Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             చంద్రబాబు దళిత వ్యతిరేక పాలనః వైవీ సుబ్బారెడ్డి                               మహిళలపై పోలీసుల అరాచకం..దళితులపై దాడి సిగ్గుచేటుః వైవీ సుబ్బారెడ్డి                               బాబు పాలనలో దళితులపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయిః వైవీ సుబ్బారెడ్డి                               ప్రజలారా బాబు మోసపూరిత మాటలు నమ్మవద్దుః బొత్స                               వైయస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన నంద్యాల మాజీ ఎమ్మెల్యే సంజీవరెడ్డి                               దేవరపల్లి ఘటనపై కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్, ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కఠారియాకు ఫిర్యాదు చేసిన ఎంపీ వైవీ                               బాబు తన రాజకీయ స్వార్థం కోసం దళితులపై దాడులు చేయిస్తున్నాడుః బత్తుల                               చంద్రబాబు తన పాలనలో కులవివక్షను పెంచిపోషిస్తున్నాడుః బత్తుల                               రాష్ట్రపతి ఎన్నికల్లో రామ్ నాథ్ కోవింద్ ఘన విజయం..వైయస్ జగన్ హర్షం                 

పార్టీ స్పీక్
ఓదార్పు

Share

పెద్దను కోల్పోవడాన్ని మించిన విషాదం ఏ కుటుంబానికీ ఉండదు. కొన్ని వందల కుటుంబాలకు తమ పెద్దలు లేదా పోషిస్తున్న వారు అర్ధంతరంగా దూరమయ్యారు. మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణాన్ని తట్టుకోలేక వీరందరి గుండెలూ పగిలిపోయాయి. డాక్టర్ వైయస్ఆర్ కుమారుడైన జగన్మోహనరెడ్డిని ఈ పరిణామం తీవ్రంగా కలచివేసింది. ఆ క్షణంలో ఆయన ఆ కుటుంబాలన్నింటినీ ఓదార్చాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా అందుకు నడుం బిగించారు. ఆ లక్ష్యానికి ఎన్నో అవరోధాలు వేగ నిరోధకాలుగా మారాయి. 'పెద్దాయన" పట్టుదలను పుణికిపుచ్చుకున్న ఆయనకు ఇవన్నీ పిపిలీకాల్లా మారిపోయాయి. జనం చెంతకు చేర్చాయి. జనకోటి హృదిలో స్థానాన్ని సంపాదించిపెట్టాయి. ఓదార్పు ప్రభంజనంలా మారింది. జగనన్నా మా ఊరెప్పుడొస్తావన్నా అంటూ అడిగి మరీ తీసుకెళ్ళే స్థాయికి చేరింది.

జన'కోటి'కి 'ఓదార్పు'

227 రోజులు.. 16,707 కిలోమీటర్లు

జన హృదయ నేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక అస్తమయం రాష్ట్రంలో ఓ మహా విషాదాన్నే సృష్టించింది. రాష్ట్రం గుండెలవిసేలా రోదించింది. ఆత్మీయ ఆసరా కోల్పోయినట్లు తెలుగుజాతి యావత్తూ విలవిల్లాడింది. వైయస్ మరణాన్ని తట్టుకోలేక వందలాది మంది ప్రాణాలొదిలారు. తన తండ్రి కోసం ప్రాణాలర్పించిన వారి కుటుంబాలను ఓదార్చడానికి వచ్చిన జగన్‌లో ప్రజలు కన్న కొడుకును చూశారు, తోబుట్టువుగా, పెద్ద దిక్కుగా భావించారు. నిన్నటి దుఃఖాన్ని మరచి నేడు నిబ్బరంగా నిలవడానికి, రేపటిపై ఆశలు నింపుకోవడానికి ఆధారాన్ని చూశారు. అందుకే ఎండనకా, వాననకా, రేయనకా పగలనకా వేచి చూశారు. కరచాలనాలు చేశారు, అక్కునజేర్చుకున్నారు, ముద్దాడారు, కష్టాలు చెప్పుకున్నారు, కన్నీరు కార్చారు, కంచంలో కూటిని నోటికి అందించారు, పస్తులుంటూ దాచిన చిల్లర కాసులు ఇచ్చారు. జగనన్నా! నీవు ఒంటరివి కాదు!! నీ వెంట మేమున్నామంటూ తోడు నిలిచారు
.
వ్యక్తిగా ఓదార్పును ప్రారంభించిన జగన్, ప్రజల మనిషిగా మారిపోయారు. ప్రజాప్రస్థానం వైయస్‌ను చరిత్రలోనే అరుదైన జన హృదయ నేతగా మారిస్తే, ఓదార్పు యాత్ర జగన్‌ను ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు అద్దంగా నిలిపింది. జగన్ ఇప్పుడు ఒక వ్యక్తికాదు, ఒక మహా ప్రజా శక్తి. ఆ ప్రజలే ప్రత్యర్థుల కుట్రలను, కుతంత్రాలను ఓడించే బ్రహ్మాస్త్రమయ్యారు, రక్షణ కల్పించే కంచుకోటయ్యారు. అందుకే రోజులు, వారాలు, నెలలు గడిచిపోయినా, రోళ్లు పగిలే ఎండలు, ఎముకలు కొరికే చలి, కుండపోత వానలు, అనారోగ్యం, వైద్యుల సలహాలు ఏవీ జగన్‌మోహన్ రెడ్డి కి అడ్డంకి కాలేకపోయాయి. వేనవేల కిలోమీటర్ల ఓదార్పుయాత్రతో కోటి మంది గుండె తలుపులు తట్టాక, ఓదార్పు ఇక జగన్‌ది కాకుండా పోయింది. అది ప్రజల ఓదార్పు యాత్రగా మారిపోయింది. ప్రజలు తమను తాము ఓదార్చుకుని బంగారు భవితను నిర్మించుకునే సాధనంగా మారిపోయింది. ఆ క్రమంలోనే వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది. ఓదార్పు పాఠాలే జెండా అయ్యాయి, అజెండా గామారాయి.


