Epaper      Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             శింగనమల సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి మేలుకొలుపు పాదయాత్ర ప్రారంభం                               ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరుబాట                                నారాయణరెడ్డి హత్య కేసుపై సీబీఐ విచారణ జరిపించాలిః వేణుగోపాలకృష్ణ                               ప్రజల మన్ననలు పొందలేక చంద్రబాబు ప్రత్యర్థులను అంతమొందించాలని చూస్తున్నాడుః వేణుగోపాలకృష్ణ                               కరువు నివారణ చర్యలు చేపట్టడంలో బాబు సర్కారు విఫలమైందిః కాకాని గోవర్ధన్ రెడ్డి                               పట్టిసీమ ప్రాజెక్ట్ వల్ల బాబు, లోకేష్ ల గ్రోత్ రేటు పెరిగిందే తప్ప రైతులు, ప్రజల గ్రోత్ రేటు పెరగలేదుః కన్నబాబు                               అవినీతి, హత్యల్లో చంద్రబాబు ఏపీని నంబర్ వన్ చేశాడుః దాడిశెట్టి రాజా                               నష్టాల్లో ఉందని ఆర్టీసీని మూసేస్తారా..? ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తారా బాబుః పద్మ                               ప్రభుత్వ పాఠశాలలను నారాయణ విద్యాసంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందిః వాసిరెడ్డి పద్మ                 

పార్టీ స్పీక్
నివాళి

Share

పిడుగులాంటి ఆ వార్త విని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో హృదయాలు శాశ్వతంగా స్పందన కోల్పోయాయి. ఎనిమిది కోట్ల హృదయాలను కన్నీటి సునామీలు అల్లకల్లోలం చేశాయి. రాష్ట్రాన్ని, దేశాన్ని అత్యంత శక్తిమంతంగా ప్రభావితం చేసేంత ఎత్తుకు ఎదిగి ఆకస్మికంగా నేలకొరిగిన మహానేతకు దేశం నలుదిక్కుల నుంచీ ఎందరెందరో ప్రముఖులు అశ్రు నయనాలతో నివాళులర్పించారు. ఎటుచూసినా ఆర్తనాదాలు.. పేదల పెన్నిధి, బలహీనవర్గాల ఆశాజ్యోతి, రైతు బాంధవుడు, రాష్ట్రాన్ని శరవేగంతో నడిపిస్తున్న రథసారథి ఇక లేడని తెలియగానే బస్తీలు, పల్లెలు కన్నీరు మున్నీరయ్యాయి. ఏ పత్రిక చూసినా పతాక శీర్షికల్లో ఆయన చేసిన అనన్య సామాన్య సేవలను కొనియాడాయి. పేదవారు, వయోవృద్ధులు, మైనారిటీలు, ముఖ్యంగా రైతులు ఒక్కరేమిటి రాష్ట్రంలో అన్ని వర్గాలకు వైయస్­ చేసిన అనితర సాధ్యమైన సేవలను వేనోళ్ల పొగిడాయి. రాష్ట్రంలోనే కాక దేశంలోని అన్ని పత్రికలు ఆయనపై సంపాదకీయాలు రాశాయి. ప్రముఖ జర్నలిస్టులు, కవులు, నాయకులు.. ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలను, అమలుచేసిన పథకాలను విశ్లేషిస్తూ వ్యాసాలు, కవితలు రాశారు. వైయస్‌ఆర్ అమర్ రహే అంటూ జోహారులర్పించారు. ఆయన ధైర్యం, సాహసం, తెగువ మరెవరిలోనూ కానరావు. మడమ తిప్పని, మాట తప్పని వ్యక్తిగా ఆయనకు ఆయనే సాటి. రాజకీయాల్లో వైయస్సార్‌ను పూర్తిగా వ్యతిరేకించిన వారు కూడా.. పార్టీలకు అతీతంగా ఆయన లేని లోటు తీర్చలేనిదని, దేశం ఒక గొప్ప నాయకుడ్ని కోల్పోయిందని నివాళులర్పించారు. రాష్ట్రపతి ప్రతిభాపాటిల్, ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోమోహన్ సింగ్, యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ, సీపీఎం, సీపీఐ, తెలుగుదేశం, ప్రజారాజ్యం ఇంకా అనేక పార్టీల నాయకులు, సినీ రంగ ప్రముఖులు వైయస్‌ఆర్‌కు జోహారులర్పించారు. మహానేతకు జన్మనిచ్చిన కడప జిల్లా పేరును ‘డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కడప జిల్లా’గా రాష్ట్ర ప్రభుత్వం నామకరణం చేసింది.

 


Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com