Epaper      Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైయస్ వివేకానందరెడ్డి నామినేషన్ దాఖలు                               రైతుల విప్లవంలో చంద్రబాబు కొట్టుకుపోతారుః బత్తుల బ్రహ్మానందరెడ్డి                               చంద్రబాబుకు కౌంట్ డౌన్ మొదలైందిః వెల్లంపల్లి శ్రీనివాస్                                చంద్రబాబు ఇచ్చిన వాగ్ధానం నెరవేర్చకపోతే నిరుద్యోగులతో కలిసి ప్రత్యక్ష కార్యాచరణ చేపడుతాంః వైయస్ జగన్                               నిరుద్యోగులకు నెలనెల రూ.2వేల భృతి ఇచ్చేలా ప్రకటన చేయాలిః వైయస్ జగన్                               నిరుద్యోగులకు చెల్లించాల్సిన మొత్తాన్ని 2017-18 బడ్జెట్ లో కేటాయించాలిః లేఖలో వైయస్ జగన్                               కోటి 75లక్షల ఇళ్లకు రూ.2వేల మేరకు బాకీ పడిన రూ.లక్షా 15వేల కోట్లను చెల్లించాలిః లేఖలో వైయస్ జగన్                               33 నెలల కాలంలో నిరుద్యోగులకు ఇంటింటికీ బకాయి పడిన రూ.66వేలు చెల్లించాలిః లేఖలో వైయస్ జగన్                               చంద్రబాబుకు వైయస్ జగన్ బహిరంగ లేఖ                 

పార్టీ స్పీక్
మహోన్నత వ్యక్తిత్వం

Share

మున్నత వ్యక్తిత్వం, చెరగని చిరునవ్వు, చెదరని దృఢనిశ్చయం, పదహారణాల తెలుగుదనం.... కలబోసి విరబూసిన విలక్షణ వ్యక్తిత్వమే ఎడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి. వామనుడి మూడు పాదాలంత విస్తృత వ్యక్తిత్వానికి వైయస్ఆర్ అనే మూడంటే మూడు పొడి అక్షరాలు కొండను అద్దంలో కొంచెంగా చూపించే ప్రతీకలు. ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారు. పోయారు. కానీ దేశ రాజకీయ పటంపై హిమశిఖర సదృశంగా సమున్నతమైన వ్యక్తిగా భాసిల్లిన మహా వ్యక్తిత్వం వైయస్ఆర్­ది. ఆయన పాదయాత్ర నేరుగా ప్రజల హృదయాల్లోకి సాగింది. జనఘోషే ఆయన హృదయఘోషగా మారింది. వారి కన్నీళ్లు, కష్టాలను కళ్లారా చూసిన వైయస్­ఆర్­.. వారి సంక్షేమాన్నే తన ఎన్నికల జెండాగా, ఎజెండాగా మార్చుకున్నారు. 2004లో అధికారంలోకి రాగానే ఆ ఎజెండానే అక్షరాలా అమలు చేశారు. తెలుగుదనం తొణికిసలాడే ఆ మేరునగ ధీరుడిలో రైతులు ఒక రక్షకుడిని చూశారు. కార్మికులు కష్టాల్లో తోడుగా నిలిచేవాడిని చూశారు. బడుగులు ఒక బాంధవుడిని చూశారు. అణగారినవారు ఆప్తమిత్రుని చూశారు. ఇన్నేళ్లుగా అవహేళన తప్ప మరొకటి దక్కని వారికి అభివృద్ధి దోసిళ్ల కొద్దీ అందింది. ఆయన సంక్షేమ పథకాలు.. రైతులు, విద్యార్థులు, నేతన్నలు, మహిళలు, దళితులకు ఆశాకిరణాలయ్యాయి. ఆరోగ్యశ్రీ, వృద్ధాప్య పింఛన్లు, గృహ నిర్మాణ పథకాలు, తదితర సంక్షేమ పథకాలు వివిధ వర్గాలకు "ఆకలికి అన్నమూ, వేదనకు ఔషధమూ" అయ్యాయి. జలయజ్ఞ ఫలంగా పారి ప్రవహించిన జలధారలు పల్లెటూళ్లలో పాలధారలై, పంచదారలై పరవళ్లు తొక్కాయి. పల్లెసీమ పాడిపంటల స్వర్గసీమగా విలసిల్లింది. రేట్ల చెరలో బందీ అయిన ఉన్నత విద్యను, కార్పొరేట్ల చెరలో ఖైదీగా మిగిలిన ఉత్తమ వైద్య చికిత్సను పేదోడి ముంగిట తెచ్చి నిలబెట్టింది వైయస్­ఆర్­ పాలన.


Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com