐ వేధింపులు, కేసులు, నోటీసులు ఎన్ని ఉన్నా ఓదార్పు యాత్ర అవిశ్రాంతంగా కొనసాగుతూనే ఉంది. నిజం నిలకడమీద తేలుతుంది... ఎప్పటికైనా న్యాయమే జయిస్తుంది అన్న నమ్మకంతో జగన్ తాను ఎంచుకున్న జనం బాటలో మున్ముందుకు దూసుకుపోతూనే ఉన్నారు. జనం తనపై పెట్టుకున్న ఆశలను, ఆకాంక్షలను ఓదార్పు యాత్రలో ప్రత్యక్షంగా చూసి తెలుసుకుంటున్న జగన్ వాటిని నెరవేర్చడానికి అవసరమైన సమగ్రమైన కార్యాచరణ ప్రణాళికను వైయస్‌ఆర్ కాంగ్రెస్ తొలి ప్లీనరీలో ఆవిష్కరించారు. కష్టాలు తొలగిపోయి జనం మోములో చిరునవ్వులు చూసేవరకూ విశ్రమించేది లేదని ప్రతినబూనారు. వైయస్ స్వర్ణయుగం పునరావృతం కావాలని కోరుకుంటున్న జనం ఆశలను నెరవేర్చడానికి అడుగులు వడివడిగా పడుతున్నాయి...

రానున్నది వైయస్ స్వర్ణయుగం...

ఆ దిశగా అడుగేద్దాం అందరం...


Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com