Epaper      Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చని ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాంః గౌతంరెడ్డి                               రాష్ట్రంలో కార్మిక వ్యతిరేక పాలన సాగుతోందిః గౌతంరెడ్డి                               భూములు దోచుకోవాలన్న ఏకైక లక్ష్యంతో టీడీపీ పాలన సాగుతోందిః పార్థసారథి                               బాధిత రైతుల పక్షాన పోరాడేందుకే రాజధాని ప్రాంతంలో వైయస్ జగన్ పర్యటనః పార్థసారథి                               వైయస్ జగన్ అమరావతికి వెళ్తుంటే ప్రభుత్వం ఉలిక్కిపడుతోందిః పార్థసారథి                               సీఎం పర్యటనలకు అయిన ఖర్చు ఎంతో ప్రజలకు చెప్పాలిః అంబటి రాంబాబు                               దోచుకున్నది దాచుకోవడానికే చంద్రబాబు విదేశీ పర్యటనలుః అంబటి రాంబాబు                               హెరిటేజ్ పై ఉన్న ప్రేమ బాబుకు రాష్ట్ర రైతాంగంపై లేకపోవడం బాధాకరంః కన్నబాబు                               రైతులను గాలికొదిలేసి చంద్రబాబు తన సొంత పనులు చక్కబెట్టుకుంటున్నాడుః కన్నబాబు                 

పార్టీ స్పీక్
తొలి సమరం

Share

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపిరులూది వరుసగా రెండు సార్లు అధికారంలోకి తెచ్చిన ముఖ్యమంత్రి డాక్టర్ వైస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం అనంతరం దివంగత నేత కుటుంబానికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయి. పార్టీ నుంచి బైటకు పంపేందుకు పొమ్మనలేక పొగపెట్టినట్లుగా కాంగ్రెస్ పెద్దలు వ్యవహరించారు. సంక్షేమరథసారథి  వైఎస్ హఠాన్మరణాన్ని తట్టుకోలేక గుండెపగిలి మరణించిన అశేష అభిమానుల కుటుంబాలకు ఓదార్చేందుకు, తామున్నామని భరోసా కలిగించేందుకు తలపెట్టిన యాత్రను కాంగ్రెస్ నాయకత్వం అడ్డుకుంది. అదే సమయంలో జగన్‌కు మద్దతుగా నిలిచే నాయకులను పార్టీ నుంచి బైటకు పంపించడం, చివరకు ఒక్కటిగా ఉన్న వైఎస్‌ఆర్ కుటుంబాన్నీ చీల్చేందుకు కుట్ర పన్నడంతో  జగన్, విజయమ్మ పదవులకు, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ ఆశయాలు ముందుకు తీసుకుపోవడానికి, ఆయన స్వప్నించిన స్వర్ణయుగాన్ని సాధించడానికి ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’ ఆవిర్భవించింది. కొద్ది రోజులకే కడప పార్లమెంట్ నియోజవర్గానికి, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో బరిలో నిలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చరిత్రాత్మక విజయం నమోదు చేసింది.


Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com