Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             గుంటూరు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు మల్లాది శివన్నారాయణ, చిలకలూరిపేట టీడీపీ మాజీ అధ్యక్షుడు శివయ్య, జి.వెంకట్రావు, కె.కాంతారావులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               దేశంలో, రాష్ట్రంలో ఇలాంటి అబద్ధపు ముఖ్యమంత్రి ఎక్కడా లేరని, గల్ఫ్‌ దేశాల్లో ఇలాంటి అబద్ధాల ముఖ్యమంత్రిని ఎప్పుడో ఉరి తీసేవారు: ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి                               ఇందిర‌మ్మ కాల‌నీ నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 289వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               చంద్రబాబు..నీకిదే ముఖ్యమంత్రిగా చివరి అవకాశం...నిన్ను దగ్గరగా గమనించిన మనిషిగా చెబుతున్నా: త‌మ్మినేని సీతారాం                               శ్రీకాకుళం ఉద్యమాల పురిటిగడ్డ...ఎంతమందిపై కేసులు పెడతావ్. : త‌మ్మినేని సీతారాం                               నీళ్లో రామచంద్ర అని అడుగుతున్నవారికి వారి దాహార్తి తీరుస్తారే కాని వారిని సైతం బుల్డోజర్‌ తో తొక్కిస్తా అని అనగల ధైర్యం చంద్రబాబుకే ఉంది: భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి                               వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన మ‌ధువాడ అన్న‌దాత‌లు                               టీడీపీ తోక పత్రికలో 108 దుస్థితిపై వచ్చిన కథనాలను ఏమంటారు.. అది నిజం కాకపోతే ఆ వార్తలను ఎందుకు ఖండించలేదు: సుధాక‌ర్‌బాబు                               - విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని ఆనంద‌పురం క్రాస్ వ‌ద్ద 3100 కిలోమీట‌ర్ల వ‌ద్ద వేప మొక్క‌ను నాటిన వైయ‌స్ జ‌గ‌న్‌                 

పసిడి కాంతుల తెలుగు నేల కోసం

Share

డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణంతో రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయింది. ఆయనప్రారంభించిన సంక్షేమపథకాలు ఒక్కొక్కటిగా తుది ఊపిరులు వదిలేయడం ప్రారంభించాయి.

పెద్ద వైద్యాన్ని పేదోడి ముంగిట్లోకి తెచ్చినందుకు గాను దేశంలో, దేశదేశాల్లో ప్రశంసలు పొందిన ఆరోగ్యశ్రీ ఆవిరైపోవడం మొదలైంది. కార్పొరేట్ల కట్టడిలో, ఖరీదు ఫీజుల ముట్టడిలో ఉన్న ఉన్నత విద్యను సామాన్యుడి సమక్షాన నిలబెట్టిన ఫీజు రీఇంబర్స్ మెంట్ కొన ఊపిరితో కొట్టుమిట్టాడటం మొదలైంది. మహిళా స్వయంసహాయతా బృందాలకు పట్టం కట్టిన పావలా వడ్డీ నిర్లక్ష్యపు పాదాల కింద నలిగిపోవడం మొదలైంది. నేలకు జలకళ పంచిన భగీరథ యత్నం జలయజ్ఞపు హోమాగ్ని జ్వాలలపై నివురు కప్పేసింది. నీరసం కమ్మేసింది. ఇక వైఎస్ ఆర్ హయాంలో పండుగలా మారిన వ్యవసాయం మళ్లీ నష్టాల "వ్యయ"సాయం అయిపోయింది. కనీస మద్దతు ధర కనీసం కనిపించనైనా కనిపించకుండా పోయింది. వ్యవసాయ ఋణ సదుపాయం, సబ్సిడీల సపోర్టు మాయమైపోయాయి. ఒక్క వైఎస్ఆర్ లేకపోవడంతో రాష్ట్రం దిక్కులేనిదైంది. ప్రజ రెక్క తెగినదైంది. నలుదిక్కులా  నల్లమేఘంలా నిరాశ కమ్ముకుపోయింది.

ఈ కారుచీకటిలోనే కాంతిరేఖల్లా వచ్చారు వైఎస్ జగన్, ఆయన స్థాపించిన వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ. సమయం సవాళ్లు విసిరినప్పుడే సమర్థుడు పిడికిలి బిగిస్తాడు. జగన్ కూడా అలాగే ముందుకొచ్చారు. ప్రజల్లో కునారిల్లిన విశ్వాసాన్ని, నలిగిపోయిన నమ్మకాన్ని, విరిగిపోయిన ఆశలను మళ్లీ చిగురింపచేయడమే తన కర్తవ్యంగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది.

వైఎస్ఆర్ స్వర్ణయుగాన్ని మళ్లీ తేవడమే లక్ష్యంగా జగన్ రాష్ట్రం నలుమూలలా పర్యటనలు ప్రారంభించారు. ప్రజల్లో నమ్మకంనింపేందుకు ఆయన కదిలారు. విషాద వదనాలకు చిరునవ్వులు అద్దారు. విషణ్ణ హృదయాలకు విశ్వాసం దిద్దారు. నమ్మకం కోల్పోయిన వారికి నమ్మకాన్నిచ్చారు. భరోసా కోల్పోయిన వారికి బాసటగా నలిచారు. జలయజ్ఞం ఆగదన్న విశ్వాసం రైతులకిచ్చారు. ఫీజు రీఇంబర్స్ మెంట్ ఆగదన్న నమ్మకం బీసీ విద్యార్థిలోకానికి ఇచ్చారు. వ్యాధుల బాధల్లో ఉన్న వారిలో 108, 104 వాహనాల కూత ఆగదన్న భరోసా ఇచ్చారు. బతుకుకు ఊపిరులూది, ఆరోగ్య మంత్రాన్నిచ్చే ఆరోగ్యశ్రీకి గ్రహణం పట్టనీయబోనని ధైర్యాన్నిచ్చారు.

నిజానికి పార్టీ తొలి ప్లీనరీలో జగన్ చేసిన చరిత్రాత్మక ప్రసంగం పేదల్లో, బడుగుల్లో ఆశావాదాన్ని, విశ్వాసాన్ని, భరోసాను, ధీమాను నింపింది. ఇదంతా జరగుతుందని నమ్మలేని సందేహసింహులు ఒక్కసారి ఆరేళ్ల వైఎస్ఆర్ స్వర్ణయుగాన్ని చూస్తే చాలు. వారి అనుమానాలు పటాపంచలవుతాయి.  వైఎస్ ఆర్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న వైఎస్ జగన్ ఇంకా ఎన్నెన్నో విప్లవాత్మక మేళ్లను ప్రజల ముంగిట్లోకి తీసుకురావడం ఖాయం. 

మెరుగైన ఆంధ్రప్రదేశ్ కు ప్రాణం పోసేందుకు రండి!! జగన్ తో చేతులు కలపండి.

 


Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com