Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ఈవీఎంలకు ట్యాంపరింగ్‌ చేయడం బాబుకు బాగా తెలుసు: ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి                               వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన తుపాను బాధితులు                               చ‌ల్ల‌వానిపేట నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 324వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               వ‌ర‌ల్డ్ టూర్ ఫైన‌ల్స్ టైటిల్ గెలిచిన భార‌తీయ ఫ్లేయ‌ర్‌గా చ‌రిత్ర సృష్టించిన పీవీ సింధుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అభినంద‌న‌లు                                అమరజీవికి జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌ ఘ‌న‌ నివాళి                               టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో అన్ని అంశాల్లో రాజీపడింది చంద్రబాబే: బొత్స సత్యనారాయణ                               రాష్ట్రాన్ని చంద్రబాబు ఎంత భ్రష్టుపట్టించారో, కేసీఆర్ అంత నష్టపరిచారు: బొత్స స‌త్య‌నారాయ‌ణ‌                               ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ పార్లమెంట్ వద్ద వైయ‌స్ఆర్‌ సీపీ ఎంపీలు ధర్నా                               ప్రజలకు ఎన్ని అబద్దాల చెప్పినా వింటారనే నాయకులకు తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారు : వైయ‌స్ జ‌గ‌న్‌                 

అడుగు వేయండి...జగన్ వెంట

Share


'ఎలా బతికామన్నదే ఆయనకు ముఖ్యం... ఎంతకాలం బతికామన్నది కాదు'.
నల్లకాలువ సభలో చేసిన వాగ్దానం.. నిత్య 'ఓదార్పు' పథగామిని చేసింది.
తండ్రిలా ‘పేదల కోసం బతకాలి... ప్రజల విశ్వాసాన్ని పొందాలి’అనే ఆకాంక్ష ఆయన్ను దీక్షాదక్షుడిగా మార్చింది.
మూడు పదుల వయసులో తాతలనాటి తరగని ఆస్తులతో కులాసాగా గడపాల్సిన ఆ యువకుడు, ఎండనకా.. వాననకా పేదల కోసం పరితపిస్తున్నాడు.
ఆ యువకుడెవరో కాదు మన జగన్మోహన్ రెడ్డి...
కుట్రలు, కుతంత్రాలతో పార్టీ నుంచి కాంగ్రెస్‌ పెద్దలు బయటకు పంపిన నాటి నుంచి నేటి వరకూ ఆయన జనం కోసం, జనం మధ్యే బతకడం తన జీవితంగా మార్చుకున్నాడు. రోజూ యాత్రే... నిత్యం ప్రజాదీక్షల నడుమ నిరాహారాన్నే ఆహారంగా మార్చుకున్నాడు.

పాలకపక్ష, ప్రధాన ప్రతిపక్ష కుమ్మక్కు కుట్రలను మొక్కవోని తెగువతో ఎదుర్కొంటూ, ఎన్ని చిక్కులు ఎదురైనా నిబ్బరంగా నిలచినవాడు. 

ప్రభుత్వమంటే ఫక్తు వ్యాపారం కాదనీ, ట్రిక్కుల హెటెక్కులు ఎంతమాత్రం కావనీ, ముఖ్యమంత్రి ఎన్నడూ సీఈఓలా వ్యవహరించకూడదనీ,  ప్రతిదీ ప్రజాపరం కావడమే రాజకీయాలకు పరమార్థమనీ తండ్రి వలెనే నమ్మిన యువనేత అతడు...  

ఎల్‌కెజీ నుంచి పీజీ దాకా ఉచితవిద్యనందించే ‘వైఎస్సార్ అమ్మఒడి’ పధకం నుంచి రైతన్నల పంటకు గిట్టుబాటు ధర అందించే స్థిరీకరణ నిధి ఏర్పాటు వరకూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ యువనేత ప్రజాసంక్షేమ ఆకాంక్షకు తార్కాణాలు. జనమానసమెరిగిన నిఖార్సైన మానవతాస్ఫూర్తికి గీటురాళ్లు...

వైరివర్గాలు ఒక్కుమ్మడిగా అనైతికమైన రీతిలో వ్యక్తిత్వహననానికి సైతం తెగబడినా, తండ్రి అడుగుజాడలలో బడుగు బలహీన వర్గాల కోసం మొదలుపెట్టిన తన గమనాన్ని ఇసుమంతైనా మార్చుకోనివాడు...కష్టాలూ కడగండ్లూ చుట్టుముట్టినా చలించని మేరునగధీరుడు.
వైయస్ కలలుగన్న ‘పేదవాడి మోముపై చిరు నవ్వు’  నిలిపేవరకూ...'రాజన్నరాజ్య'స్థాపన లక్ష్యాన్ని సాధించే వరకూ సాగుతూనే ఉంటుంది ఈ పయనం. ఎత్తులతో జిత్తులతో నడిచే కరకు రాజకీయాలకు మానవీయస్పర్శను అందించదలచిన మడమతిప్పని ఈ దీక్షాదక్షుడి అడుగులు జనసామాన్యం కోసం...
ఈ సంక్షేమరాజ్య స్వాప్నికుని ప్రస్థానం ప్రజాహితం కోసం...
రాజశేఖర్ రెడ్డిగారి 'సువర్ణయుగా'న్ని మళ్లీ అందిస్తానన్న వైయస్. జగన్మోహన్ రెడ్డి మహాసంకల్పం- అనునిత్యం శతకోటి సమస్యలతో సతమతమౌతున్న జనత కోసం..


Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com