Epaper      Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             చంద్రబాబు ఇచ్చిన వాగ్ధానం నెరవేర్చకపోతే నిరుద్యోగులతో కలిసి ప్రత్యక్ష కార్యాచరణ చేపడుతాంః వైయస్ జగన్                               నిరుద్యోగులకు నెలనెల రూ.2వేల భృతి ఇచ్చేలా ప్రకటన చేయాలిః వైయస్ జగన్                               నిరుద్యోగులకు చెల్లించాల్సిన మొత్తాన్ని 2017-18 బడ్జెట్ లో కేటాయించాలిః లేఖలో వైయస్ జగన్                               కోటి 75లక్షల ఇళ్లకు రూ.2వేల మేరకు బాకీ పడిన రూ.లక్షా 15వేల కోట్లను చెల్లించాలిః లేఖలో వైయస్ జగన్                               33 నెలల కాలంలో నిరుద్యోగులకు ఇంటింటికీ బకాయి పడిన రూ.66వేలు చెల్లించాలిః లేఖలో వైయస్ జగన్                               చంద్రబాబుకు వైయస్ జగన్ బహిరంగ లేఖ                               పోలీస్ వ్యవస్థ బాబుకు బానిసలుగా, టీడీపీ బౌన్సర్ లా పనిచేయడం దారుణంః రోజా                               బాబు రావణాసుర పాలనపై మహిళలంతా తిరగబడాలిః రోజా                               మహిళలకు జరుగుతున్న అన్యాయంపై న్యాయపోరాటం చేస్తాంః రోజా                 

పార్టీ స్పీక్
అజెండా

Share

ప్రజా సంక్షేమమే వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం. సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్దిష్టమైన కార్యక్రమాన్ని ఎంచుకుని సాగుతోంది.  పార్టీ లక్ష్యం... ఎజెండా... ప్రణాళిక... కార్యక్రమం... అన్నీ ఒకటే. వైయస్‌ఆర్ చూపిన సంక్షేమ బాటలో పయనించడం, సంక్షేమ పథకాలు లక్ష్యిత వర్గాలకు చేరేలా చూడడం పార్టీ ప్రధాన లక్ష్యం...

వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకకు మూలమే సామాజికంగా అణగారిన అన్ని వర్గాల సంక్షేమం. సమాజంలో తరతరాలుగా అనేక కారణాల వల్ల తీవ్రమైన అన్యాయాలకు గురైన సామాజిక వర్గాలు సమాజంలో సగౌరవంగా  నిలబడే ప్రయత్నాలన్నింటినీ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తానే ముందుండి నడిపిస్తుంది. అలాంటి ప్రయత్నాలకు సంపూర్ణంగా సహకరిస్తుంది. షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తరగతులు, వెనకబడిన వర్గాలు, మైనారిటీలు, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు ప్రభుత్వం నుంచి గరిష్ఠ స్థాయిలో సహకారం అందాలన్న మహానేత వైయస్ విధానాన్ని తు.చ. తప్పకుండా అధికారంలో ఉన్నవారు పాటించి తీరాలన్నదే వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం. అధికారంలోను, ఉద్యోగ ఉపాధి అవకాశాల పరంగా, ఆర్థిక సంపదల్లో వాటా పరంగా ఈ వర్గాలన్నింటికీ సమన్యాయం జరిగేలా ప్రభుత్వం వేసే ప్రతి అడుగూ ఉండాలని వైయస్‌ఆర్ ఆచరించి చూపిన ఆశయాల సాక్షిగా పార్టీ తన వజ్ర సంకల్పాన్ని చాటుతోంది.

బీసీ సంక్షేమం:

రాష్ట్ర జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీల సంక్షేమాన్ని వైయస్‌ఆర్ కాంగ్రెస్... నినాదంగా కాకుండా విధానంగా మార్చుకుంది. అధికారంలో బీసీలకు అందాల్సిన న్యాయమైన వాటాను ఇవ్వాలన్న మనసు ఉండాలేగానీ మార్గం ఉంటుందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ విశ్వసిస్తోంది. కాబట్టే రాజ్యాంగ సవరణ, న్యాయపరమైన చిక్కులను సాకుగా చూపి స్థానిక సంస్థల్లో బీసీలకు అన్యాయం చేయాలన్న తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల సంప్రదాయ కుట్రలను ఛేదించి, పార్టీలే అభ్యర్థులను నిలిపేటప్పుడు జనాభాలో బీసీల నిష్పత్తిని గౌరవించాలనే ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చింది. వైయస్ 2006 పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం, ఎస్సీలకు 18.30 శాతం, ఎస్టీలకు 8.25 శాతం రిజర్వేషన్లు కల్పించి ధైర్యంగా ఎన్నికలు నిర్వహించిన విషయాన్ని పార్టీ గుర్తుచేస్తోంది. ఆ తరవాత సుప్రీం కోర్టు కర్ణాటకకు సంబంధించి ఇచ్చిన తీర్పు నేపథ్యంలో.. మన రాష్ట్రంలో బీసీల జనాభా రీత్యా వారికి అన్యాయం జరగకుండా ఏ చర్యలూ తీసుకొనకపోవటం వల్లే నేడు స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వమే వాయిదా వేయించాల్సిన దుస్థితి ఏర్పడింది. బీసీలు మావెంటే ఉన్నారంటూ ప్రచారం చేసుకునే తెలుగుదేశం పార్టీ కూడా ఈ విషయంలో మౌనం వహించి చోద్యం చూస్తోంది. మొత్తంగా రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదంటే బీసీలకు 23.45 శాతం మాత్రమే వాటా దక్కుతుంది. అలా కాకుండా, 34 శాతం ప్రాతిపదికగా బీసీలకు రిజర్వు చేసిన స్థానాల్లో అన్ని పార్టీలు బీసీ అభ్యర్థులనే నిలబెట్టాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు పెడార్థాలు తీయటం తప్ప.. అటు తెలుగుదేశం కానీ, ఇటు కాంగ్రెస్‌పార్టీ కానీ చేసింది శూన్యం. దీన్ని బట్టే ఈ పార్టీలకు బీసీలంటే ఎంత చులకనో అర్థమవుతోంది. మహానేత వైయస్ మరణానంతరం  కాంగ్రెస్ ప్రభుత్వం  బీసీలను చిన్నచూపుచూస్తున్న విషయాన్ని అనేక అంశాలు స్పష్టం చేస్తున్నాయి.

చంద్రబాబు హయాం నుంచి 2008 వరకూ బీసీ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రూ.378 కోట్ల రుణాలను మాఫీ చేయటం ద్వారా 13.20 లక్షల మందికి వైయస్­ ఊరట కల్పించారు. అదే సంవత్సరంలో బీసీ కార్పొరేషన్‌కు సమృద్ధిగా నిధులు విడుదల చేసి 16,000 యూనిట్లకు రుణాలు అందేలా చొరవ తీసుకున్నారు. 2009-10, 2010-2011 నుంచి బీసీ కార్పొరేషన్‌కు నిధుల విడుదల అడుగంటసాగింది. బడ్జెట్లో చూపించిన అత్తెసరు నిధులను విడుదల చేయటానికి కూడా ప్రభుత్వానికి మనసు రాలేదు. ఈ రెండేళ్లలోనూ బీసీ కార్పొరేషన్‌కు కేటాయింపులు రూ.10 కోట్లకు పరిమితం కావటంతో రుణం పొందిన యూనిట్ల

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com