 మాటకు కట్టుబడినందువల్లే...
 మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణాన్ని ఆంధ్రావని తట్టుకోలేకపోయింది. అనేక గుండెలు ఆగిపోయాయి. వైయస్ మరణించిన 22వ రోజున నల్లకాలువ వద్ద ఏర్పాటైన సభలో జగన్మోహన్­రెడ్డి మాట్లాడుతూ.. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక మరణించిన ప్రతి కుటుంబాన్నీ రానున్న రోజుల్లో కలుసుకుని ఓదారుస్తానని మాట ఇచ్చారు.  తెలుగునేల నలు చెరగులా జనం  జగన్‌ను ఆత్మీయంగా అక్కున చేర్చుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో  మొదలైన ఓదార్పు, అనంతరం అశేష జనాదరణతో ఓ ప్రభంజనంలా మారింది.  ఈ పరిణామం ఎందుకో చాలామందికి నచ్చలేదు.  ఓదార్పు యాత్ర వద్దని, అన్ని కుటుంబాలను ఒక్క చోట చేర్చి పరామర్శిస్తే సరిపోతుందని కాంగ్రెస్ అధిష్ఠానం షరతులు విధించింది. అనేక ఆటంకాలు కలిగించింది. ఇచ్చినమాటకు కట్టుబడిన జగన్, వాటిని ఖాతరు చేయలేదు. ఎన్ని కష్టాలెదురైనా ముందుకే సాగారు. చివరకు కుటుంబాన్నీ చీల్చడానికి ప్రయత్నాలు సాగడంతో ఆయన పార్టీని  వీడాల్సి వచ్చింది. అధిష్ఠానం చెప్పినట్లు వింటే ఆయనకు కేంద్రమంత్రి పదవి లభించేది. ఐటీ నోటీసులు, సీబీఐ దాడులు ఉండేవి కావు.  జగన్‌కు.. ‘ఎంతకాలం బతికామన్నది కాదు,  ఎలా బతికామన్నదే ముఖ్యం.’ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ప్రాణం కన్నా ప్రధానం.
 
