Epaper      Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             చంద్రబాబు దావోస్ పర్యటన శుద్ధ దండగః బొత్స సత్యనారాయణ                               చంద్రబాబుతో రాష్ట్రానికి పట్టిన అరిష్టం పోవాలని రాజధాని రోడ్లపై గో పంచకంతో శుద్ధి కార్యక్రమం                               రాజధానిలో వైయస్సార్సీపీ నేతలు, రైతుల వినూత్న నిరసన                               వైయస్ జగన్ కు వస్తున్న జనప్రవాహాన్ని ఆపలేరు..బాబు దిగిపోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయిః వెల్లంపల్లి                               ప్రజలు వైయస్ జగన్ నాయకత్వం కావాలని కోరుకుంటున్నారుః జోగి రమేష్                                చంద్రబాబు, మంత్రులు చౌకబారు రాజకీయాలు మానుకోవాలిః జోగి రమేష్                                వైయస్ జగన్ రాజధాని పర్యటనతో చంద్రబాబుకు గుండెదడః జోగి రమేష్                                వైయస్ఆర్ వెలిగొండ ప్రాజెక్ట్ కు రూ.4700కోట్లు ఖర్చు చేస్తే..బాబు ఇవాళ దాన్ని గాలికొదిలేశారుః వైయస్ జగన్                               దారుణంగా ఫ్లోరైడ్‌ శాతం పెరిగితే ప్రభుత్వం ఏం చేస్తోందిః వైయస్ జగన్                 
కొత్త పార్టీ అందుకే

Share

Why YSR Congressరాజకీయ అనిశ్చితిలో రాష్ట్రం కొట్టుమిట్టాడుతున్న వేళలో వేకువ వెలుగులా వచ్చింది వైయస్ఆర్ కాంగ్రెస్.

నిర్లక్ష్యం, అవహేళన కొరివి దయ్యాల్లా రాష్ట్ర ప్రగతిని పట్టిపీడిస్తున్న వేళ భయం లేదంటూ బాసటగా ముందుకొచ్చింది వైయస్ఆర్ కాంగ్రెస్.

ప్రజల ఆకాంక్షలు, జనఘోషలు మరచి ఢిల్లీ రిమోట్ కంట్రోల్.. రాష్ట్ర రాజకీయాలను తోలుబొమ్మలాటగా, కీలుబొమ్మలాటగా మార్చేసిన సైద్ధాంతిక దగుల్బాజీతనానికి సవాలుగా వచ్చింది వైయస్ఆర్ కాంగ్రెస్.

మహోన్నత నేత వైయస్ రాజశేఖరరెడ్డి మరణంతో రాష్ట్రంలో ఒక తీరని లోటు, పూడ్చలేని ఓ అగాథం ఏర్పడింది. వైయస్ఆర్ నేతృత్వానికి, ధీతత్వానికి సరిసాటి అయిన నాయకుడు లేకపోవడంతో ఆ శూన్యం మహాశూన్యమై భయపెట్టసాగింది. ఇంతలో కుళ్లు ఢిల్లీ.. కుట్రల పర్వానికి తెరతీసింది. దర్బారు దౌష్ట్యం తోడు కాగా, మట్టిగుట్టల్లాంటి మరగుజ్జులు, మేరుశిఖరం లాంటి వైయస్ఆర్­కు మసిపూసి మసకబార్చే ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయన అందించిన అభివృద్ధి సంక్షేమ ఫలాలు పేదలకు దక్కకుండా చేశారు.

ఏకంగా వైయస్ఆర్ కుటుంబంపైనే నిషేధాలు, ఆంక్షల నీచ కుట్రలు మొదలయ్యాయి.

తెలుగు ఆత్మగౌరవపు తల్లివేరుపై గొడ్డలివేటు పడింది. వైయస్ఆర్ సేవలను, ఆయన సంక్షేమ పథకాలను మసకబార్చే కుట్రలు.. జడలు విరబోసుకున్నాయి. ఒక పద్ధతి ప్రకారం ఆయన పథకాలు ఒక్కొక్కటిగా నీరుగారేలా చేయడం మొదలైంది. ఇవన్నీ చివరికి వైయస్ జగన్మోమోహన్ రెడ్డి, కాంగ్రెస్ ను వదిలిపెట్టేలా చేశాయి. కల్లలవుతున్న వైయస్ఆర్ కలల్ని నిజం చేసి, ఇప్పటి చిత్తడి శకం నుంచి వైయస్ఆర్ పుత్తడి యుగంలోకి రాష్ట్రాన్ని మళ్లీ నడిపించేందుకు వైయస్ జగన్మోమోహన్ రెడ్డి "వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ "ని స్థాపించారు.

ఇదీ.. 2011 మార్చి 11న తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో జనం సాక్షిగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ ప్రకటన నేపథ్యం. ఆ వెనువెంటనే కడప లోక్ ­సభ స్థానం, పులివెందుల అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు అందించిన ఘన విజయం.. రాష్ట్ర రాజకీయాల్లో ప్రజల ఆకాంక్షలకు పట్టం కట్టే కొత్త శక్తి ఆవిర్భవించిందని ఢంకా బజాయించింది.

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వై.. యువజనానికి, ఎస్.. శ్రామికవర్గానికి, ఆర్.. రైతులకీ ప్రతీక. అందుకే వైయస్ఆర్ కాంగ్రెస్ అంటే యువజన, రైతాంగ, శ్రామిక పార్టీ. ఇది రైతులు, మహిళలు, విద్యార్థులు, నేతన్నలు, అణగారిన అన్ని వర్గాల అభ్యున్నతి కోసం బరువు తలకెత్తుకున్న బాధ్యతాయుత మహోద్యమం.

 


Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com