Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             చంద్రబాబు దళిత వ్యతిరేక పాలనః వైవీ సుబ్బారెడ్డి                               మహిళలపై పోలీసుల అరాచకం..దళితులపై దాడి సిగ్గుచేటుః వైవీ సుబ్బారెడ్డి                               బాబు పాలనలో దళితులపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయిః వైవీ సుబ్బారెడ్డి                               ప్రజలారా బాబు మోసపూరిత మాటలు నమ్మవద్దుః బొత్స                               వైయస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన నంద్యాల మాజీ ఎమ్మెల్యే సంజీవరెడ్డి                               దేవరపల్లి ఘటనపై కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్, ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కఠారియాకు ఫిర్యాదు చేసిన ఎంపీ వైవీ                               బాబు తన రాజకీయ స్వార్థం కోసం దళితులపై దాడులు చేయిస్తున్నాడుః బత్తుల                               చంద్రబాబు తన పాలనలో కులవివక్షను పెంచిపోషిస్తున్నాడుః బత్తుల                               రాష్ట్రపతి ఎన్నికల్లో రామ్ నాథ్ కోవింద్ ఘన విజయం..వైయస్ జగన్ హర్షం                 

పార్టీ స్పీక్
అడుగుజాడలు

Share

డాక్టర్ యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి Foot Printsఅన్ని వర్గాల ప్రజల మనసుల్లో చెరగని ముద్రవేసిన జన నేత. ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తొలిరోజు నుంచీ పేదల కోసమే అహరహం శ్రమించిన నాయకుడాయన. ఆయన రూపొందించిన సంక్షేమ పథకాలన్నీ ‘ప్రజా ప్రస్థానం’లో తాను చూసిన పేదల కడగండ్లను తొలగించడం కోసం ఉద్దేశించినవే. సంస్కరణలతో సంక్షేమాన్ని జోడించడంలో వైయస్‌ది ప్రత్యేకమైన శైలి. విప్లవాత్మకమైన రీతిలో ఇటు అభివృద్ధి పథకాలను, అటు సంక్షేమ కార్యక్రమాలను స్వయంగా రూపుకల్పన చేసిన దార్శనికుడు. ప్రకటించిన పథకాలను సాహసోపేతంగా అమలు చేయడం ద్వారా.. మాట తప్పని, మడమ తిప్పని మహానేతగా.. రైతులు, నిరుపేదలకు ఆయన ఆరాధ్యుడయ్యారు.

తొలిసారి ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేస్తూనే వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ఫైలుపై సంతకం చేసి.. సాగు భారమై అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతన్నల ఆశలకు కొత్త ఊపిరులూదారు. వ్యవసాయ రుణాల మాఫీతో రైతుకు ఉపశమనం కలిగించారు. పారిశ్రామిక, సాఫ్ట్‌వేర్, వ్యాపార రంగాల అభివృద్ధికి దోహదపడడంలో వెనుకబడకుండానే.. నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని చిత్తశుద్ధితో అమలుచేశారు. మరింత భూమిని సాగులోకి తేవడం ద్వారా మెట్ట రైతుల వెతలు తీర్చాలన్న ఉదాత్త లక్ష్యంతో ‘జలయజ్ఞం’ చేపట్టారు. పోలవరం, చేవెళ్ల - ప్రాణహిత వంటి భారీ నీటి పథకాలు ఈ యజ్ఞఫలాలే. పెద్ద జబ్బులొచ్చినా సామాన్యులకు కూడా భయంలేదంటూ ‘ఆరోగ్యశ్రీ’ ద్వారా అభయమిచ్చారు.

ప్రతి మహిళనూ లక్షాధికారిని చేయడానికి పావలా వడ్డీ పథకాన్ని ప్రవేశపెట్టారు. అభయ హస్తం పథకంతో వృద్ధ మహిళలకు ఆసరా అందించారు. పేదలకు లక్షల ఎకరాల భూమిని పంచడమే కాకుండా.. పది లక్షల ఎకరాలను గిరిజనులకు పంచారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చిన ఘనత వైయస్‌ది. జిల్లాకో విశ్వవిద్యాలయం, గ్రామీణ పేద విద్యార్థులకు పెద్ద పీట వేస్తూ ట్రిపుల్ ఐటీలను ప్రారంభించారు.

రాజకీయ ప్రత్యర్థులు సైతం పథకాల విలక్షణతను మెచ్చుకునేలా 108, 104 వంటి పథకాల ద్వారా సామాన్యులకు నిరుపమాన సేవలందించారు వైయస్. తెలుగుదేశం పాలనలో అభివృద్ధి కుంటుపడిన సంక్షోభ దశలో.. రాజకీయ నాయకులు అతి వేగంగా ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్న కీలక దశలో.. విశ్వసనీయతకు నిలువెత్తు సంతకంగా నిలిచిన మహానేత వైయస్!


Emperor of Corruption YS Rajashekar Reddy YS Rajashekar Reddy Central Assistance to AP
Prajalachentha Epaper Youtube
Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com