 వైయస్ పాదయాత్ర ప్రారంభం రోజునే ఓదార్పు మొదలు...
 ఓదార్పు యాత్ర.. రాష్ట్రంలోనే కాదు.. దేశ చరిత్రలోనే.. ఇంకా చెప్పాలంటే ప్రపంచ చరిత్రలో కూడా ఓ అరుదైన యాత్ర. 13 జిల్లాల్లో 227 రోజుల్లో 16,707 కిలోమీటర్లకుపైగా పర్యటించి ప్రజలతో మమేకమైన వర్తమాన చరిత్ర.. ఓదార్పు యాత్ర. సమకాలీన రాజకీయాల్లో దేశంలోనే ఏ నాయకుడూ జనంలో ఇంత విస్తృతంగా పర్యటించిన దాఖలా లేనే లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే.. జగన్మోహన్‌రెడ్డి చూసినంత దగ్గరగా పేదరికాన్ని చూసిన సమకాలీన రాజకీయ నాయకుడు లేనే లేడు.
  పేదల కష్టాలు తెలుసుకోవడానికి 2003 ఏప్రిల్­ 9న మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర ప్రారంభించారు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత అదే తేదీన 2010, ఏప్రిల్ 9న జగన్ ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టారు.  ఆయన ఇప్పటివరకూ 4,558 గ్రామాలు, వందపైచిలుకు పట్టణాలు, నగరాల్లో విస్తృతంగా పర్యటించారు. మొత్తం 2,607 సభల్లో సుమారు 1,000 గంటలపాటు ఆయన ప్రసంగించారు. ఈ సభల్లో దాదాపుగా కోటి మంది పాల్గొని ఉంటారని అంచనా. వీరుకాక దారిపొడవునా లక్షలాది మందిని ఆయన కలిసి వారి సాదకబాధకాలు తెలుసుకున్నారు. మహానేత మరణాన్ని తట్టుకోలేక  ప్రాణాలు విడిచిన 475 మంది అభిమానుల ఇళ్ళకు వెళ్ళి వారి కుటుంబాలను  ఓదార్చారు. మహానేతను కోల్పోయాం.. కుటుంబ పెద్దనూ కోల్పోయాం.. ఎలా బతకాలిరా దేవుడా అనుకుంటున్న వారికి.. భవిష్యత్తుపై భరోసా కలిగించారు జగన్మోహన్­రెడ్డి.  ‘మీకు అండగా నేనున్నాను. ఏ కష్టమొచ్చినా నాకు ఒక్క ఫోన్‌చేయండి.. మీ కుటుంబంలో నేనూ ఒకడినని గుర్తుంచుకోండి’ అంటూ వారికి బతుకుపై ఆశలు చిగురింపజేశారు. రాగి జావైనా, పెరుగన్నమైనా.. వారు పెట్టిందే పరమాన్నంగా తిన్నారు. ప్రకాశం జిల్లా పూనూరులో భూదేవమ్మ అనే వృద్ధురాలు.. రాజన్న చేసిన మేలుకు కృతజ్ఞతగా వంద రూపాయలిచ్చి ఉంచుకోమన్నా, మరో కుటుంబం కొత్త దుస్తులు ఇచ్చినా .. అభిమాన బహుమతిని కాదనకుండా తీసుకున్నారు.

సీఎంగా సంతకానికో పెన్ను
ఖమ్మం జిల్లా ఓదార్పు యాత్రలో భాగంగా కొత్తగూడెంలోని ఆర్కాట్ సోమసుందరం కుటుంబాన్ని ఓదార్చడానికి వెళ్లిన ఆయనకు, సోమసుందరం భార్య సరస్వతి ఓ పెన్నును బహుమతిగా ఇచ్చారు. ‘‘మీరు సీఎం అయ్యాక ఈ పెన్నుతో సంతకం చేయాలన్నది మా కోరిక’’ అంటూ ఆమె ఇచ్చిన పెన్నును ఆయన ఎంతో ఆప్యాయంగా స్వీకరించారు. తల్లిదండ్రుల కోరిక మేరకు వందలాది మంది చిన్నారులకు జననేతే నామకరణం చేశారు.

మండుటెండైనా.. జోరువానైనా..
 ఓదార్పు యాత్రలో భాగంగా.. మార్గమధ్యంలో మహానేత అభిమానులు ఏర్పాటు చేసుకున్న 2830 వైయస్ విగ్రహాలను జగన్మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఆ కార్యక్రమాలకు హాజరైన లక్షలాది మంది ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.  మరిన్ని వేల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండే ఎండలోనూ, హోరున కురుస్తున్న వర్షంలోనూ కట్టుకదలకుండా ప్రజలు  జగన్‌కోసం వేచి చూసిన సందర్భాలు ఎన్నో. ఉదాహరణకు ఒక్క కర్నూలు జిల్లా 13వ రోజు ఓదార్పు యాత్రలో ఆయన రోజంతా వర్షంలో తడుస్తూనే.. 13 చోట్ల రోడ్‌షోలు నిర్వహించారు. జనమూ ఆయన కోసం అలా వర్షంలో తడుస్తూనే  జననేతను ఆదరించారు. నెల్లూరు జిల్లా యాత్ర ముగింపు రోజు ఒకవైపు జల్ తుపాను విజృంభిస్తుండగానే ఓదార్పు యాత్ర సాగింది. ముగింపు సభ సమయంలో భారీ వర్షం కురుస్తున్నా.. సుమారు రెండు లక్షల మంది కట్టుకదలకుండా ఆయన ప్రసంగాన్ని వింటూనే ఉండిపోయారు. ఇలా యాత్రలో చాలా రోజులు వర్షాల్లో తడుస్తూనే జగన్‌ను చూడ్డానికి జనం పోటెత్తారు. వారి ఆప్యాయత, అనురాగాలను చూసి జగన్మోహన్­రెడ్డి  చలించిపోయారు. మహానేత మరణించి రెండేళ్లవుతున్నా.. ఆయన్ను గుండెల్లో పెట్టుకుని పూజిస్తున్న జనావళికి పేరు పేరునా కృతజ్ఞతలు చెప్పుకొన్నారు.
 
