Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ పార్లమెంట్ వద్ద వైయ‌స్ఆర్‌ సీపీ ఎంపీలు ధర్నా                               క్రిష్ణాపురం నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 320వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               ప్రజలకు ఎన్ని అబద్దాల చెప్పినా వింటారనే నాయకులకు తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారు : వైయ‌స్ జ‌గ‌న్‌                               లగడపాటి రాజకీయ విశ్లేషకుడు ఎప్పుడు అయ్యాడా? అని ఆశ్చర్యం వేసింది: వైయ‌స్ జ‌గ‌న్‌                               కాంగ్రెస్‌, టీడీపీ జిమ్మిక్కులను ప్రజలను తిప్పికొట్టారు: వైయ‌స్ జ‌గ‌న్‌                               చంద్రబాబు, కాంగ్రెస్ అనైతిక పొత్తుకు ప్రజలు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు: వైయ‌స్ జ‌గ‌న్                                భస్మాసురుడు చేయి పెట్టినా.. చంద్రబాబు కాలు పెట్టినా అంతా బుడిదే: వైయ‌స్ జ‌గ‌న్‌                               హిందూపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ గని వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               ప‌వ‌న్‌కు చిత్త‌శుద్ది ఉంటే చంద్ర‌బాబు అవినీతిపై నిల‌దీయాలి: ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌                 

దీక్షలు

Share


దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్‌రెడ్డి సంక్షేమ పాలనలో ఓ కొత్త ఒరవడిని సృష్టించారు. పేదలను దృష్టిలో ఉంచుకొని అనేక ప్రజోపయోగ పథకాలు ప్రవేశపెట్టారు. పాలనను ప్రజలకు చేరువ చేశారు. ఆయన అకాల మరణంతో రాష్ర్టంలో పాలన గాడి తప్పింది. పథకాలు వెనకపట్టుపట్టాయి. కొన్ని ఆగిపోయాయి. అపరభగీరథుడు వైయస్ తలపెట్టిన ‘జలయజ్ఞం’ నిధులు లేవని నిలిపివేశారు. ప్రతి పేదవాడికి కోరుకున్న ఉన్నత విద్య దక్కాలని వైయస్ ప్రవేశపెట్టిన ‘ఫీజు రీయింబర్స్‌మెంట్’ పథకానికి పభుత్వం నిధులు తగ్గిస్తూ వస్తున్నది. దీంతో రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌కు దక్కాల్సిన న్యాయమైన వాటాను ఎగువ రాష్ట్రాలు ఇవ్వకుండా కృష్ణా జలాలను దోచుకుంటున్నా అడిగేవారు లేరు. వరుస వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునే నాథుడు లేకపోవడంతో వ్యవసాయరంగంలో మరలా ఆత్మహత్యలు మొదలయ్యాయి. రైతులకు పంట నష్టపరిహారం అందలేదు. ధాన్యానికి మద్దతు ధర పెంచాలన్న రైతుల డిమాండ్‌ను కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు పట్టించుకోలేదు. మార్కెట్లు దళారుల ఇష్టారాజ్యంగా మారాయి. బ్యాంకు రుణాలు గగనమయ్యాయి. ప్రైవేటు వడ్డీలు తడిసి మోపెడయ్యాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ఇక వ్యవసాయం చేయడం అసాధ్యమని రైతులు పొలాలను బీడుపెట్టే పరిస్థితి వచ్చింది. నిత్యావసర సరుకుల ధరలు నింగిని అంటుతుండడంతో భారం మోయలేక సామాన్య ప్రజలు విలవిల్లాడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, నిష్క్రియాపరత్వాన్ని ప్రశ్నించే బాధ్యతను ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ఎన్నడో వదిలేసింది. అందుకే ఆ బాధ్యతను జగన్మోహన్‌రెడ్డి తీసుకున్నారు. ప్రజల పక్షాన నిలబడి పోరుబాట పట్టారు. ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజాగళాన్నివినిపించడం ప్రారంభించారు.

ఓ వైపు ఇచ్చిన మాట కోసం తన తండ్రి మరణాన్నితట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను ఓదార్చుతూనే మరోవైపు అనేక సందర్భాలలో దీక్షలు నిర్వహిస్తూ ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజా సమస్యలపై అనతి కాలంలోనే అనేక దీక్షలు నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి దీక్షాదక్షుడు. బాధ్యత తెలిసిన నాయకుడు. అందుకే ప్రజలు ఆయనలో దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డిని చూసుకుంటున్నారు.

 

 

 

 

 


Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com