ఎలాగైనా సరే.. నువ్వు రావాలన్నా..
 ఓదార్పు యాత్ర షెడ్యూలు ప్రకారం సాగిన సందర్భాలు చాలా అరుదు. ఓదార్చాల్సిన కుటుంబాలున్న ఊళ్లలో మాత్రమే జగన్మోహన్­రెడ్డి ఆగేలా.. ఆ మార్గంలోని గ్రామాల్లోనే విగ్రహావిష్కరణలు చేసేలా పార్టీ నేతలు షెడ్యూలు రూపొందిస్తే.. అందులో లేని గ్రామాల ప్రజలు సైతం కాన్వాయ్‌కు అడ్డొచ్చి జననేతను తీసుకెళ్లడం యాత్రలో సర్వసాధారణమై పోయింది. ఒక్కోసారి ఆయన రావాల్సిందేనంటూ ధర్నాలు చేసిన సందర్భాలూ ఉన్నాయి. రాలేనంటే ప్రజలు కన్నీళ్ల పర్యంతమైన రోజులూ ఉన్నాయి. వారి అభిమానం కాదనలేక ఆయా ఊళ్లకు వెళ్లక తప్పలేదు. కృష్ణా జిల్లా ఓదార్పు యాత్రలో అయితే పక్క జిల్లా అయిన ఖమ్మం ప్రజలు ఈ జిల్లాకొచ్చి.. జగన్ రావాల్సిందేనంటూ ధర్నాలకు దిగారు. వారి అభిమానాన్ని కాదనలేక జననేత వెళ్లి.. ఆ ఊరి ఆదరాభిమానాలు అందుకున్నారు. ఇలా కృష్ణా నుంచి రెండుసార్లు ఆయన ఖమ్మం జిల్లాకు వెళ్లొచ్చారు. కృష్ణా జిల్లాలోనే షెడ్యూల్లో లేని సుమారు 70 గ్రామాల ప్రజలు ఆయన్ను పట్టుబట్టి తమ ఊళ్లకు తీసుకెళ్లారు. ఫలితంగా.. తాను వస్తానని చెప్పిన గ్రామాలకు ఆయన వెళ్లడం ఆలస్యమైపోయేది. దీంతో అర్ధరాత్రి దాటినా, తెల్లవారుజామైనా షెడ్యూలు పూర్తి చేయడానికి జగన్మోహన్­రెడ్డి పర్యటిస్తూనే ఉండేవారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇలా షెడ్యూలు రోజూ సమయం తప్పుతూ వచ్చింది.
 
 పేదరికాన్ని దగ్గరగా చూసి..
 ఎండనక, వాననక, రేయనక, పగలనక.. విరామం లేకుండా చేసిన అలుపెరగని ప్రయాణంలో తనకు తెలియని కష్టాలెన్నింటినో జగన్మోహన్‌రెడ్డి చవిచూశారు. తనకు అనుభవంలేని బాధలెన్నింటినో విన్నారు. కొందరి కష్టాలు చూసి చలించిపోయి కళ్లనీళ్లు పెట్టుకున్నారు. తాను ఓదార్చడానికి వెళ్లిన కుటుంబాలతోపాటు మార్గమధ్యంలోని లక్షలాది మంది పేదల కష్టాలను జగన్ కళ్లారా చూశారు. పనిచేస్తేగాని పూటగడవని కడుపులను చూసి కదలిపోయారు. ఆయనను చూడ్డానికి పొలాల్లో పనులు వదిలేసి పరుగు పరుగున వచ్చిన కూలీల కోసం కాన్వాయ్‌ను ఆపి.. వారితో మాట్లాడి వారి కష్టాలు తెలుసుకున్నారు.
చదవలేక  పొలం పనికి..! ....Emperor of Corruption YS Rajashekar Reddy YS Rajashekar Reddy Central Assistance to AP
Prajalachentha Epaper Youtube
Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com